భారతీయులు మరిచిపోయిన బైకులు

By Anil

ప్రస్తుతం కాలంలో వారానికో బైకు నెలకో కారు చెప్పున విడుదలవుతూనే ఉన్నాయి. ఎన్ని విడుదలయినప్పటికీ కొన్ని మాత్రమే మంచి విజయాన్ని సాధిస్తాయి మరికొన్ని కొన్నేళ్ల పాటు మార్కెట్లో అలాగే ఉండిపోతాయి. ఇది ప్రస్తుతం ఆటోమొబైల్స్ గురించి.

కొన్నేళ్ల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదలై మంచి అమ్మకాలు సాధించిన బైకులు గురించి ఎప్పుడైనా విన్నారా...? అలాంటి బైకులను ఇప్పుడు అందరూ మరచిపోయారనే చెప్పాలి. భారతీయులు మరిచిపోయిన బైకుల గురించి డ్రైవ్‌ స్పార్క్ తెలుగు పాఠకుల కోసం ఆఫ్ బీట్ శీర్షిక ద్వారా ప్రత్యేక కథనం....

 బజాజ్ ఎస్ఎక్స్ ఎండురో

బజాజ్ ఎస్ఎక్స్ ఎండురో

బజాజ్ సంస్థ కవాసకి సంస్థకు చెందిన ఆర్‌టిజడ్100 ఆధారంతో ఎస్ఎక్స్ ఎండురో 2-స్ట్రోక్ బైకుల అమ్మకాలను చేపట్టింది. ఇది చూడటానికి పూర్తి స్థాయిలో ఆఫ్ రోడ్ బైకు తరహాలో ఉంటుంది. అయితే ఇందులోని ఉత్తమ పనితీరు కనబరిచే 100సీసీ ఇంజన్ మరియు ఉత్తమ సస్పెన్షన్ సిస్టమ్ రెండూ ఇందులో ప్రత్యేకం.

కైనటిక్ జిఎఫ్ 170 లేజర్

కైనటిక్ జిఎఫ్ 170 లేజర్

ఇండియన్ మార్కెట్‌ కోసం కైనటిక్ నిర్మించిన అత్యంత శక్తివంతమైన ఉత్పత్తులలో కైనటిక్ జిఎఫ్170 లేజర్ ఒకటి. ఇందులో 14.8బిహెచ్‌పి పవర్ మరియు 14.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 165సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను అందించింది. నాలుగు వాల్వ్‌లు సింగల్ సిలిండర్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఎల్ఎమ్ఎల్ గ్రాప్టర్

ఎల్ఎమ్ఎల్ గ్రాప్టర్

ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లోకి ద్విచక్రవాహనాలను అందించిన సంస్థలలో ఎల్ఎమ్ఎల్ ఒకటి. జిఎఫ్ 170 తరహాలోనే ఎల్‌ఎమ్ఎల్ లైనప్‌లో గ్రాప్టర్‌ బైకును అందుబాటులోకి తెచ్చింది. అది బజాజ్ పల్సర్‌కు పోటీగా ఉండేది. ఇందులో 13.4బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 150సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించారు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

బజాజ్ బాక్సర్ 150

బజాజ్ బాక్సర్ 150

బజాజ్ సంస్థ ఈ బాక్సర్ 150 బైకును ముఖ్యంగా ఆఫ్రికా మార్కెట్‌ కోసం రూపొందించింది. కాని ఇండియాలోకి విడుదల చేసినపుడు పల్లె ప్రాంతాల్లో మంచి అమ్మకాలను సాధించింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఈ బైకులు కనబడుతూనే ఉంటాయి. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బాక్సర్ బైకులకు మంచి గిరాకీ ఉంది.

సుజుకి షావోలిన్

సుజుకి షావోలిన్

1998 కాలంలో అత్యంత శక్తివంతమైన బైకులలో ఇది ఒకటి. ఇందులో 12బిహెచ్‌పి పవర్ మరియు 12.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగల 138.2సీసీ సామర్థ్యం గల 2-స్ట్రోక్ ఇంజన్ ఉండేది. ఆ కాలంలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగిన ఏకైక బైకు కూడా ఇదే. దీని మీద కఠినమైన కాలుష్య నియమాలు విధించడం వలన ఇది మార్కెట్‌ నుండి తప్పుకుంది.

కైనటిక్ జిఎఫ్ 125

కైనటిక్ జిఎఫ్ 125

కైనటిక్ వారి జిఎఫ్ 170 మోడల్‌కు క్రింది స్థానంలో ఉండే విధంగా 2001లో జిఎఫ్ 125 బైకును విడుదల చేసింది. దీనిని హోయసంగ్ మరియు కైనటక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఇందులో 12బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 124.6సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను అందించారు. మరియు అప్పట్లో 4-వాల్వ్ హెడ్ టెక్నాలజీ గల ఏకైక ఉత్పత్తి కూడా ఇదే. ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేకులను కూడా అందించారు.

యమహా ఆర్ఎక్స్ జడ్

యమహా ఆర్ఎక్స్ జడ్

యమహా సంస్థ ఈ ఆర్ఎక్స్ జడ్ బైకును 2000 సంవత్సరంలో విడుదల చేసింది. అందుకు ముందే అందుబాటులోకి తెచ్చిన ఆర్ఎక్స్ 135 తరహాలోని ఇంజన్‌నే ఇందులో అందించారు. అయితే డిజైన్ పరంగా ఇది అప్పట్లో బాగా ఆకట్టుకుంది. భవిష్యత్ డిజైన్ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ బైకు అప్పట్లో మంచి ట్రెండ్ సృష్టించింది. ఇందులో 132సీసీ సామర్థ్యం ఉన్న 2-స్ట్రోక్ ఇంజన్ కలదు, దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇందులోని ఇంజన్ సుమారుగా 14బిహెచ్‌పి పవర్ మరియు 12ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

టీవీఎస్ స్పెక్ట్రా

టీవీఎస్ స్పెక్ట్రా

టీవీఎస్ సంస్థ 1998 లో స్పెక్ట్రా స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో 147.5సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను ఆవిష్కరించింది. ఇది సుమారుగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందించిన ఈ స్కూటర్ టీవీఎస్‌లో చివరిది.

కైనటిక్ బ్లేజ్

కైనటిక్ బ్లేజ్

కైనటిక్ బ్లేజ్ స్కూటర్ ఆ కాలంలో అద్బుతమైన డిజైన్‌నుతో మార్కెట్లోకి వచ్చింది. ఆ కాలంలో మరే ఇతర స్కూటర్లలో లేని విధంగా 2006లో మార్కెట్లోకి వచ్చిన ఇది పూర్తి స్థాయిలో ఇటాలియన్ డిజైన్ లుక్స్‌తో వచ్చింది. ఇందులో అందించిన 165సీసీ సామర్థ్యం గల ఇంజన్ 11.5బిహెచ్‌పి పవర్ మరియు 12ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కాని కొంత కాలానికే అనుకోకుండా మార్కెట్‌ నుండి విరమించుకుంది.

ఎల్ఎమ్ఎల్ ఆడ్రెనో 100

ఎల్ఎమ్ఎల్ ఆడ్రెనో 100

1999లో ఎల్ఎమ్ఎల్ సంస్థ ఈ ఆడ్రెనో బైకును దేశీయంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8.5బిహెచ్‌పి పవర్ మరియు 7.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 4-స్ట్రోక్ 100సీసీ ఇంజన్‌ను అందించింది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఎల్ఎమ్ఎల్ ఆడ్రెనో ఎఫ్ఎక్స్

ఎల్ఎమ్ఎల్ ఆడ్రెనో ఎఫ్ఎక్స్

ఎల్ఎమ్ఎల్ సంస్థ ఆడ్రెనో 100 ను విడుదల చేసిన స్వల్పకాలానికే దీనికి అన్నగా ఆడ్రెనో ఎఫ్ఎక్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఎల్ఎమ్ఎల్ సంస్థ 110సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించింది.

బజాజ్ కాలిబర్

బజాజ్ కాలిబర్

బజాజ్ ఆటో ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి 1998లో కవాసకి సహకారంతో కాలిబర్ బైకును విడుదల చేసింది. ఇందులో 7.5బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 112 సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. మంచి నాణ్యతతో వచ్చిన ఇంజన్‌ సహకారంలో హోడిబాబా బైకును కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

సుజుకి సమురాయ్

సుజుకి సమురాయ్

సుజుకి సంస్థ 1994 లో సమురాయ్ అనే బైకును విడుదల చేసింది. ఆ కాలంలో యువత బాగా మెచ్చిన బైకు ఇది. అంతే కాదు పెద్ద వయస్సు వారు కూడా దీనిని విరివిగా వినియోగించారు. ఇందులో 7.5బిహెచ్‌పి పవర్ మరియు 9.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగల 98.2సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించారు. దీనికి 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందించారు.

టివీఎస్ ఫైరో ఎఫ్2

టివీఎస్ ఫైరో ఎఫ్2

టీవీఎస్ సంస్థ తమ ఫైరో ఎఫ్ఎక్స్ కు కొనసాగింపుగా ఫైరో ఎఫ్2 బైకును అందుబాటులోకి తీసుకువచ్చింది. 12బిహెచ్‌పి పవర్ మరియు 11.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 4-స్ట్రోక్ 147.5సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో 2003లో దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యింది. మంచి అమ్మకాలు సాధించలేని కారణంగా మార్కెట్‌ నుండి తొలగించబడింది.

భారతీయులు మరిచిపోయిన బైకులు

  • దిమ్మ తిరిగే బైకు మోడిఫికేషన్లు : అసలైన ఇండియన్స్ అనిపించుకున్నారు

Most Read Articles

English summary
Forgotten Bikes Of India
Story first published: Friday, August 5, 2016, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X