హైదరాబాద్‌లో రెట్టింపైన ట్రాఫిక్ జరిమానాలు

Traffic Violation
హైదరాబాద్: నోపార్కిగ్ స్థలంలో వాహనం పార్క్ చేశారా? ఎవరూ గమనించడం లేదని సిగ్నల్ జంప్ చేశారా? సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నారా? అయితే, ఇక చేతి చమురు వదిలించుకోవాల్సిందే..! చూడటానికి ఇవి చిన్న చిన్న ట్రాఫిక్ తప్పులే కావచ్చు, కానీ ఈ తప్పుల కోసం వసూలు జరిమానా మాత్రం చిన్నది కాదు. నగరంలో ట్రాఫిక్ తప్పిదాలకు విధించే జరిమానాలు రెట్టింపు అయ్యాయి.

తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు పారాహుషార్..! ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కోసం జరిమానాలో పెంపును విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన పాత ఆదేశాలను హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చారు. భారత ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో ఎమ్ఎస్ 108 ప్రకారం పెనాల్టీలను రూ.1,000 లకు పెంచడం జరిగింది.

ఈ కొత్త జరిమానాలను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో వీటిని తాజాగా అమల్లోకి తీసుకువచ్చారు. ఇది వరకు ప్రమాదకరంగా/తప్పుగా పార్కింగ్ చేసినందుకు గాను రూ.200-300 ఉండే జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది. అలాగే, సిగ్నల్ జంప్ చేసిన వారి నుంచి ఇదివరకు రూ.200-300 వసూలు చేసే జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది. ఇకపోతే సెల్‌ఫోన్ డ్రైవింగ్ విషయంలో ఇదివరకూ రూ.500 లుగా ఉన్న జరిమానా ఇప్పుడు రూ.1,000 లకు పెరిగింది.

మూలం: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

Most Read Articles

English summary
Hyderabad City Traffic Police recently started implementing the government’s old order on enhancement of fines for traffic violations. Penalties have been raised to Rs 1,000 according to the GO MS 108 issued in 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X