ఐబిడబ్ల్యూ 2015: గోవాలో 2000 మందికి పైగా హ్యార్లీ ఓనర్స్ గర్జన

Written By:

గోవాలో జరుగుతున్న భారతదేశపు అతిపెద్ద బైకర్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2015 ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 20, 2015) నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న 2000 మందికి పైగా హ్యార్లీ డేవిడ్‌సన్ రైడర్లు తమ బైక్‌లతో వచ్చి సందడి చేస్తున్నారు. హ్యార్లీ ఓనర్ల కోసం ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేశారు.

హెచ్.ఓ.జి (హ్యార్లీ ఓనర్స్ గ్రూప్) ఇండియా మూడవ జాతీయ ర్యాలీ మరియు ఇండియా బైక్ వీక్ కోసం 2000 మందికి పైగా హ్యార్లీ ఓనర్లు తమ కుటుంబ సభ్యులతో సహా గోవాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, భారత మార్కెట్లోకి ప్రవేశించి ఈ ఏడాదితో మొత్తం ఐదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా గోవాలోని వగతోర్ ప్రాంతమంతా హ్యార్లీ ఓనర్లతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. గడచిన సంవత్సరం జరిగిన ఇండియా బైక్ వీక్ 2014లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ సరికొత్త స్ట్రీస్ 750 మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. కాగా.. ఈ ఏడాది అదే స్ట్రీట్ 750ని ఆధారంగా చేసుకొని కస్టమైజ్ చేయబడిన ఓ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

English summary
Goa is all set to give a roaring welcome to over 2,000 Harley owners and their families as they come together for the H.O.G. India 3rd National Rally and India Bike Week. The most awaited week of the year for Harley-Davidson owners, this year’s edition is all the more special with the brand celebrating the completion of 5 years in the country.
Story first published: Saturday, February 21, 2015, 10:56 [IST]
Please Wait while comments are loading...

Latest Photos