భారత్‌కు రానున్న యమహా ఆర్25 కాన్సెప్ట్: వీడియో

యమహా స్పోర్ట్స్ బైక్ ప్రియులకు మరొక గుడ్ న్యూస్. జపనీస్ టూవీలర్ మేజర్ యమహా ఓ పవర్‌ఫుల్ 250సీసీ బైక్‌ను తయారు చేసింది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ మోటార్ షోలో యమహా తమ సరికొత్త 'ఆర్25' కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్టే అయినప్పటికీ, త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకోనుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటటే, ఈ క్వార్టర్ లీటర్ (250సీసీ) 'యమహా ఆర్25' బైక్‌ను ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం, యమహా భారత మార్కెట్లో 150సీసీ ఇంజన్ కలిగిన ఆర్15 బైక్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, ఆర్15‌కు ఎగువన 250సీసీ ఇంజన్ కలిగిన ఆర్25ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

Yamaha R25 Concept

కొత్త యమహా ఆర్25 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్250ఆర్, కరిజ్మా జెడ్ఎమ్ఆర్, కవాసకి నిన్జా 300 వంటి స్పోర్ట్స్ బైక్‌లతో తలపడనుంది. యమహా ఆర్25 డిజైన్ కంపెనీ అందిస్తున్న ఆర్1, ఆర్6 వంటి రేస్ ట్రాక్ బైక్‌ల డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 250సీసీ పారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు.

ఆర్15 బైక్‌లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్లను కూడా ఆర్25లో గమనించవచ్చు. వాస్తవానికి దీనిని ఆర్15కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. ఆర్15లో స్టీల్ స్పార్స్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తే ఈ కొత్త ఆర్25లో ట్యూబ్లర్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. భారత్‌లో ఈ బైక్‌ను పొందాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈలోపుగా కొత్త యమహా ఆర్25 బైక్ వీడియోను వీక్షిద్దాం రండి..!
<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ck3M0BumS4I?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

Most Read Articles

English summary
The Japanese bike maker Yamaha already sells the R15, a 150c sports bike in India, but has no other machine to further expand its clout. Enter the new R25. Still in concept form, the new 250cc bike has made its debut in Tokyo, with a launch expected in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X