కళ్లు చెదిరే డిజైన్‌లో సరికొత్త కెటిఎమ్ డ్యూక్ సూపర్ డ్యూక్ ఆర్

కెటిఎమ్ మోటార్ సైకిళ్లకు దేశీయంగా మంచి ఆదరణ ఉంది. 125సీసీ నుండి 1301సీసీ వరకు ఉన్న ప్రతి బైకు తనదైన రీతిలో పవర్ ఉత్పత్తి చేస్తుంది.కెటిఎమ్ బైకులు ఇప్పుడు ప్రత్యేక ప్రదర్శనలకు దిగుతున్నాయి.

By Anil

కెటిఎమ్ 2014 లో విడుదల చేసిన 1290 సూపర్ డ్యూక్ ఆర్ బైకు సూపర్ నేక్డ్ మార్కెట్లో అగ్ర స్థానంలో నిలిచింది. 2016 ఎకిమా మోటార్ సైకిల్ ప్రదర్శన వేడుకల్లో కెటిఎమ్ సిఇఒ స్టీఫెన్ మాట్లాడుతూ, సుమారుగా 22 క్రితం బైకుల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన కెటిఎమ్ ఇప్పుడు అత్యుత్తమ ఉత్పత్తులను అభివృద్ది చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని తెలిపాడు.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

కెటిఎమ్ శ్రేణిలో ఉన్న 125 నుండి 1301 సీసీ వరకు ఉన్న ప్రతి మోడల్ సరైన పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి బైకు కూడా కెటిఎమ్ యొక్క అసలైన విలువలతో డ్యూక్ లక్షణాలతో తయారు చేయబడ్డాయి.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

కెటిఎమ్ శ్రేణిలో ఉన్న నేక్డ్ ఉత్పత్తుల్లో ఉన్న ముఖ్యమైనది డ్యూక్ 790 ప్రోటోటైప్. పనితీరు పరంగా కెటిఎమ్ గుణాన్ని ప్రతిబింబింపచేస్తుంది ఈ మోడల్.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

ఇప్పుడు డ్యూక్ అప్‌డేటెడ్ వెర్షన్, రీఫ్రెష్డ్ మోడల్ 1290 ఆర్ ప్రపంచ ప్రదర్శనకు వచ్చింది. ఇది సరికొత్త ఎల్ఇడి హెడ్ లైట్ డిజైన్, పగటి పూట వెలిగే లైట్లు మరియు అదునాతన బాడీ డిజైన్‌తో సూపర్ బైక్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్ మోడల్ సరికొత్త డిజైన్‌లోని ఇంధన ట్యాంక్ మరియు అధునాతన పదునైన డిజైన్‌లో ఉన్న ఎయిర్ ఇంటేకర్‌తో ఆకర్షణీయంగా ఉంది.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

అయితే గతంలో విడుదలైన ఉత్పత్తుల తరహాలో పొట్టిగా ఉండే హ్యాండిల్ స్థానంలో పొడవాటి హ్యాండిల్ బార్ పరిచయం చేసారు. స్పోర్ట్స్ రైడింగ్ చేసే సమయంలో రైడర్‌కు ఉత్తమ రైడింగ్ పొజిషన్‌కు ఇది సహకరిస్తుందని తెలిపారు.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

సాంకేతికంగా ఈ డ్యూక్ 1290 ఆర్ మోడల్‌లో అప్‌డేటెడ్ 1307సీసీ సామర్థ్యం గల ఎల్‌సి8 వి-ట్విన్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 177బిగహెచ్‌పి పవర్ మరియు ఉత్పత్తి చేస్తుంది. గతంలో ఇదే ఇంజన్ దీని కన్నా 7బిహెచ్‌పి పవర్ తక్కువగా ఉత్పత్తి చేసేది.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్ మోడల్‌లో భద్రత పరంగా బ్రెంబో మోనోబ్లాక్ బ్రేకులు, బోష్ సంస్థకు చెందిన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డబ్ల్యూపి సస్పెన్షన్ సిస్టమ్, విభిన్న అవసరాలకు ఉపయోగపడే టిఎఫ్‌టి డిస్ల్పే కలదు.

కెటిఎమ్ డ్యూక్ 1290 ఆర్

  • టీవీఎస్ నుండి మరో 125సీసీ స్కూటర్
  • బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు
  • రాయల్ ఎన్ఫీల్డ్‌ కొంపముంచే నిర్ణయం తీసుకున్న మహీంద్రా

Most Read Articles

English summary
2016 EICMA Motorcycle Show: The 2017 KTM Super Duke R Is Here
Story first published: Thursday, November 10, 2016, 14:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X