2016 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 టూ వీలర్లు

By Anil

ఇండియన్ మార్కెట్లో టూ వీలర్ సెగ్మెట్‌కు ఉన్న ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. దేశీయంగా వీటికున్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. సిటి మరియు పల్లె రెండు ప్రాంతాల వారికి సరిపోయే విధమైన ఉత్పత్తులు ద్విచక్ర వాహన రంగంలో ఉండటం వలన వీటి అమ్మకాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

2016 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసకంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 టూ వీలర్ల గురించి క్రింది కథనంలో అందివ్వడం జరిగింది. ఇందులో మీ బైకు ఉందో లేదో చూడండి.

 10. టీవీఎస్ జూపిటర్

10. టీవీఎస్ జూపిటర్

10 వ స్థానంలో నిలిచిన జూపిటర్ స్కూటర్ టీవీఎస్ మోటార్స్‌కు అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా నిలిచింది. 2016 ఆర్థిక సంవత్సరంలో గడిచిన మొదటి మూడు నెలల కాలంలో జరిగిన అమ్మకాల్లో టీవీఎస్ జూపిటర్ సుమారుగా 1,33,268 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

టీవీఎస్ జూపిటర్ గురించి

టీవీఎస్ జూపిటర్ గురించి

  • ఇంజన్: 109సీసీ
  • పవర్: 7.8బిహెచ్‌పి
  • టార్క్: 8ఎన్ఎమ్
  • మైలేజ్: 56 కిమీ/లీ
  • ఆన్ రోడ్ ధర: రూ. 59,051 లు
  • 09. బజాజ్ పల్సర్

    09. బజాజ్ పల్సర్

    బజాజ్ ఆటో ఇండియా యొక్క ఫేమస్ బైకు అనగానే టక్కున వచ్చే సమాదానం పల్సర్. బజాజ్ సంస్థ 2016 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసకంలో 1,40,520 పల్సర్ బైకుల అమ్మకాలు జరిపి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

    బజాజ్ పల్సర్ గురించి

    బజాజ్ పల్సర్ గురించి

    • ఇంజన్: 135సీసీ
    • పవర్: 13బిహెచ్‌పి
    • టార్క్: 11ఎన్ఎమ్
    • మైలేజ్: 64 కిమీ/లీ
    • ఆన్ రోడ్ ధర: రూ. 67,900 లు
    • 08. బజాజ్ సిటి100

      08. బజాజ్ సిటి100

      ఎనిమదవ స్థానంలో నిలిచిన బజాజ్ సిటి 100 కమ్యూటర్ బైకు గడిచిన మొదటి త్రైమాసకంలో 1,61,351 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఇండియాలో ఎంట్రీలెవల్ కమ్యూటర్ బైకుల విభాగంలో కూడా తీవ్ర పోటీ ఉంది. ఇది స్కూటర్లు మరియు స్ల్పెండర్ వంటి వాటితో కూడా పోటీపడుతోంది.

      బజాజ్ సిటి100 గురించి

      బజాజ్ సిటి100 గురించి

      • ఇంజన్: 99సీసీ
      • పవర్: 8.1బిహెచ్‌పి
      • టార్క్: 8ఎన్ఎమ్
      • మైలేజ్: 89 కిమీ/లీ
      • ఆన్ రోడ్ ధర: రూ. 37,920 లు
      • 07. హోండా సిబి షైన్

        07. హోండా సిబి షైన్

        జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా ఇండియన్ మార్కెట్లోకి అందించిన సిబి షైన్ భారీ విజయం సాధించింది అని చెప్పవచ్చు. 125 సీసీ సెగ్మెంట్లో మిగతా అన్నింటికి పెద్ద పోటీగా నిలిచింది. 2016 ఆర్థిక ఏడాదిలో గడిచిన మొదటి మూడు నెలల కాలంలో జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే 1,83,855 యూనిట్లు అమ్ముడుపోయాయి.

        హోండా సిబి షైన్ గురించి

        హోండా సిబి షైన్ గురించి

        • ఇంజన్: 125సీసీ
        • పవర్: 10బిహెచ్‌పి
        • టార్క్: 11ఎన్ఎమ్
        • మైలేజ్: 65 కిమీ/లీ
        • ఆన్ రోడ్ ధర: రూ. 64,983 లు
        • 06.టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

          06.టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

          ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్‌ కు ఎటువంటి పోటీ లేకపోవడం వలన అసాధారణ పలితాలను సాధిస్తోంది. బైకులకు సైతం పోటీగా నిలుస్తోంది. గడిచిన 2016 ఆర్థిక ఏడాదిలోనే మొదటి త్రైమాసకంలో 2,17,050 యూనిట్లు అమ్ముడుపోయి, ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.

          టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ గురించి

          టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ గురించి

          ఇంజన్: 69.9సీసీ

          పవర్: 3.5బిహెచ్‌పి

          టార్క్: 5ఎన్ఎమ్

          మైలేజ్: 66 కిమీ/లీ

          ఆన్ రోడ్ ధర: రూ. 31,723 లు

          05. హీరో గ్లామర్

          05. హీరో గ్లామర్

          ఐదవ స్థానంలో నిలిచిన హీరో మోటోకార్ప్‌కు చెందిన గ్లామర్ బైకులో ఆప్షనల్‌గా ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వ్యవస్థను అందించారు మరియు దీనిని డిస్క్ బ్రేకులు కూడా అందించారు. ఇది 2016 ఫైనాన్షియల్ ఇయర్‌లోని మొదటి త్రైమాసకంలో 2,21,694 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

          హీరో గ్లామర్ గురించి

          హీరో గ్లామర్ గురించి

          • ఇంజన్: 125సీసీ
          • పవర్: 8బిహెచ్‌పి
          • టార్క్: 10ఎన్ఎమ్
          • మైలేజ్: 55 కిమీ/లీ
          • ఆన్ రోడ్ ధర: రూ. 65,647 లు
          • 04. హీరో ప్యాసన్

            04. హీరో ప్యాసన్

            నాలుగవ స్థానంలో నిలిచిన ప్యాసన్ బైకు హీరోమోటోకార్ప్‌కు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కమ్యూటర్ సెగ్మెంట్లో మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. 2016 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసకంలో సుమారుగా 2,73,497 యూనిట్లు అమ్ముడుపోయాయి.

            హీరో ప్యాసన్ గురించి

            హీరో ప్యాసన్ గురించి

            • ఇంజన్: 97.2సీసీ
            • పవర్: 8.2బిహెచ్‌పి
            • టార్క్: 8ఎన్ఎమ్
            • మైలేజ్: 90 కిమీ/లీ
            • ఆన్ రోడ్ ధర: రూ. 57,278 లు
            • 03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

              03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

              మూడవ స్థానంలో నిలిచిన హీరో వారి హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకు సుమారుగా 3,35,326 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇది నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. హీరో సంస్థకు మంచి విజయాన్ని అందిస్తున్న వాటిలో ఇది ఒక ఉత్పత్తి. పల్లె ప్రాంతాలలో దీనికి మంచి గిరాకీ ఉంది.

              హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గురించి

              హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గురించి

              • ఇంజన్: 97సీసీ
              • పవర్: 7.7బిహెచ్‌పి
              • టార్క్: 8ఎన్ఎమ్
              • మైలేజ్: 83 కిమీ/లీ
              • ఆన్ రోడ్ ధర: రూ. 50,230 లు
              • 02. హీరో స్ల్పెండర్

                02. హీరో స్ల్పెండర్

                ఈ జాబితాలో చివరి ఐదు స్థానాల తర్వాత ఉన్న స్థానాల్లో హీరో వారి ఉత్పత్తులు స్థానం సంపాదించుకున్నాయి. రెండవ స్థానంలో నిలిచిన స్ల్పెండర్ హీరో మోటోకార్ప్ వారి శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి ఇది. మైలేజ్ మరియు పనితీరుకు పర్యాయపదంగా నిలిచిన స్ల్పెండర్ బైకు గడిచిన 2016 ఆర్థిక ఏడాదిలోని మొదటి త్రైమాసకంలో ఏకంగా 6,35.857 యూనిట్లు అమ్ముడుపోయాయి.

                హీరో స్ల్పెండర్ గురించి

                హీరో స్ల్పెండర్ గురించి

                • ఇంజన్: 97.2సీసీ
                • పవర్: 8.2బిహెచ్‌పి
                • టార్క్: 8ఎన్ఎమ్
                • మైలేజ్: 81 కిమీ/లీ
                • ఆన్ రోడ్ ధర: రూ. 54,755 లు
                •  01. హోండా ఆక్టివా

                  01. హోండా ఆక్టివా

                  ద్విచక్ర వాహనాల జాబితాలోకి స్కూటర్ల సెగ్మెంట్ల నుండి వచ్చి చేరిన ఉత్పత్తులలో కేవలం జూపిటర్ మరియు ఆక్టివాలు ఉన్నాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన హోండా ఆక్టివా గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో 6,97,938 యూనిట్లు అమ్మకాలు జరిపింది. ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తూ మొదటి స్థానంలో ఉండే ఏకైక ద్విచక్ర వాహనం హోండా ఆక్టివా.

                  హోండా ఆక్టివా గురించి

                  హోండా ఆక్టివా గురించి

                  • ఇంజన్: 109సీసీ
                  • పవర్: 8బిహెచ్‌పి
                  • టార్క్: 8.7ఎన్ఎమ్
                  • మైలేజ్: 66 కిమీ/లీ
                  • ఆన్ రోడ్ ధర: రూ. 65,685 లు

                    (అన్ని ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్‌లను ప్రతి ఏడాదిలో కూడా మొదటి త్రైమాసకంగా పరిగణిస్తారు. )

                  • 2016 మొదటి త్రైమాసికంలో అదరగొట్టిన బైకులు ఇవే

                    కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు

                    భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?

Most Read Articles

English summary
Top 10 Selling Two-Wheelers In The First Quarter Of Financial Year 2016
Story first published: Thursday, July 21, 2016, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X