ఒక్క నెలలో ఆరు లక్షలకు పైగా అమ్మకాలు

Written By:

దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడిచిన అక్టోబర్ 2016 లో 6,6,153 యూనిట్లను విక్రయించింది. ఒకే మాసంలో రెండు పర్వదినాలు రావడం ఈ అమ్మకాలకు బాగా కలిసొచ్చింది. హీరోకు ఇది మొదటిసారి కాదు. ఆగష్టు నుండి ప్రతి నెలా 6 లక్షలకు పైబడి అమ్మకాలతో వరుసగా మూడవ నెలలో కూడా అదే రీతిలో విక్రయాలు చేపట్టింది.

హీరో మోటోకార్ప్ అమ్మకాలు

గడిచిన ఆగష్టు 2016 లో హీరో మోటోకార్ప్ 6,14,424 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే ఆ తరువాత సెప్టెంబర్‌లో మరింత వృద్దితో ఏకంగా 6,74,961 యూనిట్లను విక్రయించింది.

హీరో మోటోకార్ప్ అమ్మకాలు

ఆగష్టు నుండి 2016 ఏడాదిలో మిగిలి ఉన్న ఐదు మాసాల్లో ప్రతి నెలా 6 లక్షలకు పైబడి అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. అందులో వరుసగా మూడు మాసాలు ఊహించని ఫలితాలనిచ్చాయి.

హీరో మోటోకార్ప్ అమ్మకాలు

గడిచిన జూలై-సెప్టెంబర్ 2016 ద్వితీయ త్రైమాసికంలో 18,23,498 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో 15.8 వృద్ది నమోదైంది.

హీరో మోటోకార్ప్ అమ్మకాలు

పండుగ సీజన్‌లో హీరో మోటోకార్ప్ విక్రయదారుల వద్ద స్టాకు కొరత చాలా వరకు ఇబ్బంది పెట్టింది. అయితే భారీ అమ్మకాల తరువాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ల వద్ద డిమాండు సాధారణ స్థాయికి వచ్చిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.

English summary
Read In Telugu: Hero Sells Six Lakh Plus Two-Wheelers For 3rd Straight Month In Oct
Story first published: Friday, November 4, 2016, 16:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos