స్క్రాప్ తో తయారు చేసిన ఈ బైకు నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడుస్తుంది

బీహార్‌కు చెందిన ఒక కుర్రాడు గుజిరి అంగడిలో లభించే పాత సామాన్లతో మూడు చక్రాలను కలిగి ఉండే విభిన్నమైన బైకును రూపొందించాడు. ఇది పెట్రోల్, డీజల్, కిరోసిన్ మరియు ఎల్‌పిజి గ్యాస్ తో కూడా నడుస్తుంది.

By Anil

ఆవిష్కరణలకు, అల్లరికి రెండింటి ఊతమైన ప్రాయాన్ని కుర్రకారు అని సింపుల్‌గా చెప్పవచ్చు. అలాంటి కుర్రకారు చేతిలో ఏ వస్తువైనా పడనీ దాని నుండి ఒక ఆవిష్కరణ బయటపడుతుంది. దీనికి బాగా సరిపోయే ఉదాహరణ ఐజర్ అలీ ప్రయోగం. గుజరీ అంగడిలో ఉన్న పనికిరాని స్క్రాప్ ద్వారా మూడు చక్రాల బైకును తయారు చేశాడు. ఇందులో ఏముంది మూడు చక్రాలు ఉంటే ఎవరైనా చేస్తారు అనుకోవచ్చు. అయితే ఇతని ప్రయోగంలో అబ్బురపరిచే రూపకల్పన ఒకటుంది. ఏమిటంటే ఆ బైకు పెట్రోల్, డీజల్ మరియు కిరోసిన్‌తో పాటు ఎల్‌పిజి గ్యాస్‌తో కూడా నడుస్తుంది.

చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ... అయితే రండి పూర్తి వివరాలు తెలుసుకుందాం....

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

అంతా బాగానే ఉంది మీ స్టోరీ చదువుతుంటే 2006 లో అజయ్ దేవ్‌గణ్ నటించిన గోల్‌మాల్ చిత్రంలో హీరో బైకును రూపొందించిన స్టోరీని రాశారని అనేరు. ఉత్తర బీహార్‌కు చెందిన ఐజర్ అలీ తన రియల్ లైఫ్‌లో ఈ రియల్ బైకును రూపొందించాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

అయితే గోల్‌మాల్ చిత్రాన్ని చూసి ప్రేరితమైన అలీ ఎలాగైనా అచ్చం అలాంటి బైకునే తయారు చేయాలనే సంకల్పంతో నిజ జీవితంలో ఆ బైకును తయారు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఐజర్ అలీ ప్రయోగం వెనుక అజయ్ దేవ్‌గణ్ చిత్రం కూడా ఉందనాలి.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

గోల్‌మాల్ చిత్రం ప్రభావం ఐజర్ అలీ మీద బాగానే పడిందని చెప్పాలి. సినిమా చూసిన అనంతరం గుజరీ షాప్‌కు వెళ్లి ఈ బైకు కోసం కావాల్సిన విడి బాగాలను కొనుగోలు చేసాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ఇంజన్ మరియు ఫ్రేమ్ కోసం యమహా ఎంటీసర్ బైకును 15,000 రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

రెండు చక్రాలున్న ఈ బైకు చివరలో మరో చక్రాన్ని అందించాడు. మరింత పొడవైన సీటుతో త్రీ వీలర్‌గా మారిపోయింది..

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

యమహా అందించిన బైకు లోని ఇంధన ట్యాంకును తొలగించి దాని స్థానంలో పెద్ద పరిమాణంలో ఉన్న ఇంధన ట్యాంకును అందించాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ఇంధన ట్యాంకుని లోపల వైపున రెండు భాగాలుగా చేశాడు. మొదటి సగ భాగంలో పెట్రోల్ మరియు రెండవ సగ భాగంలో డీజల్ లేదా కిరోసిన్ నింపుకోవచ్చు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ఈ మూడు ఇంధనాలతో పాటు ఎల్‌పిజి గ్యాస్‌తో కూడా నడుస్తుంది కాబట్టి 3,200 రుపాయల విలువైన ఎల్‌పిజి కిట్‌ను ఇందులో అమర్చాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ఐజర్ అలీ ఫ్యామిలీ మరియు స్నేహితుల సహకారంతో దీనిని తయారు చేయడానికి మొత్తం 50 రోజుల సమయం తీసుకున్నట్లు తెలిపాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ఎల్‌పిజి మరియు కిరోసిన్ ద్వారా అధిక కాలుష్యాన్ని నిరోధించి పర్యావరణానుకూలంగా రూపొందించినట్లు ఐజర్ అలీ తెలిపాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

ప్రభుత్వం చేయూతనిస్తే తన ప్రయోగాన్ని కొనసాగించి నాలుగు రకాల ఇంధనాలతో నడిచే బైకుని మరింత అభివృద్ది చేస్తానని ఐజర్ తెలిపాడు.

నాలుగు రకాల ప్యూయల్స్‌తో నడిచే బైకు

  • లీటర్ పెట్రోల్ తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్
  • డీజల్, పెట్రోల్ లతో కాదు గాలితో నడిచే కారు...!!

Most Read Articles

English summary
Bihar Boy Builds 3 Wheeler Bike From Scrap Materials
Story first published: Wednesday, November 16, 2016, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X