భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

By Anil

పూనే నగరం భారత దేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకును తయారు చేయడంలో కొన్ని రహస్య అడుగులు వేస్తోంది. అయితే డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీకు ప్రత్యేకం కథనం అందిస్తోంది. అయితే ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకును తయారు చేస్తున్న సంస్థ దీనికి కావాల్సిన పెట్టుబడులను ఆకర్షించడానికి రంగం సిద్దం చేసుకుంటోంది.

ప్రజా రవాణాలో శరవేగంగా దూసుకెళుతున్న ఓలా బైకు మరియు క్యాబ్ సంస్థ వ్యవస్థాపకులు మరియు ఇతర వ్యాపార వేత్తలు ఈ ఎలక్ట్రిక్ బైకులను వాణిజ్య పరంగా తయారు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకు గురించి మరిన్ని క్రింది కథనాలలో కలవు.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

పూనేకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బైకుల అభివృద్ది సంస్థ టార్క్ దాదాపుగా ఏడు సంవత్సరాల క్రితం ఈ రంగంలోకి అడుగుపెట్టింది. టార్క్ సంస్థ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకు శాంపిల్ మోడల్‌ను ఉత్పత్తి చేసింది.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

అయితే ఇందులో గేర్‌బాక్స్ కల్పించడానికి ఏవిధమైన ఆస్కారం లేదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ పరిమాణంలో బ్యాటరీ ఉంటుంది. దీనిని నగర మరియు ప్రాంతీయ రహదారుల మీద ప్రయాణానికి అనువుగా ఉండే విధంగా అభివృద్ది చేస్తున్నట్లు టార్క్ సంస్థ తెలిపింది.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

యమహాకు చెందిన ఎఫ్‌జడ్ 16 మోడల్ బైకు ఆధారంతో దీనిని అభివృద్ది చేస్తున్నారు. వివిధ స్థాయిలలో దీనిని పరీక్షించి టి6ఎక్స్ అనే పేరుతో టార్క్‌ సంస్థ ఎలక్ట్రిక్ బైకును అందుబాటులోకి తీసుకురానుంది.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

ప్రస్తుతం అన్ని విధాలుగా ఈ టి6ఎక్స్ బైకును తయారు చేశారు, అయితే అనుమతులు లభించిన తరువాత ఉత్పత్తికి సిద్దం చేయడమే తరువాయి.

నిధులకు మూలం

నిధులకు మూలం

అయితే ఈ టార్క్ సంస్థకు నిధులు సమకూర్చడానికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ అయిన ఓలా క్యాబ్స్ సంస్థ వ్యవస్థాపకులు భవిష్ సూద్, మరియు అంకిత్ అగర్వాల్ అనే వ్యాపార వేత్త ముందుకు వచ్చారు.

ఉత్పత్తి ప్లాంటు

ఉత్పత్తి ప్లాంటు

టార్క్ సంస్థ పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చుకున్న తరువాత పూనేలో టి6ఎక్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకుల ఉత్పత్తి ప్రారంభించనున్నారు. దీనికోసం పూనేలోనే ప్రత్యేక ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

టార్క్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులలో జిపిఎస్-సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్, మరియు మరిన్ని ఫీచర్లు ఇందులో టార్క్ సంస్థ అందించింది.

ఛార్జింగ్ స్టేషన్లు

ఛార్జింగ్ స్టేషన్లు

ఇలాంటి ఎలక్ట్రిక్ బైకులకు ఛార్జింగ్ చేయడానికి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మరియు పూనే వంటి నగరాలలో ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలనే ఆలోచనలో ఉన్నారు.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

టార్క్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 నుండి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని అంచనా.

భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రెడీ !!

అథర్ ప్రారంభం అదిరింది: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఎంట్రీ

Most Read Articles

English summary
Tork Motorcycles Raises Funds From Ola Founders
Story first published: Tuesday, April 19, 2016, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X