150సీసీ కమ్యూటర్‌ను పరీక్షించిన మహీంద్రా త్వరలో విడుదల

By Anil

దేశీయ వాహన పరిశ్రమలో మహీంద్రా అండ్ మహీంద్రా తమదైన ముద్ర వేసుకుంటోంది. విభిన్న స్థాయి రవాణా ఉత్పత్తిలో మహీంద్రా ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది. టూ వీలర్లతో మొదలుకొని విమానాల వరకు దీని ప్రస్థానం ఉంది.

మహీంద్రా ఎప్పటికప్పడు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం అతి నూతన ఉత్పత్తులకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే 150సీసీ టూ వీలర్ సెగ్మెంట్లోకి సరికొత్త ఉత్పత్తి తీసుకురావడానికి సిద్దమైపోయింది. మహీంద్రా తమ అప్ కమింగ్ 150సీసీ బైకును పరీక్షిస్తుండగా మీడియా కంటపడింది దీనికి సంభందించిన వివరాలు ఈ కథనంలో....

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

ఏప్రిల్ 1, 2016 నుండి మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి టూ వీలర్ బిఎస్‌4 సర్టిఫైడ్ ఇంజన్‌ను కలిగి ఉండాలి లేదంటే వాటికి దేశీయంగా విడుదలయ్యే అవకాశం ఉండదు అని ప్రభుత్వం ప్రకటించింది.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

ఇండియాలో వాహన కాలుష్యాన్ని అదుపుచేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తమ కమ్యూటర్ బైకులో బిఎస్ 4 ఇంజన్‌ను అందివ్వనుంది.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

మహీంద్రా ఈ కమ్యూటర్ బైకులో 155సీసీ సామర్థ్యం ఉండే ఇంజన్‌ను అందివ్వనుంది. కాని ఇది విడుదల చేసే శక్తి సామర్థ్యాలకు సంభందించిన వివరాలు వెల్లడి కాలేదు.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

మహీంద్రా టూ వీలర్స్ ఈ కమ్యూటర్ బైకుకు ఏ విధమైన అధనపు హంగులను జోడించలేదు, చాలా సాధారణంగా, సింపుల్‌గా డిజైన్ చేసారు.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

తక్కువ ధరలో దీనిని అందించేందుకు ఇందులో చాలా వరకు అనవసర డిజైన్‌ జోలికి వెళ్లకుండా సింపుల్‌గా సేఫ్టీగా ఉండే విధంగా విడి భాగాలను డిజైన్ చేశారు.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

ప్రస్తుతం మహీంద్రా టూ వీలర్స్ సెంచురో మరియు మోజో అనే మోటార్ సైకిళ్లను అందుబాటులో ఉంచింది.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

ఈ కమ్మూటర్ 150సీసీ బైకును 2016 చివరిలో లేదా 2017 ప్రారంభంలో విడుదల చేసే సూచనలు ఉన్నాయి.

మహీంద్రా 150సీసీ కమ్యూటర్

  • ఈ ఐదు కార్లతో కియా మోటార్స్ దేశీయంగా ఆరంగ్రేటం

Most Read Articles

English summary
All-New Mahindra Commuter Bike Spied Ahead Of Launch
Story first published: Friday, August 19, 2016, 12:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X