భారత్ కోసం హోండా లో-కాస్ట్ మోటార్‌సైకిల్

By Ravi

యమహా ఇటీవలే ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా.. మరో జపనీస్ టూవీలర్ మేకర్ హోండా కూడా, భారత మార్కెట్లో ఓ చవకైన మోటార్‌సైకిల్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించింది.

భారత్‌లో హోండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలోనే ఈ లో-కాస్ట్ మోటార్‌సైకిల్ డిజైన్, డెవలప్‌మెంట్ జరగనుంది. ఈ జపనీస్ టూవీలర్ కంపెనీ ఇప్పటికే దక్షిణాఫ్రికా మార్కెట్లలో 600 డాలర్ల వెల (సుమారు రూ.37,808) కలిగిన బడ్జెట్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.

వచ్చే ఏడాది భారత్‌లో మొత్తం 10 కొత్త మోటార్‌‍సైకిళ్లను విడుదల చేసేందుకు కూడా హోండా సన్నాహాలు చేస్తోంది. ఇందులో 7 సరికొత్త మోడళ్లు ఉండనున్నాయి, మిగిలినవి ప్రస్తుత మోడళ్లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్లు ఉంటాయి. వచ్చే ఏడాది రెండెంకెల వృద్ధిని సాధించే లక్ష్యంగా దిశగా హోండా ఈ విస్తరణ ప్రణాళిక చేపట్టింది.

Honda CD Dream 110

ప్రస్తుతం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి లభిస్తున్న అత్యంత చవకైన మోటార్‌సైకిల్ 'హోండా సిడి 110 డ్రీమ్' (Honda CD 110 Dream). ఇందులో ఉపయోగించిన 110సీసీ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.63 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరు పెట్రోల్‌కు 74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
Most Read Articles

English summary
Honda Motorcycles and Scooters India (HMSI) is planning a low cost motorcycle, specially designed for the Indian market. The design and development for this low-cost motorcycle from Honda, will have its R&D done here in India.
Story first published: Friday, December 19, 2014, 17:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X