అథర్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు పెట్టిన హీరో మోటోకార్ప్

Written By:

ద్విచక్ర మరియు ఇతర వాహన రంగానికి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ అంశం ఊతమవ్వనుంది. భవిష్యత్ రవాణా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల మీదనే ఆధారపడనుంది. ఈ నేపథ్యంలో అన్ని వాహన తయారీ సంస్థలు తమ శక్తి మేరకు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు మరియు వాటి పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

కొన్ని సంస్థలు ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాలు అభివృద్ది చేస్తున్న సంస్థల్లోకి నిధులు మళ్లించి వారి సాంకేతికతను పంచుకుంటున్నాయి. అథర్ సంస్థలోకి హీరో మోటోకార్ప్ పెట్టుబడుల అంశం అచ్చం ఇలాంటిదే.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ బహుళ సంస్థ హీరో మోటోకార్ప్ అథర్ టూ వీలర్స్‌లో సుమారుగా 180 కోట్లు రుపాయలు పెట్టుబడి పెట్టి అథర్ ఎనర్జీలో 25-30 శాతం వాటాను సొంతం చేసుకుంది.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

ఇరు సంస్థల యొక్క పరస్పర ఒప్పందం గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెల్లడించనున్నారు.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

అథర్ ఎనర్జీ సంస్థ మూడవ దశ నిధుల సమీకరణలో హీరో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. గతంలో రెండు దశలలో జరిగిన నిధుల సమీకరణ చేసిన సంస్థల ఆధారంగా హీరో ముందుకు వచ్చిందని అథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకులు స్విప్నిల్ మరియు తరుణ్ తెలిపారు.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

గతంలో అథర్ ఎనర్జీలో టైగల్ గ్లోబల్ మరియు ప్లిఫ్‌కార్ట్ అనే బహుళ సంస్థ పెట్టుబడులు పెట్టాయి.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి

స్మార్ట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలో పెట్టిన పెట్టుబడుల్లో హీరో వారి 180 కోట్ల రుపాయలు అత్యధికమని అథర్ సంస్థ తెలిపింది. ఈ నిధులను అథర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అభివృద్దికి వినియోగించనుంది.

అథర్ ఎనర్జీలో హీరో భారీ పెట్టుబడి
 
English summary
Hero MotoCorp Invests Rs. 180 Crore In Ather Energy For 25-30 Percent Stake
Story first published: Thursday, October 27, 2016, 18:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos