2016 ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు విడుదల

పొలారిస్ ఇండియా దేశీయ విపణిలోకి ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. విడుదల వివరాలు...

By Anil

లగ్జరీ అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు చెందిన ఇండియన్ మోటార్‌సైకిల్స్ యొక్క అమ్మకాలను చేపట్టిన పొలారిస్ ఇండియా దేశీయ విపణిలోకి చీఫ్ టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ బైకు ప్రారంభ ధర రూ. 31.99 లక్షలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా ప్రకటించింది. ఈ మధ్యనే పొలారిస్ ఇండియా దేశీయ మార్కెట్లోకి స్ప్రింగ్ ఫీల్డ్ మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ బైకులో 1811సీసీ సామర్థ్యం ఉన్న థండర్ స్ట్రోక్ ఇంజన్‌ను అందించారు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇది గరిష్టంగా 73బిహెచ్‌పి పవర్ మరియు 138.9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా చేయడానికి ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ బైకులో సింగల్ సీటు, టింటెడ్ పవర్ విండ్ స్క్రీన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ ప్రీమియమ్ ఆడియో సిస్టమ్, రిమోట్ కీ, కీ లెస్ ఇగ్నిషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

అంతే కాకుండా ఈ ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్‌లో 7-అంగుళాల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ కలదు. దీని ద్వారా రియల్ టైమ్, ఆంబియంట్ ఎయిర్ టెంపరేచర్‌ను తెలుసుకోవచ్చు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

ఇండియన్ మోటార్ సైకిల్స్ శ్రేణిలో ఉన్న మునుపటి ఉత్పత్తుల తరహాలో 46ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, 21-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకుతో సహా ఈ క్రూయిజర్ మొత్తం బరువు 300కిలోలుగా ఉంది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

పొలారిస్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు డైరెక్టర్ పంకజ్ దుబె మాట్లాడుతూ, తమ కస్టమర్లు ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ యొక్క అద్బుతమైన డిజైన్ మరియు శక్తివంతమైన థండర్ స్ట్రోక్ ఇంజన్ ద్వారా రైడింగ్‌లో మంచి ఫీల్ పొందుతారని తెలిపారు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ క్రూయిజర్ బైకు

పంకజ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ ఒక డ్రీమ్ బైకు, ఇండియన్ మోటార్ సైకిల్స్ కుటుంబంలోకి దీని చేరిక ద్వారా సరికొత్త లెవల్ ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు.

.

  • ఆగలేకపోతున్న చైనా...!!
  • 59 లక్షల ఖరీదైన కె9 రెడ్ చాపర్ ఇండియాలో విడుదల

Most Read Articles

English summary
Read In Telugu: Polaris Launches Indian Chieftain Dark Horse Cruiser Motorcycle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X