సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు

Written By:

జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా విభాగం దేశీయంగా విపణిలోకి మరో ఉత్పత్తిని స్పెషల్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది. పండుగ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

సుజుకి లైనప్‌లో మంచి అమ్మకాలు సాధిస్తున్న యాక్సెస్ 125 స్కూటర్‌ను స్పెషల్ ఎడిషన్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూటర్‌లో స్పెషల్ ఎడిషన్‌ లక్షణాలు స్పష్టంగా కనబడే విధంగా ప్రత్యేక హంగులను కల్పించారు.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్
  • సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 61,050 లు
  • సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 64,606 లు
రెండు ధరలు ఆన్ రోడ్ ఢిల్లీగా ఉన్నాయి.
సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

క్రోమ్‌తో రూపొందించబడిన రియర్ వ్యూవ్ మిర్రర్లు, లెథర్ తొడుగులో ఉన్న సౌకర్యవంతమైన కెంపు రంగులో ఉన్న సీటు, కాళ్లు పెట్టుకునే ప్రదేశంలో ఉన్న పూర్తి ప్లాస్టిక్‌ సెట్‌ను గోధుమ వర్ణంలో డిజైన్ చేసారు. కెంపు మరియు గోధుమ రంగులకు విభిన్నమైన తెలుపు రంగును బాడీ మొత్తం అందించారు.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

మరే ఇతర రంగుల్లో కాకుండా కేవలం పియర్ల్ మిరేజ్ వైట్ రంగు గల బాడీని అందించారు. మరియు సరికొత్త స్పెషల్ ఎడిషన్ యాక్సెస్ 125 మీద స్పెషల్ ఎడిషన్ లోగో అందించారు.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ చిన్న చిన్న అప్‌డేట్స్ మినహాయించి ఇందులో ఏ విధమైన సాంకేతిక మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో అదే 124సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8.58బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. సుజుకి వారి కథనం ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 64 కిలోమీటర్లుగా ఉంది.

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్

వాహన ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినపుడు, దళారులను నమ్మి మోసపోవడం ఎందుకు. మీ కోసం అత్యంత ఉత్తమమైన వెహికల్ ఇన్సూరెన్స్ విధానం.

  
English summary
Read In Telugu: Suzuki Has Launched Its Access 125 Special Edition At An Irresistible Price
Story first published: Saturday, September 10, 2016, 13:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark