ఇండియన్ మార్కెట్లో రెండు లక్షలలోపున్న ఏడు సూపర్ బైకులు

Written By:

సూపర్ బైకులు అనగానే కుర్రాళ్లందరికీ భలే ఇష్టం ఉంటుంది. అది ఇండియాలో అయితే ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ బైకుల మీద ఇష్టం పెంచుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని విదేశీ సూపర్ బైకుల తయారీ సంస్థలు ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. వారి ఉత్పత్తుల ధరలు 3 నుండి 10, 12 లక్షల వరకు ఉన్నాయి.

అయితే ఇండియన్ మార్కెట్లో రెండు లక్షల లోపు ధరతో కూడా సూపర్ బైకులు అందుబాటులో ఉన్నాయి. అందులోని ఉత్తమమైన ఏడు బైకుల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
 1. కెటిఎమ్‌ డ్యూక్ 390

1. కెటిఎమ్‌ డ్యూక్ 390

ఆస్ట్రియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఆరంగ్రేటం చేయడంతో దేశీయంగా స్పోర్ట్స్ బైకుల ప్రేమికులను పెంచేసింది. రెండు లక్షల లోపు బడ్టెట్‌తో ఉన్న అత్యుత్తమ సూపర్ బైకులలో కెటిఎమ్‌ డ్యూక్ 390 ఒకటి. ఇందులో 373 సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 44 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు

ఫీచర్లు

కెటిఎమ్ డ్యూక్ 390 లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అడ్వెంచర్ అనే రెండు ప్రముఖ వేరియంట్లు కలవు. కెటిఎమ్ డ్యూక్ 390 లో ఉన్న ఫీచర్లు. స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్, టాకో మీటర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, బ్లాక్ మరియు వైట్ రెండు రకాల రంగుల్లో లభించడం. దీని డిస్క్ బ్రేక్ వేరియంట్లలో ముందు మరియు వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులను అందించారు.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

కెటిఎమ్ డ్యూక్ 390 లో 11 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. ఇది లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

కెటిఎమ్ డ్యూక్ 390 ధర రూ. 1,99,752 ఎక్స్ షోరూమ్ గా ఉంది.

2. మహీంద్రా మోజో

2. మహీంద్రా మోజో

స్వదేశీ పరిజ్ఞానంతో సూపర్ బైకులను అభివృద్ది చేయడం ప్రారంభించింది మహీంద్రా అండ్ మహీంద్రా. గత ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి మోజో సూపర్ బైకును పరిచయం చేసింది. విభిన్నమైన డిజైన్ మరియు ఫీచర్లతో 295సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది.

 ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 26.5బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్త చేస్తుంది. ఆరు గేర్లున్న ఇందులో రెండు వైపులా రెండు అల్లాయ్ చక్రాలకు వాటికి భద్రత పరంగా డిస్క్ బ్రేకులను అమర్చారు. డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్‌తో పాటు వొల్కానో రెడ్, చార్ కోల్ బ్లాక్ మరియు గ్లేసియర వైట్ అనే మూడు రంగుల్లో లభించును.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

మహీంద్రా వారి మోజో సూపర్ బైకులో 21 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకును అందించారు. మరియు ఇది లీటర్‌కు 36 కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

మహీంద్రా మోజో ధర రూ. 1,65,500 లు ఎక్స్ షోరూమ్‌ (హైదరాబాద్‌)గా ఉంది

 3. హోండా సిబిఆర్250ఆర్

3. హోండా సిబిఆర్250ఆర్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లోకి సిబిఆర్250ఆర్ బైకును అందించారు. ఇందులో 249.60 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. ఇది సుమారుగా 26 బిహెచ్‌పి పవర్ మరియు 22.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, ముందు మరియు వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు కలవు. 167 కిలోల బరువున్న ఈ బైకు గరిష్టం వేగం గంటకు 135 కిలోమీటర్లుగా ఉంది.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

13 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ఇది లీటర్‌కు 29 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

హోండా సిబిఆర్250ఆర్ ధర రూ. 1,82,814 లు ఎక్స్ షోరూమ్ (హైదరాబాద్‌)గా ఉంది.

 4. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 500

4. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 500

చెన్నై ఆధారిత క్రూయిజ్ బైకుల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి థండర్ బర్డ్ బైకును 500 సీసీ సామర్థ్యం పరిచయం చేసింది. ఇది సుమారుగా 27.20 బిహెచ్‌పి పవర్ మరియు 41.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఫీచర్లు మరియు ఇతర వివరాలు

సూపర్ బైకులను విభిన్నంగా ఇందులో అనలాగ్ స్పీడో మీటర్‌ను అదించారు, దీనితో పాటు డిజిటిల్ ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటివి ఉన్నాయి. 195 కిలోలు ఉన్న ఈ బైకు గంటకు 135 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో 20 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకును అందించింది, దీని మైలేజ్ లీటర్‌కు 32 కిలోమీటర్లుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ ధర రూ. 2,04,624 లు ఎక్స్ షోరూమ్ (హైదరాబాద్) గా ఉంది.

5. రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్

5. రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఆల్ రౌండర్ సూపర్ బైకు హిమాలయన్‌ను అందించింది. అడ్వెంచర్లకు ప్రత్యేకంగా వినియోగించే ఇందులో 411 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

 ఫీచర్లు మరియ ఇతర వివరాలు

ఫీచర్లు మరియ ఇతర వివరాలు

ఇందులో అనలాగ్ స్పీడో మీటర్, ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్ తో పాటు లో ఫ్యూయల్ ఇండికేటర్ మరియు లో బ్యాటరీ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. వెనుక వైపు సీటుకు ఇరువైపులా క్యారీ బ్యాగలు ఉన్నాయి. ఇందులో అడ్వెంచర్ సమయంలో అదనపు ఇంధనం కోసం క్యారీ చేసే ఫ్యూయల్ క్యాన్‌లను నింపుకోవచ్చు.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

ఇందులో 15 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకును అందించారు. ఇది లీటర్‌కు 32 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 1,79,360 లు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉంది.

6. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

6. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

దేశీయ మార్కెట్లోకి పల్సర్ శ్రేణి బైకులను వివిధ రకాల సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది బజాజ్ ఆటో ఇండియా. అందులో ఈ జాబితాలో చోటు దక్కించుకుంది పల్సర్ ఆర్ఎస్200. ఇందులో 199.5 సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 24.50 బిహెచ్‌పి పవర్ మరియు 18.60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ కలదు. 165 కిలోల బరువున్న ఈ బైకు గంటకు 141 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇది పసుపు, ఎరుపు మరియు నలుపు వంటి మూడు రంగుల్లో లభిస్తుంది.

ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

13 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ఈ బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 లీటర్‌కు 35 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు.

బజాజ్ పల్సర్ ఆర్‌ఎస్200 ధర రూ. 1,37,147 లు ఎక్స్ షోరూమ్ (హైదరాబాద్‌)గా ఉంది.

7. యమహా వైజడ్ఎఫ్ ఆర్15

7. యమహా వైజడ్ఎఫ్ ఆర్15

యమహా వారి ఆర్15 బైకు 2008 నుండి ఇండియన్ మార్కెట్లో అమ్మకాలు సాగిస్తోంది. జపాన్‌కు చెందిన యమహా ఈ సూపర్ బైకులో 150 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది.

ఇది సుమారుగా 16.70 బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

 ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఫీచర్లు మరియు ఇతర వివరాలు

యమహా ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్‌ను అందించిది. ముందు మరియు వెనుక వైపున అల్లాయ్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులను అందించారు. 136

కిలోల బరువున్న ఈ యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 బైకు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 బైకులో 12 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ట్యాంకు కలదు, ఇది లీటర్‌కు 42 కిలోమీటర్లు మైలేజ్‌ ఇవ్వగలదు.

యమహా వైజడ్‌ఎఫ్ ఆర్15 ధర రూ. 1,36,975 లు ఎక్స్ షోరూమ్ (హైదరాబాద్‌)గా ఉంది.

  
English summary
Top 7 Super Bikes in India Under 2 Lakhs In Telugu
Story first published: Friday, June 24, 2016, 18:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark