సౌత్ ఇండియాలోకి ఇండియన్ స్కౌట్ సిక్ట్సి విడుదల: ప్రారంభ ధర రూ. 12.21 లక్షలు

By Anil

అమెరికాకు చెందిన ప్రముఖ ఇకానిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయంగా దక్షిణ భారతదేశంలో ఉన్న అతి పెద్ద ఐటి రాజధాని నగరం బెంగళూరులో తమ 2016 ఇండియన్ స్కౌట్ సిక్ట్సి బైకును విడుదల చేశారు. దీని ప్రారంభ ధర రూ. 12.21 లక్షలు ఎక్స్ షోరూమ్‌‌(బెంగళూరు)గా ప్రకటించారు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ఈ ఇండియన్ స్కౌట్ సిక్ట్సి దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్స్ విపణిలో ఉన్న ఎంట్రీ లెవల్ ఉత్పత్తిగా ఉంది.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ఇది స్కౌట్ సిక్ట్సి అనే పేరును పొందడానికి కారణం, ఇందులో ఉన్న 60 క్యూబిక్-ఇంచ్ (999సీసీ) సామర్థ్యం ఉన్న ఇంజనే కారణం.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ఇండియ్ స్కౌటర్ సిక్ట్సిలో 999సీసీ సామర్థ్యం ఉన్న వి-ట్విన్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్,లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 77బిహెచ్‌పి పవర్ మరియు 88.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

స్కౌట్ సిక్ట్సిలోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ వెనుక చక్రాలకు చేరవేస్తుంది. ఇందులోని 12.5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

2016 స్కౌట్ సిక్ట్సిలో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు కలవు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

స్కౌట్ సిక్ట్సి ముందు వైపున ఉన్న అల్లాయ్ వీల్‌కు 130/90-17 72హెచ్ టైరు మరియు వెనుక వైపున అల్లాయ్ చక్రానికి 150/80-16 71హెచ్ టైరు కలదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ముందు మరియు వెనుక రెండు వైపులా ఉన్న చక్రాలను ఆపడానికి 298 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులు కలవు. అందులో ముందువైపున రెండు పిస్టన్లు గల కాలిపర్ మరియు వెనుక వైపున ఒకటే పిస్టన్ గల కాలిపర్ బ్రేక్ కలదు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

డిజైన్ పరంగా స్కౌట్ సిక్ట్సి మోడ్రన్ మరియు హెరిటేజ్ డిజైన్‌ల రంగరింపుతో రూపొందించబడింది. ఇంజన్, చక్రాలు మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లను బ్లాక్‌లో అందించారు.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

స్కౌట్ సిక్ట్సి లభించు రంగులు: థండర్ బ్లాక్, ఇండియన్ మోటార్‌సైకిల్ రెండ్ మరియు పియర్ల్ వైట్.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ఇండియన్ మోటార్‌సైకిల్స్ దీనికి రకరకాలుగా కస్టమైజ్ చేసుకునే అవకాశాలను కల్పించింది. ఇందులో విభిన్నమైన సీట్లు, హ్యాండిల్ బార్లు, ఫుట్ పెగ్ రి-లొకేటర్స్.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

అదనంగా ఇందులో శాడిల్ బ్యాగులు, లేస్డ్ ఫ్రంట్ మరియు రియర్ వీల్స్, క్విక్ రిలీస్ విండ్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ స్కౌట్ సిక్ట్సి

ప్రొడక్షన్ రెడి బజాజ్ పల్సర్ సిఎస్400 టెస్టింగ్: ఫోటోలు మరియు ఇతర వివరాలు

షార్ట్‌సర్కూటే సైలెంట్‌గా కాల్చేసింది: బుగ్గిపాలైన మారుతి బాలెనొ

Most Read Articles

English summary
Indian Scout Sixty Cruises Into Bangalore
Story first published: Thursday, August 11, 2016, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X