745 సీసీ కెపాసిటి గల ఇంజన్‌తో హోండా వారి ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ తమ 745సీసీ సామర్థ్యం ఉన్న రెండు సిలిండర్ల ఇంజన్ కలిగిన అడ్వెంచర్ స్కూటర్‌ను మిలాన్‌లో జరుగుతున్న 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది.

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ గత ఏడాది జరగిన ఎకిమా మోటార్ సైకిల్ ప్రదర్శన వేదిక మీద తమ ఎక్స్-ఎడివి కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. అయితే రియల్ లైఫ్‌లో అలాంటి స్కూటర్లను తయారు చేయడం అసాధ్యం అని అప్పట్లో మార్కెట్ వర్గాలు గుసగులాడాయి. అయితే వారి అలోచనలకు వ్యతిరేకంగా ఈ యేడు జరుగుతున్న అదే మోటార్ సైకిళ్ల ప్రదర్శన వేదిక మీద ప్రొడక్షన్‌కు సిద్దమైన అదే ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్‌ను ప్రదర్శించింది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

ఉత్పత్తికి సిద్దమైన అడ్వెంచర్ స్కూటర్‌ను తీక్షణంగా గమనిస్తే లాంగ్ ట్రావెల్ గల సస్పెన్షన్, వైర్ స్పోక్ వీల్స్, హ్యాండ్ గార్డ్స్, ఎక్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్‌లో స్వల్పంగా ఆఫ్ రోడ్ లక్షణాలతో ఆఫ్ రోడింగ్‌కు కావాల్సిన అత్యుతమ పనితీరును కనబరిచే విధంగా ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దింది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

సాంకేతికంగా ఈ ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్‌లో లిక్విడ్ ద్వారా చల్లబడే 745సీసీ సామర్థ్యం గల రెండు సమాంతరం సిలిండర్లు గల ఇంజన్ కలదు.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

స్కూటర్లలో రెండు సిలిండర్ల రావడం చాలా అరుదు, అడ్వెంచర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇంజన్ అందిస్తోంది హోండా.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 6,250ఆర్‌పిఎమ్ వద్ద 53బిహెచ్‌పి పవర్ మరియు 4,750ఆర్‌పిఎమ్ వద్ద 68ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయును.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్‌లో రెండు సిలిండర్ల ఇంజన్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌మిషన్ కోసం గేర్‌బాక్స్ మాత్రం లేదు, ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ద్వారా చక్రానికి అందుతుంది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా సంస్థ ఈ సరికొత్త ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్ కోసం ట్యూబులర్ స్టీల్ ఛాసిస్ ను నూతనంగా అభివృద్ది చేసింది. మరియు ఎక్స్-ఎడివిలోని ముందువైపున్న ఫోర్క్స్‌ను 41ఎమ్ఎమ్ వరకు అదే విధంగా వెనుక వైపున ప్రి లోడ్ అడ్జెస్టబుల్ షాక్ అబ్జార్వర్ అందించారు.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

ముందు వైపు సస్పెన్షన్ గరిష్టంగా 153.5ఎమ్ఎమ్ వరకు ట్రావెల్ చేస్తుంది మరియు వెనుక వైపున సస్పెన్షన్ గరిష్టంగా 150ఎమ్ఎమ్ వరకు ట్రావెల్ చేస్తుంది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్ ముందు వైపున 17-అంగుళాల వీల్స్ మరియు వెనుక వైపున 15-అంగుళాల వీల్స్ కలవు. రెండు చక్రాలకు స్పోర్ట్స్ టైర్లను అందించారు.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

ముందు వైపు చక్రాన్ని ఆపడానికి కావాల్సి శక్తి రేడియల్ మౌంటెడ్, నాలుగు పిస్టన్ల కాలిపర్ ద్వారా 310ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్‌ను చేరుతుంది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా ఎక్స్-ఎడివిలో ఐదు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే స్క్రీన్, కీ లేకుండా ఇంజన్ స్టార్ట్ చేయడం, మరి అద్బుతమైన 21-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా ఎక్స్-ఎడివి లో ఇంధన ట్యాంకు సామర్థ్యం 13.1-లీటర్లుగా ఉంది మరియు స్కూటర్ మొత్తం బరువు 238కిలోలుగా ఉంది.

హోండా ఎక్స్-ఏడివి అడ్వెంచర్ స్కూటర్

  • రెట్రో స్టైల్లో మహీంద్రా మోజో బైకులు
  • మహీంద్రా స్కార్పియో గేట్‌వే ను ఈ రూపంలో ఎప్పుడైనా చూశారా ?
  • దీపావళి పర్వదిన సంభరాల్లో టీవీఎస్ విగో రైడ్

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
2016 EICMA Motorcycle Show: Honda Unveils The New X-ADV Adventure Scooter
Story first published: Wednesday, November 9, 2016, 10:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X