హోండా సిబి హార్నెట్ వర్సెస్ సుజుకి జిక్సర్ కంపారిజన్

By Anil

భారతీయ మార్కెట్లో గల 150 సీసీ సెగ్మెంట్లో ఉన్న ఉత్తమమైన టూ వీలర్ సుజుకి జిక్సర్. యమహా యఫ్‌జడ్ తో పాటు మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించుకుంటూ టూ వీలర్ ప్రపంచంలో ఒక మంచి 150 సీసీ బైక్‍‌‌గా పేరు తెచ్చుకుంది.

ఇంత వరకు బాగానే ఉంది, కాని ఇప్పుడు ఈ 150సీసీ సెగ్మెంట్లో ఉన్న సుజుకి జిక్సర్ కు పోటిగా హోండా వారి సిబి హార్నెట్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. అయితే ఈ రెండింటికి మధ్య ఇప్పుడు గట్టి పోటినే ఉంది. అందుకోసం డ్రైవ్‌‌స్పార్క్ మీ కోసం వీటి మధ్య గల వ్యత్యాసాలను వివరంగా క్రింది కథనం ద్వారా అందిస్తోంది.

 ధర

ధర

  • హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ధర రూ. 88,000
  • సుజుకి జిక్సర్ ధర రూ. 85,000
  • గమనిక: రెండు ధరలు దాదాపుగా ఆన్-రోడ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

    సిబి హార్నెట్ 160 ఆర్ డిజైన్

    సిబి హార్నెట్ 160 ఆర్ డిజైన్

    హోండా సిబి హార్నెట్ 160 ఆర్ డిజైన్‌లో ఎక్కువగా పదునైన గీతలు ఉన్నాయి. ఇది దీని భవిష్యత్తు డిజైన్ అని చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే ఇది సిఎక్స్-01 మోడల్‌ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ సిఎక్స్-01 మోడల్ బైక్‌ను 2014 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించారు. హార్నెట్ కు ముందు భాగంలో గల ఇండికేటర్ ల్యాంప్స్ హెడ్ లైట్ పై భాగంలో డిజైన్ చేశారు.

    సుజుకి జిక్సర్ డిజైన్

    సుజుకి జిక్సర్ డిజైన్

    సుజుకి జిక్సర్ కూడా చూడటానికి చాలా స్పోర్టివ్‌గా ఉంటుంది. ఇది పొట్టిగా మరియు కొన్ని భాగాలను గుండ్రంగా ఉండేట్లు డిజైన్ చేశారు. అయితే రెండు మోడల్స్ కూడా డిజైన్ పరంగా చాలా బాగున్నాయి.

    సిబి హార్నెట్ ఇంజన్

    సిబి హార్నెట్ ఇంజన్

    హోండా సిబి హార్నెట్ 160 ఆర్ లో సింగల్ సిలిండర్ గల 162.71సీసీ కెపాసిటి గల ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

     సుజుకి జిక్సర్ ఇంజన్

    సుజుకి జిక్సర్ ఇంజన్

    సుజుకి జిక్సర్‌లో 154.9సీసీ గల సింగల్ సిలిండరక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

    సిబి హార్నెట్ పవర్ మరియు మైలేజ్

    సిబి హార్నెట్ పవర్ మరియు మైలేజ్

    సిబి హార్నెట్ లో గల ఫోర్ స్ట్రోక్ ఇంజన్ దాదాపుగా 15.6 బిహెచ్‌పి పవర్ మరియు 14.7 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు, హార్నెట్ మైలేజ్ లీటర్‌కు 58.9 కిలో మీటర్లు ఇస్తుంది.

    సుజుకి జిక్సర్ పవర్ మరియు మైలేజ్

    సుజుకి జిక్సర్ పవర్ మరియు మైలేజ్

    సుజుకి జిక్సర్ లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 15 బిహెచ్‌పి మరియు 14 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌న ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు, సుజుకి జిక్సర్ లీటర్‌కు 45 కిలో మీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

    హోండా సిబి హార్నెట్ ఫీచర్లు

    హోండా సిబి హార్నెట్ ఫీచర్లు

    ఇందులో వెనుకవైపున డిస్క్‌ను కల్పించారు, కాంబి బ్రేక్ సిస్టమ్(సిబియస్), ఫుల్లీ డిజిటల్ మీటర్, పెటల్ డిస్క్‌లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ , వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్, వెనుక 140 మరియు ముందు 100 సెక్షన్ గల టైర్లు, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    సుజుకి జిక్సర్ ఫీచర్లు

    సుజుకి జిక్సర్ ఫీచర్లు

    సుజుకి జిక్సర్‌లో ఫల్లీ డిజిటల్ మీటర్ కన్సోల్, ముందు వైపు టెలిస్కోపిక్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు, వెనుక 140 మరియు ముందు వైపున 100 సెక్షన్ గల టైర్లు, అల్లాయ్ వీల్స్, ముందు వైపున స్టాండర్డ్ డిస్క్ వంటి ఫీచర్లు దాదాపుగా సిబి హార్నెట్ లో గల అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

     తీర్పు

    తీర్పు

    ఇందులో బెస్ట్ బైక్ ఏది చెప్పాలంటే కొంచం కష్టం ఎందుకంటే ఇంజన్, ఫీచర్లు, డిజైన్, ధర వంటి అన్ని అంశాలు రెండింటిలో దాదాపుగా సమానంగా ఉన్నాయి. మీకు మంచి రైడింగ్ అనుభూతి కావాలంటే సుజుకి జిక్సర్‌ను ఎంచుకోండి. కాని మైలేజ్ ఎక్కువగా ఉండాలంటే హోండా సిబి హార్నెట్ ను ఎంచుకోండి. ఎందుకు అంటే ఈ సెగ్మెంట్‌లో ఇది ఉత్తమ మైలేజ్ ఇవ్వగల బైక్‌‌.

    టూ వీలర్ న్యూస్
    1. సిబి హార్నెట్ 160 ఆర్ ను 79,900 రుపాయలకు మార్కెట్లోకి విడుదల చేసిన హోండా
    2. హీరో మోటోకార్ప్ తన సరికొత్త హంక్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

Most Read Articles

English summary
Honda CB Hornet 160R vs Suzuki Gixxer Comparo
Story first published: Saturday, December 12, 2015, 16:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X