ధర, మైలేజ్, మరియు సేల్స్ పరంగా భారత దేశపు 5 ఉత్తమ పనితీరు గల స్కూటర్లు

ఒకానొక కాలంలో బజాజ్ వారి స్కూటర్లు గుర్తున్నాయా ? అప్పట్లో స్కూటర్లను కొనాలంటే వాటిని బుక్ చేసుకున్న తరువాత డెలివరీ కోసం సుమారుగా ఆరు నెలల నుండి ఏడాది పాటు ఎదురుచూసిన రోజులు కూడా ఉండేవి. ఎంచుకోవడానికి రకరకాల స్కూటర్లు ఉండేవి కాదు ఉన్న వాటినే ఎంచుకోవాలి. ఇది కొన్నేళ్ల క్రిందటి స్కూటర్ల మార్కెట్.

నేటి స్కూటర్ల మార్కెట్ ఎలా ఉందంటే భారతీయ వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం రెండవస్థానంలో ఉంది. నేడు డబ్బులుంటే చాలు కొన్ని పదుల సంఖ్యలో వివిధ రకాల డిజైన్,రంగులు మరియు ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఎంచుకోవడానికి వివిధ రకాల స్కూటర్లు ఉన్నపుడు ఉత్తమమైనదానినే ఎంచుకుంటాము. అందులో ధర, ఫీచర్లు, మైలేజ్, సేల్స్ మరియు పనితీరు వంటి అంశాలను పరిశీలించి మరీ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇండియన్ మార్కెట్లో ఈ అన్ని అంశాల పరంగా ఉత్తమంగా ఉన్నఐదు బెస్ట్ స్కూటర్ల గురించి ఈ కథనం ద్వారా అందిస్తున్నాము.

5. సుజుకి యాక్సెస్ 125

5. సుజుకి యాక్సెస్ 125

జపాన్‌కు చెందిన ద్విచక్రవాహనాల తయారీ సంస్థ సుజుకి ఎప్పటికప్పుడు రీఫ్రెష్‌డ్ ఉత్తత్తులను విడుదల చేస్తూ వస్తోంది . తాజాగ సుజుకి తమ యాక్సెస్ 125 ను ఫేస్‌‌లిఫ్ట్ మోడల్‌లో విడుదల చేసింది. ఇందులో శక్తివంతమైన 125సీసీ కెపాసిటి, సివిటి గేర్‌బాక్స్‌ గల ఇంజన్‌ కలదు. ఇది సుమారుగా 8.5 బిహెచ్‌పి పవర్ మరియు లీటర్‌కు 43 కిమీల మైలేజ్‌ ఇవ్వగలదు.

యాక్సెస్ 125 ధర మరియు సేల్స్ వివరాలు

యాక్సెస్ 125 ధర మరియు సేల్స్ వివరాలు

  • యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ ధర రూ. 53,134 లు
  • యాక్సెస్ 125 స్టాండర్డ్ ధర రూ. 50,556 లు
  • సుజుకి యాక్సెస్ అమ్మకాలు:

    • 2016 జనవరి అమ్మకాలు: 14,482 యూనిట్లు
    • 2016 ఫిబ్రవరి అమ్మకాలు: 13,189 యూనిట్లు
    • 2016 మార్చి అమ్మకాలు: 11,387 యూనిట్లు
    • 4. హీరో డ్యూయెట్

      4. హీరో డ్యూయెట్

      భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరోమోటోకార్ప్ దేశీయ మార్కెట్లోకి పెద్ద ఛాసిస్. ధృడమైన మెటల్ బాడీ మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో డ్యూయెట్ స్కూటర్‌ను అందించింది. హీరో డ్యూయెట్‌లో 111 సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే ఇంజన్ కలదు. ఇది ఎల్‌ఎక్స్ మరియు విఎక్స్ వంటి వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఫీచర్ల పరంగా మొబైల్ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ట్యూబ్ లెస్ టైర్లు, ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు బూట్ లైట్ వంటివి కలవు.

      హీరో డ్యూయెట్ ధర మరియు సేల్స్ వివరాలు

      హీరో డ్యూయెట్ ధర మరియు సేల్స్ వివరాలు

      • హీరో డ్యూయెట్ ఎల్ఎక్స్ ధర రూ. 47,100 లు
      • హీరో డ్యూయెట్ విఎక్స్ ధర రూ. 48,600 లు
      • హీరో డ్యూయెట్ అమ్మకాలు:

        • 2016 జనవరి అమ్మకాలు: 24,239 యూనిట్లు
        • 2016 ఫిబ్రవరి అమ్మకాలు: 31,456 యూనిట్లు
        • 2016 మార్చి అమ్మకాలు: 34,593 యూనిట్లు
        • 2016 ఏప్రిల్ అమ్మకాలు: 39,271 యూనిట్లు
        • 3. హీరో మాయెస్ట్రో

          3. హీరో మాయెస్ట్రో

          హీరో మోటోకార్ప్ ఈ మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌తో సురక్షితమైన రైడింగ్ చేయడానికి కాంబిబ్రేక్ సిస్టమ్‌ను అందించింది. స్మూత్ రైడింగ్‌ అనుభూతిని కలిగించే ఇందులో 110.9 సీసీ కెపాసిటి గల 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 8.31బిహెచ్‌పి పవర్ మరియు 8.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ ప్రకారం ఇది లీటర్‌కు 65 కిమీల మైలేజ్‌ను ఇవ్వగలదు.

          మాయెస్ట్రో ఎడ్జ్ ధర మరియు సేల్స్ వివరాలు

          మాయెస్ట్రో ఎడ్జ్ ధర మరియు సేల్స్ వివరాలు

          • మాయెస్ట్రో ఎడ్జ్ విఎక్స్ ధర రూ. 50,700 లు
          • మాయెస్ట్రో ఎడ్జ్ ఎల్‌ఎక్స్ ధర రూ. 49,500 లు
          • మాయెస్ట్రో ఎడ్జ్ అమ్మకాలు:

            • 2016 జనవరి అమ్మకాలు: 48,002 యూనిట్లు
            • 2016 ఫిబ్రవరి అమ్మకాలు: 42,815 యూనిట్లు
            • 2016 మార్చి అమ్మకాలు: 40,388 యూనిట్లు
            • మార్చి చివరి వరకు మొత్తం అమ్మకాలు సుమారుగా 1,31,205 యూనిట్లు.
            • 2. టీవీఎస్ జూపిటర్

              2. టీవీఎస్ జూపిటర్

              టీవీఎస్ మోటార్స్ ప్రారంభంలో దీనిని యువతనుద్దేశించి డిజైన్ చేశారు. సౌకర్యవంతమైన సీటింగ్ ఇందులో కలదు. 2014 ఏడాదికి గాను బెస్ట్ స్కూటర్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు కూడా ఎంపికయ్యింది. ఇందులో 109 సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇందులో పవర్ మరియు ఎకో రెండు మోడల్‌ల వద్ద అత్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది లీటర్‌కు 60 కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

              టీవీఎస్ జూపిటర్ ధర మరియు సేల్స్ వివరాలు

              టీవీఎస్ జూపిటర్ ధర మరియు సేల్స్ వివరాలు

              • జూపిటర్ మిలియన్ ఎడిషన్ ధర రూ. 49,034 - 51,057 ల మధ్య కలదు.
              • జూపిటర్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 48,809 లు
              • జూపిటర్ జడ్‌ఎక్స్ ధర రూ. 50,832 లు
              • టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు:

                • 2016 జనవరి అమ్మకాలు: 42,838 యూనిట్లు
                • 2016 ఫిబ్రవరి అమ్మకాలు: 47,712 యూనిట్లు
                • 2016 మార్చి అమ్మకాలు: 51,597 యూనిట్లు
                • మార్చి చివరి వరకు మొత్తం జూపిటర్ అమ్మకాలు సుమారుగా 1,42,147 యూనిట్లు.
                • 1. హోండా ఆక్టివా 125

                  1. హోండా ఆక్టివా 125

                  హోండా ఆక్టివా 125, దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాసల పరంగా మరియు స్కూటర్ల పరంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న స్కూటర్ హోండా వారి ఆక్టివా 125. ఇందులో 125 సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 8.6బిహెచ్‌పి@6,000 ఆర్‌పిఎమ్ మరియు 10.1 ఎన్ఎమ్@5,500 ఆర్‌పిఎమ్. హోండా ఇందులో అందించిన ఇకో టెక్నాలజీ ద్వారా ఇది లీటర్‌కు 60 కిమీల మైలేజ్‌ను ఇవ్వగలదు.

                  హోండా ఆక్టివా 125 ధర మరియు సేల్స్ వివరాలు

                  హోండా ఆక్టివా 125 ధర మరియు సేల్స్ వివరాలు

                  • హోండా ఆక్టివా 125 స్టాండర్డ్ ధర రూ. 56,073 లు
                  • హోండా ఆక్టివా 125 డీలక్స్ ధర రూ. 60,489 లు
                  • హోండా ఆక్టివా 125 అమ్మకాలు:

                    • 2016 జనవరి అమ్మకాలు: 2,10,123 యూనిట్లు
                    • 2016 ఫిబ్రవరి అమ్మకాలు: 2,10,028 యూనిట్లు
                    • 2016 మార్చి అమ్మకాలు: 2,19,926 యూనిట్లు
                    • 2016 ఏప్రిల్ అమ్మకాలు: 2,19,820 యూనిట్లు
                    • గమనిక: అన్ని స్కూటర్ల యొక్క ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
                      ధర, మైలేజ్, సేల్స్ మరియు ఉత్తమ పనితీరు గల టాప్-5 బెస్ట్ స్కూటర్లు

                      భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్, నెలకు 2 లక్షల అమ్మకాలు

                      ఒక కొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే హోండా నవీ రివ్యూ

Most Read Articles

English summary
Best 5 Scooters in India 2016 in Terms of Performance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X