దేశీయ విపణిలోకి రెండు కొత్త బైకులను పరిచయం చేసిన మోటోగుజ్జి
మోటో గుజ్జి నుండి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే బైకులు పియాజియో ద్వారా దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యాయి. పియాజియో వీటిని మోటోప్లెక్స్ షోరూమ్‌ల ద్వారా అందుబాటులో ఉంచింది.
పియాజియో సంస్థ ఇండియన్ మార్కెట్లోకి రెండు ప్రీమియమ్ లగ్జరీ బైకులను విడుదల చేసింది. మోటో గుజ్జి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే మోడళ్లను విడుదల చేసింది. పియాజియో ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మోటో ప్లెక్స్ షోరూమ్‌ల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు.

ధర వివరాలు
- మోటో గుజ్జి వి9 రోమర్ ధర రూ. 13.60 లక్షలు
- మోటో గుజ్జి వి9 బాబర్ ధర రూ. 13.60 లక్షలు
- మోటో గుజ్జి ఎమ్‌జిఎక్స్-21 ఫ్లైయింగ్ ఫోర్ట్రెస్ ధర రూ. 27.78 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ పూనేగా ఉన్నాయి.
- ప్రపంచపు మొదటి విమానం కనుగొన్నది రైట్ సోదరులు కాదు, మన భారతీయుడే...!
- ఒక్క బటన్‌తో ప్రపంచ పటంలో కొన్ని దేశాలనే తుడిచేయ గల సతన్ 2 మిస్సైల్
- ఉద్యోగులకు 1,260 కార్లను బహుకరించిన సూరత్ వజ్రాల వ్యాపారి

ప్రస్తుతం పియాజియో సంస్థకు దేశవ్యాప్తంగా కేవలం నాలుగు మోటో ప్లెక్స్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. పూనే, కొచ్చి హైదరాబాద్ మరియు చెన్నైలలో ఇవి ఉన్నాయి.

మోటో గుజ్జి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 మోటార్ సైకిళ్లు పూర్తిగా నిర్మిత ఉత్పత్తులుగా (సిబియు) అందుబాటులో ఉంటున్నట్లు మోటో గుజ్జి తెలిపింది.

ప్రస్తుతం Audace, El Dorado,కాలిఫోర్నియా టూరింగ్ 1400, కాలిఫోర్నియా టూరింగ్ కస్టమ్, మరియు గ్రిసో ఎస్ఇ అనే ఉత్పత్తులతో పాటు వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే ఉత్పత్తులుమోటో గుజ్జి లైనప్‌లో ఉన్నాయి.



Click it and Unblock the Notifications








