125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు ఉత్తమ మైలేజ్ బైకులు

Written By:

భారత్‌లో టూవీలర్ వినియోగదారులు ఎంచుకునే బైకులలో చాలా వరకు పూర్తి స్థాయిలో మైలేజ్ ఇచ్చే మరియు మంచి పనితీరు కనబరిచే వాటిని ఎంచుకుంటారు. ద్విచక్ర వాహన సెగ్మెంట్లో ఈ రెండు అంశాలకు పెట్టింది పేరు 125 సీసీ బైకులు. అంతే కాకుండా డిజైన్, స్టైల్, కాస్తంత భద్రత వంటి వాటికి కూడా ఈ బైకులు న్యాయం చేస్తున్నాయి.

ప్రతి సెగ్మెంట్లో కూడా కొన్ని పదుల సంఖ్యలో ఉత్పుత్తులు ఉన్నట్లే, 125 సీసీ సెగ్మెంట్లో కూడా చాలా ఉత్పత్తులు ఉన్నాయి. అందులో అన్ని అంశాల పరంగా పోటీ పడుతున్నఆరు ముఖ్యమైన బైకుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా సిబి షైన్

హోండా సిబి షైన్

ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారు దేశీయంగా అందుబాటులో ఉంచిన టూ వీలర్లలో హోండా యాక్టివా మరియు సిబి షైన్ ఉత్పత్తులు మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. అందులో సిబి షైన్ 125 బైకుని ఈ జాబితాలోకి ఎంచుకోవడం జరిగింది. ఇందులో 124.7సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సిగింల్ సిలిండర్ ఇంజన్ కలదు.

హోండా సిబి షైన్

హోండా సిబి షైన్

 • పవర్: 10.12బిహెచ్‌పి@7500ఆర్‌పిఎమ్
 • టార్క్: 10.54ఎన్ఎమ్@5500ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)
 • మైలేజ్: 65 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 10.5లీటర్లు
 • బరువు: 120 కిలోలు
 • ధర: రూ. 64,983 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
బజాజ్ డిస్కవర్ 125

బజాజ్ డిస్కవర్ 125

బజాజ్ డిస్కవర్ 125 మరియు డిస్కవర్ 125 ఎమ్ రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రెండింటి మధ్య చాలా తక్కువ తేడాలు ఉన్నప్పుటికీ 125 సీసీ బైకుల్లో ఇది ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. 125 ఎమ్ బైకులోని రియర్ షాక్ అబ్జార్వర్లలో గ్యాస్‌ నింపబడి ఉంటుంది. మిగతా వాటితో పోల్చితే ఇది ఎంతో విభిన్నంగా ఉంటుంది.

బజాజ్ డిస్కవర్ 125

బజాజ్ డిస్కవర్ 125

 • ఇంజన్: 124.6సీసీ, సింగల్ సిలిండర్, 4-వాల్వ్ డిటిఎస్ఐ ఇంజన్
 • పవర్: 11.5హార్స్‌పవర్@7500ఆర్‌పిఎమ్
 • టార్క్: 10.8ఎన్ఎమ్@6000ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 4-స్పీడ్ (1-N-2-3-4)
 • మైలేజ్: 76 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 9.5-లీటర్లు
 • బరువు: 118 కిలోలు
 • ధర: రూ. 58,183 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
హీరో గ్లామర్ ఎఫ్‌ఐ

హీరో గ్లామర్ ఎఫ్‌ఐ

125 సీసీ సెగ్మెంట్లో ఈ జాబితాలో ఎంచుకున్న అన్ని ఉత్పత్తుల్లో కెల్లా ఇది ఖరీదైనది. కాని ఇందులో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్‌ను అందించారు. పాత డిజైన్ అనే అంశాన్ని కొట్టి పారేసే విధంగా దీని బాడీ డీకాల్స్‌కు డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్‌ను అందించారు. ఇందులో 124.8సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

హీరో గ్లామర్ ఎఫ్‌ఐ

హీరో గ్లామర్ ఎఫ్‌ఐ

 • పవర్: 9.1హార్స్‌పవర్@7000ఆర్‌పిఎమ్
 • టార్క్: 10.35ఎన్ఎమ్@4000ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)
 • మైలేజ్: 81.1 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 12-లీటర్లు
 • బరువు: 129 కిలోలు
 • ధర: రూ. 76,373 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
టీవీఎస్ ఫీనిక్స్ 125

టీవీఎస్ ఫీనిక్స్ 125

టివీఎస్ మోటార్స్ దీనిని ప్రీమియమ్ మోటార్ సైకిల్ అని పిలవడం ప్రారంభించింది. అపాచేకు చెందిన ఇన్ సైడ్ ఎల్‌ఇడి గైడ్ ల్యాంప్, సరికొత్త డిజిటల్ స్పీడో మీటర్స వంటి వాటిని గ్రహించింది. అయినప్పటికీ ఇది చూడటానికి 125 సీసీ బైకు మాదిరిగానే కనబడుతుంది. దృష్టిని ఆకర్షించే బాడీ గ్రాఫిక్స్, నమ్మకమైన మరియు స్మూత్ ఇంజన్‌తో పాటు మంచి మైలేజ్‌ని ఇవ్వగలదు.

టీవీఎస్ ఫీనిక్స్ 125

టీవీఎస్ ఫీనిక్స్ 125

 • ఇంజన్: 124.5సీసీ, సింగల్ సిలిండర్, ఎకో థ్రస్ట్ ఇంజన్
 • పవర్: 11హార్స్‌పవర్@8000ఆర్‌పిఎమ్
 • టార్క్: 10.8ఎన్ఎమ్@6000ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)
 • మైలేజ్: 67 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 12-లీటర్లు
 • బరువు: 116 కిలోలు
 • ధర: రూ. 61,757 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
యమహా సెల్యూటో

యమహా సెల్యూటో

యమహా సంస్థ ఈ సెల్యూటో బైకును 2015 ఏప్రిల్‌లో దేశీయంగా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఎఫ్‌జడ్‌ సిరీస్ బైకులలో వినియోగించిన బ్లూ కోర్ సాంకేతికత గల 125సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించారు. కమ్యూటర్ బైకులలో ఎంతో ముఖ్యమైన మైలేజ్‌ను పెంచడానికి ఇందులోని బ్లూ కోర్ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇది ముందువైపున డిస్క్ మరియు డ్రమ్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

యమహా సెల్యూటో

యమహా సెల్యూటో

 • ఇంజన్: 125సీసీ, సింగల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్
 • పవర్ 8.2హార్స్‌పవర్@7500ఆర్‌పిఎమ్
 • టార్క్: 10.1ఎన్ఎమ్@4500ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 4-స్పీడ్
 • మైలేజ్: 78 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 8-లీటర్లు
 • బరువు: 112 కిలోలు
 • ధర: రూ. 64,869 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

స్లింగ్‌షాట్ ప్లస్ 125 వంటి ఉత్పత్తిని అందించినప్పటికీ దేశీయంగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో సుజుకి సంస్థ రాణించలేకపోతోంది. సుజుకి దీనిని స్పోర్టివ్ డిజైన్ మరియు స్మూత్ ఇంజన్‌తో పాటు స్మూత్ గేర్ షిఫ్ట్, మిగతా ఏ బైకులలో లేని అద్భుతమైన ఫీచర్ గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఎన్నో అంశాలు దీనిని ఉత్తమంగా నిలిపాయి. కాని ఇది సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

 • ఇంజన్: 124సీసీ, 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్
 • పవర్: 8.8హార్స్‌పవర్@7000ఆర్‌పిఎమ్
 • టార్క్: 10ఎన్ఎమ్
 • గేర్‌బాక్స్: 5-స్పీడ్ (1-N-2-3-4-5)
 • మైలేజ్: 75 కిలోమీటర్లు
 • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 12-లీటర్లు
 • బరువు: 129 కిలోలు
 • ధర: రూ. 62,451 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
 
English summary
Top 6 Best 125cc Fuel Efficient Bikes In India: Comparison
Story first published: Wednesday, July 27, 2016, 17:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark