మరింత భద్రతో సుజుకి జిక్సర్ విడుదల: ధర రూ. 79,726 లు

By Anil

సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి నేడు రెండు డిస్క్‌ బ్రేకులతో వచ్చిన జిక్సర్ బైకును లాంఛనంగా విడుదల చేసింది. ఈ సరికొత్త జిక్సర్‌ను సుజుకి సంస్థ ఢిల్లీ కేంద్రంగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
అయితే ఈ సరికొత్త వేరియంట్ జిక్సర్ బైకును సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

సుజుకి తాజాగా విడుదల చేసిన సరికొత్త వేరియంట్ జిక్సర్‌ యొక్క ధర, ఇంజన్ మరియు ఇతర వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ధర

ధర

  • జిక్సర్ ధర రూ. 79,726 లు
  • జిక్సర్ ఎస్‌ఎఫ్ ధర రూ. 87,343 లు
  • జిక్సర్ ఎస్‌ఎఫ్ మోటో జిపి ఎడిషన్ ధర రూ. 88,857 లు
  • గమనిక అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

     ఇంజన్ వివరాలు

    ఇంజన్ వివరాలు

    ఇందులో ఇంజన్‌కు సంభంగదించి ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే సుజుకి ఈ జిక్సర్ బైకులో 154.9సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎస్‌ఒహెచ్‌సి (SOHC) ఇంజన్ కలదు.

    పవర్

    పవర్

    ఇందులోని శక్తవంతమైన ఇంజన్ దాదాపుగా 14.6 బిహెచ్‌పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

     ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్

    ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్

    ఇందులోని ఇంజన్ విడుదల చేయు పవర్ మరియు టార్క్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ నుండి వెనుక చక్రానికి అందుతుంది. ఇది లీటర్‌కు 45 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

     ఇంధన సామర్థ్యం

    ఇంధన సామర్థ్యం

    ఇందులోని ట్యాంకు 12 లీటర్ల పెట్రోల్‌ను స్టోరేజ్ చేసుకుంటుంది. ఒక్కసారి ఇందులో ఇంధనాన్ని నింపితే 540 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా రైడ్ చేయవచ్చు.

    ఫీచర్లు

    ఫీచర్లు

    సుజుకి ఈ సరికొత్త జిక్సర్ వేరియంట్‌లో వెనుక వైపున నూతనంగా డిస్క్‌బ్రేక్‌ను అందించారు. దీనితో పాటు ముందు వైపు డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్వర్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

     టెర్లు మరియు చక్రాలు

    టెర్లు మరియు చక్రాలు

    ముందు టైరు 100 సెక్షన్ మరియు వెనుక టైరు 140 సెక్షన్‌ను కలిగి ఉన్నాయి. రెండు టైర్లు కూడా 17-అంగుళాల అల్లాయ్ చక్రాలకు ఫిట్ చేయబడ్డాయి.

     లభించు రంగులు

    లభించు రంగులు

    సుజుకి జిక్సర్ ఎస్‌ఎఫ్ బైక్ పియర్ల్ మిరేజ్ రెడ్ మరియు గ్లాస్ స్పార్క్ రంగుల్లో మరియు మోటో జిపి ఎడిషన్ బైకు మెటాలిక్ ట్రిటన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

     అందుబాటులోకి

    అందుబాటులోకి

    సరికొత్త జిక్సర్, జిక్సర్ ఎస్‌ఎఫ్ మరియు మోటో జిపి ఎడిషన్ బైకులు రెండు వైపులా డిస్క్ బ్రేకులతో ప్రస్తుతం అన్ని సుజుకి షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

    పోటీ

    పోటీ

    ప్రస్తుతం డిస్క్ బ్రేక్‌ అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి విడుదలైన ఈ మూడు బైకులు హోండా వారి సిబి హార్నెట్ 160 ఆర్, బజాజ్ పల్సర్ ఎస్ 150, హీరో ఎక్ట్సీమ్ మరియు యమహా ఆర్15 వంటి వాటికి పోటిగా ఉండనుంది.

Most Read Articles

Story first published: Friday, April 15, 2016, 18:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X