టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన బజాజ్ పల్సర్ 200ఎస్ఎస్!

By Ravi

గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో రెండు సరికొత్త 400సీసీ మోడళ్లను (400ఎస్ఎస్, 400సిఎస్) ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. వాస్తవానికి ఇవి రెండూ కూడా 400సీసీ బైక్‌లు కాదు. ఇందులో 375సీసీ ఇంజన్లను ఉపయోగించారు.

అయితే, ఈ బైక్‌ల కన్నా ముందుగా బజాజ్ ఆటో 200ఎస్ఎస్, 200సిఎస్ మోడళ్లను విడుదల చేయటం లేదా కనీసం ప్రదర్శించడం చేస్తుందని మనలో చాలా మంది ఊహించి ఉంటారు. ఇప్పుడు ఆ ఊహ నిజం కానుంది. ప్రస్తుతం బజాజ్ తమ 200ఎస్ఎస్ బైక్‌ను టెస్ట్ చేస్తోంది.


బజాజ్ 200ఎస్ఎస్ బైక్ టెస్టింగ్ దశలో ఉండగా, ఆ దృశ్యం డ్రైవ్‌స్పార్క్ కెమెరాకు చిక్కింది (క్రింది ఫొటోలో చూడొచ్చు). బైక్‌ను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా దీనిని పూర్తిగా క్యామోఫ్లేడ్జ్ చేశారు. దీని డిజైన్ చూడటానికి 400ఎస్ఎస్ మాదిరిగానే ఉంటుంది.

బజాజ్ 200ఎస్ఎస్ ఉత్పత్తి దశకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఇది మార్కెట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. పోటీతత్వ వాతావరణంతో కూడుకున్న ద్విచక్ర వాహన విభాగంలో తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు బజాజ్ ఆటో గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Pulsar 400SS

ఇందులో భాగంగానే, ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే 150, 180ఎన్ఎస్, 200ఎస్ఎస్, 200ఎన్ఎస్ మరియు ఎంతగానో ఎదురుచూస్తున్న 400ఎస్ఎస్, 400సిఎస్ మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్ బైక్‌లోని ఇంజన్‌నే ఈ కొత్త 200ఎస్ఎస్‌లోను ఉపయోగించనున్నారు. మంచి పెర్ఫార్మెన్స్, మెరుగైన మైలేజ్ కోసం బజాజ్ ఆటో ఇందులో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను పరిచయం చేసే అవకాశాలున్నాయి.

Most Read Articles

English summary
Bajaj Pulsar 200SS was caught testing close to their Pune plant. The Pulsar 200SS had minimal camouflage, stating a launch is on the horizon by Bajaj.
Story first published: Wednesday, April 9, 2014, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X