2016 ఇండియన్ స్కౌట్ సిక్ట్సి దేశీయంగా విడుదల: ధర రూ. 11.99 లక్షలు

By Anil

అమెరికా అధారిత ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయ మార్కెట్లోకి 2016 స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేశారు. ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయంగా అందించిన ఉత్పత్తులలో ఇది ఎంట్రీ లెవల్‌ ఉత్పత్తిగా ఉంది. దీని ధర రూ. 11.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ప్రకటించారు.

ఇండియన్ మోటార్ సైకిల్స్ 2016 స్కౌట్ సిక్ట్సి గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన తమ ఎంట్రీలెవల్ ఉత్పత్తి స్కౌట్ సిక్ట్సిలో 999సీసీ సామర్థ్యం ఉన్న వి-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 78బిహెచ్‌పి పవర్ మరియు 88.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

అయితే 2016 స్కౌట్ సిక్ట్సి మోటార్ బైకులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను మాత్రమే అనుసంధానం చేశారు.

సస్పెన్షన్

సస్పెన్షన్

స్కౌట్ సిక్ట్సిలోను ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లను అందించారు.

బ్రేకులు

బ్రేకులు

ముందువైపున రెండు పిస్టన్ కాలిపర్లు గల 298ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున ఒకే పిస్టన్ గల కాలిపర్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

టైర్లు

టైర్లు

ముందు వైపున 130/90616 72హెచ్‌ టైరు అదే విధంగా వెనుక వైపున 150/80-16 71హెచ్‌ టైరును అందించారు.

కొలతలు

కొలతలు

  • వీల్ బేస్ - 1562ఎమ్ఎమ్
  • సీటు ఎత్తు - 643ఎమ్ఎమ్
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 135ఎమ్ఎమ్
  • ఇంధన లేకుండా బైకు బరువు - 246 కిలోలు
  • పొడవు - 2311ఎమ్ఎమ్
  • వెడల్పు - 880ఎమ్ఎమ్
  • ఎత్తు - 1207ఎమ్ఎమ్
  • ప్రత్యేకతలు

    ప్రత్యేకతలు

    ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థకు చెందిన స్కౌట్ సిక్ట్సిలో రౌండ్ హెడ్ ల్యాంప్స్, నల్లటి రంగులో ఉన్న ఇంజన్ మరియు క్రోమ్ పూతతో ఉన్న టెయిల్ పైపు వంటివి ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. అన్నింటికి మించి భారీ సైజులో ఉంటుంది. 12.5 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. దీనికి రెండు సైలెన్సర్లను అనుసంధానం చేశారు.

    లభించు రంగులు

    లభించు రంగులు

    ఇండియన్ స్కౌట్ సిక్ట్సి మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, థండర్ బ్లాక్, ఇండియన్ మోటార్ సైకిల్ రెడ్ మరియు పియర్ల్ వైట్.

    ఇండియన్ మోటార్ సైకిల్స్ స్కౌట్ సిక్ట్సి

    2016 స్కౌట్ సిక్ట్సిని కొనుగోలు చేసే వారు తమ బైకును మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇందుకు ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ సహాయంగా ఉంటుంది. అదే విధంగా శాడిల్ బ్యాగ్ వంటి ఆక్ససరీలు మరియు వెంటనే తొలగించే వీలుండే విండ్ షీల్డ్‌లను ఈ బైకులో అందిస్తారు.

    ఇండియన్ మోటార్ సైకిల్స్ స్కౌట్ సిక్ట్సి

    2016-17 లో విడుదల కానున్న రెనో కార్లు వివరాలు

    భారీ సంఖ్యలో సుజుకి యాక్సెస్ 125 రీకాల్: కారణం ఇదే...!!

Most Read Articles

English summary
2016 Indian Scout Sixty Launched In India; Priced At Rs. 11.99 Lakh
Story first published: Wednesday, July 13, 2016, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X