నవంబర్‌లో 52 శాతం పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్

By Ravi

ఐషర్ మోటార్స్‌కి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన నవంబర్ నెల అమ్మకాలలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. కంపెనీ అందిస్తున్న అన్ని రకాల మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. నవంబర్ 2013తో పోల్చుకుంటే నవంబర్ 2014లో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 57 శాతం వృద్ధిని సాధించాయి.

గడచిన నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తంగా 27,542 మోటార్‌సైకిళ్లను విక్రయించగా అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మొత్తంగా 18,131 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. నవంబర్ 2014లో దేశీయ విపణిలో 27,198 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, అంతకు ముందు సంవత్సరంలో ఇవి 17,752 యూనిట్లుగా ఉన్నాయి.

అయితే, ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 9 శాతం క్షీణించాయి. నవంబర్ 2013లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 379 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయగా, ఈ ఏడాది నవంబర్ నెలలో కేవలం 344 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది.

Royal Enfield

ఈ సమయంలో కంపెనీ అందిస్తున్న 350సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 54 శాతం వృద్ధి చెంది 16,017 యూనిట్ల నుంచి 24,610 యూనిట్లకు పెరగగా, 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 39 శాతం వృద్ధి చెంది 2,114 యూనిట్ల నుంచి 2,932 యూనిట్లు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఉండే భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వాటి వెయింట్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ చెన్నై సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటులో మరో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ, 500సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Royal Enfield reported a 52 per cent jump in total sales in November at 27,542 units as against 18,131 units in the same month last year.
Story first published: Tuesday, December 2, 2014, 11:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X