హెచ్.డి.ఎఫ్.సి మరియు పేటిఎమ్ అకౌంట్లు ఉన్న వారికి సుజుకి నుండి అద్భుతమైన ఆఫర్లు

Written By:

రూ. 500 మరియు రూ. 1000 పాత పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బైకులు మరియు కార్లను ఎంచుకునే వారికి ఇ-కామర్స్, బ్యాకులతో పాటు వాహన తయారీ సంస్థలు కూడా భారీ స్థాయిలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో పేటిఎమ్, హెచ్‌డిఎఫ్‌సి మరియు సుజుకి టూ వీలర్స్ జట్టుగా కస్టమర్లకు అద్భతమైన ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా తమ కస్టమర్లకు క్యాష్ లెస్ ఆఫర్లు మరియు లాభాలను అందివ్వడానికి తాజాగ ప్రముఖ ఇకామర్స్ దిగ్గజం పేటిఎమ్ మరియు బ్యాకింగ్ దిగ్గజం హెచ్.డి.ఎఫ్.సి లతో జుట్టు కట్టింది.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

దేశ వ్యాప్తంగా నల్ల ధనాన్ని వెలికితీయడానికి భారత ప్రభుత్వం పాత రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా నగదు ద్వారా జరిగే చెల్లింపులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇందుకోసం క్యాష్ లెస్ ఆఫర్లతో వాహన తయారీ సంస్థలు ముందుకొస్తున్నాయి.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

సుజుకి స్కూటర్స్ మరియు మోటార్ సైకిల్స్ తమ ఉత్పత్తులను పేటిఎమ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పేటిఎమ్ ఇకామర్స్ వేదిక ద్వారా రూ. 20,000 ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి తమ టూ వీలర్లను ఎంచుకోవచ్చు.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

బుకింగ్ చేసుకున్న బైకులు లేదా స్కూటర్లను డీలర్లు డెలవరీ చేసే సమయంలో సుజుకి మరియు పేటిఎమ్ సంయుక్తంగా రూ. 3,000 లను క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి ఇవ్వనున్నాయి.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

హెచ్.డి.ఎఫ్.సి ఖాతాదారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సుజుకి టూ వీలర్లను 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్‌తో అందిస్తున్నాయి. ప్రతి నెలా ఇఎమ్ఐ చెల్లించడానికి తమ నచ్చిన నగదు లావాదేవీ పద్దతిని ఎంచుకోవచ్చు.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

పెద్ద నోట్ల రద్దు సమయంలో కస్టమర్లకు అత్యంత సులభమైన ఆర్థిక లావాదేవీలు జరపడానికి అవకాశం కల్పించే దిశగా సుజుకి టూ వీలర్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

సుజుకి టూ వీలర్ల ఆఫర్లు

సంపాదనకు సంభందించిన ఆధారాలు ఉన్న వారు హెచ్.డిఎఫ్.సి బ్యాంకులో ఖాతా లేకపోయినా కూడా సుజుకి మరియు హెచ్.డి.ఎఫ్.సి ఇరు సంస్థలు అతి తక్కువ డౌన్ పేమెంట్ (90 శాతం వరకు బుణ సదుపాయం) ద్వారా కొన్ని సుజుకి ఉత్పత్తులను అందిస్తున్నాయి.

 
English summary
HDFC & Paytm Offer Cashless Benefits On Suzuki Two Wheelers
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark