వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తి పెంపు

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్ త్వరలోనే తగ్గనుంది. ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సుమారు రూ.600 కోట్ల పెట్టుబడితో తమ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లకు సుధీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రస్తుతం రెండు ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో తిరువొట్టియూర్‌లోని ఉంటే మరొకటి కూడా తమిళనాడులోని ఒరగడంలో ఉంది. ఇందులో ఓరగడం ప్లాంట్ కొత్తగా ఏర్పాటు చేసినది. ఇది తిరువొట్టియూర్ ప్లాంట్ కన్నా చాలా పెద్దది.

Royal Enfield

ఇదివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు మోడల్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ చాలా అధికంగా (సుమారు 9 నెలల వరకు) ఉండేది. అయితే, ఓరగడం ప్లాంట్ నిర్వహణలోకి వచ్చిన తర్వాత ఈ వెయిటింగ్ క్రమంగా తగ్గింది. ఈ ప్లాంట్‌లో పెయింట్ షాప్, వెహికల్ అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయి.

ఈ ప్లాంట్‌లో త్వరలోనే ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ బేను కూడా నిర్మించనున్నారు. ఇది కూడా నిర్వహణలోకి వస్తే, సుమారు ఒక్క నెల వెయిటింగ్ పీరియడ్‌తోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు కస్టమర్ల వద్దకు చేరే అవకాశం ఉంది.


చాలా కాలం నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఈ సెగ్మెంట్లో ఎలాంటి బలమైన కాంపిటీటర్ ఇండియన్ మార్కెట్లో లేదు. కంపెనీ ఇటీవల విడుదల చేసిన కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌తో తాము నాణ్యమైన గ్లోబల్ స్టాండర్డ్ మోటార్‌సైకిళ్లను కూడా తయారు చేయగలమని నిరూపించింది.

జనవరి 2014 నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 85 శాతం మేర వృద్ధి చెందాయి. బ్రిటన్‌కు చెందిన ట్రైయంప్, అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్ మొదలైన గ్లోబల్ టూవీలర్ కంపెనీలు ఈ మధ్య కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీనిచ్చేందుకు తక్కువ ధర కలిగిన ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గటం అనేది ఆహ్వానించదగిన విషయం. మీరేమంటారు..?

Most Read Articles

English summary
Indian motorcycle brand, Royal Enfield is known for two things: its iconic thumping bike and extensive waiting periods for its motorcycles. Royal Enfield is currently owned by Eicher Motors - it has decided to boost the production of the motorcycle by investing approximately INR 600 crore in an effort to decrease the waiting period for its buyers.
Story first published: Saturday, May 31, 2014, 14:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X