సుజుకి జిక్సర్ 250 అసలు రూపం ఇదే

Written By:

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త జిఎస్ఎక్స్-ఆర్250 లేదా జిక్సర్ 250 మోడల్‌ను 2016 నవంబర్‌లో లేదా అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

సమాచార వర్గాల ప్రకారం సుజుకి తమ మొదటి 250సీసీ సామర్థ్యం గల బైకును విడుదల చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది.

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఈ 250సీసీ జిక్సర్ బైకును వచ్చే ఇంటర్‌మోట్ మోటార్‌సైకిల్ ఫెయిర్‌లో లేదా అక్టోబర్‌లో జరిగే ఎకిమా వేదిక మీద ప్రదర్శించనుంది.

ఇంటర్‌మోట్ మోటార్‌సైకిల్ ఫెయిర్‌ మరియు ఎకిమా వేదికసల మీద సుజుకి తమ నూతన ఉత్పత్తిని ప్రదర్శిస్తున్నట్లు సుజుకి ఆష్ట్రేలియా విభాగాధిపతి లెవిస్ క్రాప్ట్ ఓ ప్రకటనలో తెలిపాడు.

ప్రస్తుతం ఈ కథనంలో పొందుపరిచిన ఫోటోలు ఆస్ట్రేలియాలో రహస్యంగా విడుదైలన సుజుకి జిఎస్ఎక్స్-ఆర్250 పేటెంట్ పొందించిన చిత్రాలుగా ఉన్నాయి.

సుజుకి ఈ 250సీసీ బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే జిక్సర్ 250 అనే పేరును ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయి. మరియు దీనిని పూర్తిగా స్పోర్ట్ వేరియంట్‌లో అందివ్వనున్నారు.

2017 నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల కానున్న దీనిని 250-300సీసీ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టనున్నారు.

జిక్సర్ 250సీసీ బైకు కోసం ప్రస్తుతం విపణిలో అందుబాటులో ఉన్న జిక్సర్ 150 లోని ఫ్రేమ్‌ను వినియోగిస్తున్నారు. ఇది సుమారుగా 24 నుండి 27 బిహెచ్‌పి మధ్య పవర్ ఉత్పత్తి చేయును.

సుజుకి ఈ జిక్సర్ 250 ని మార్కెట్లోకి విడుదల చేస్తే హోండా వారి సిబిఆర్250ఆర్ మరియు కెటిఎమ్ ఆర్‌సి200 మోడళ్లకు మంచి పోటీని ఇవ్వనుంది.

 

  

English summary
Read In Telugu: Suzuki Gixxer 250 To Be Revealed In 2016
Story first published: Sunday, October 2, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos