బజాజ్ సారథ్యంలో భారత్‌కు హస్క్‌వర్నా బైకులు

By Anil

స్వీడిష్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హస్క్‌వర్నా 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. బజాజ్ సారథ్యంలో దేశీయంగా విక్రయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

చకన్ లోని బజాజ్ ప్రొడక్షన్ ప్లాంటులో హస్క్‌వర్నా మోటార్ సైకిళ్ల తయారీ ప్రారంభించనుంది. తక్కువ కెపాసిటి గల బైకులను ఉత్పత్తి చేయడం మీద హస్క్‌వర్నా దృష్టి సారిస్తోంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

బజాజ్ వారి ప్రొ బైకింగ్ షోరూమ్ లో ఈ బైకులను విక్రయించనుంది. ఇదే వేదిక మీద ఇప్పటికే కెటిఎమ్ మరియు కవాసకి సంస్థలు తమ విక్రయాలను సాగిస్తున్నాయి.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

కెటిఎమ్ కు చెందిన హస్క్‌వర్నా సంస్థ తమ విట్‌పిలెన్ (వైట్ యారో)401 మరియు స్వార్ట్‌పిలెన్ (బ్లాక్ యారో)401 స్క్రాంబ్లర్ ఉత్పత్తులను చకన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

హస్క్‌వర్నా ఈ రెండు మోటార్ సైకిళ్లను మిలాన్ లో నవంబర్ 9 న జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 లలో ఒకే తరహా ఇంజన్ కలదు. ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద కెటిఎమ్ ప్రదర్శించిన సరికొత్త డ్యూక్ 390 లో వినియోగించిన ఇంజన్‌నే ఈ రెండు మోటార్ సైకిళ్లలో వినియోగించారు.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

వీటిలో 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 43.3బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇందులో స్లిప్పర్ క్లచ్ అనుసంధానం గల 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

రెండు మోటార్ సైకిళ్లను కూడా కెటిఎమ్ వారి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద నిర్మించడం జరిగింది. సస్పెన్షన్ పరంగా కెటిఎమ్ వారి 43ఎమ్ఎమ్ డబ్ల్యూపి ఫ్రంట్ ఫోర్క్ ముందు వైపున మరియు వెనుక వైపున మోనో షాక్ అందించారు.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

హస్క్‌వర్నా లోని రెండు బైకుల్లో కూడా ముందు వైపున 320ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులను అందించింది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్

పూనేలోని బజాజ్ చకన్ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం మొదటి బ్యాచ్ హస్క్‌వర్నా బైకులను ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఆ తరువాత వీలు చూసుకుని దేశీయంగా ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్
  • విమానాలు కూలిపోవడానికి గల మెయిన్ రీజన్స్
విమానాల ప్రమాదం గురించి నెలకు కనీసం రెండు వార్తలయినా వస్తుంటాయి. విని అయ్యో పాపం అనుకుంటారు చాలా మంది. కాని విమానాలు కూలిపోవడానికి గల అతి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి ఆలోచించారా..?
హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్
  • ఇప్పుడు జపాన్ లో త్వరలో భారత్ ‌కు: 2017 స్విఫ్ట్ సమగ్ర వివరాలు
జపాన్ మార్కెట్లోకి సుజుకి తమ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఆవిష్కరించింది. దేశీయ విపణివైపు అడుగులేయనున్న దీని గురించి పూర్తి వివరాలు....
 
Most Read Articles

English summary
Husqvarna Set To Rumble Into India Next Year — Here's What We Know
Story first published: Tuesday, December 27, 2016, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X