పల్స్‌రైజింగ్ పల్సర్ ఏబీఎస్ పని తీరు సూపర్?
బజాజ్ ఇటీవల తన ఫుల్లీ ఫెయిర్ మోటర్ సైకిల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. దానికి పల్సర్ ఆర్ఎస్200గా నామకరణం చేసింది. ఆర్ఎస్ అంటే రేస్ స్పోర్ట్.
ఈ మోటర్ సైకిల్‌ను యువ కొనుగోలుదారులను ఆకర్షించేలా అభివృద్ధి చేసింది. బజాజ్ ఇందులో ఏబీఎస్ పరికరాన్ని అందుబాటు ధరలో కల్పించింది.
ఏబీఎస్ పరికరం లేని వాటితో సమానంగా ఏబీఎస్ పరికరం ఉన్న మోటర్ సైకిళ్లు అమ్ముడవుతున్నట్లు ఈ భారత ద్వి-చక్రవాహన తయారీ సంస్థ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కొనుగోలుదారులు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఏబీఎస్ అంటే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది అత్యవసర సమయాల్లో వాహనాన్ని నిలిపేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఏబీఎస్ పరికరం ఉన్న పల్సర్ ధర రూ.1,30,268 (ఎక్స్-షోరూమ్,ముంబై). ఏబీఎస్ పరికరం లేని దాని ధర సుమారు రూ.12,000 తక్కువ. ఇది భద్రతకు చాలా తక్కువ ధర.
వీడియో : ఏబీఎస్ పరికరం పని తీరును వీక్షించండి.....


Click it and Unblock the Notifications








