అద్భుతమైన ధరతో విడుదలైన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్

By Anil

టార్క్ మోటార్‌సైకిల్స్ దేశీయ విపణిలోకి భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైకు టి6ఎక్స్ (T6X) ను అత్యంత ఆకర్షణీయమైన ధరతో విడుదల చేసింది. ద్వి చక్రవాహనాల సెగ్మెంట్లోకి అడుగిడిన టార్క్ మోటార్‌సైకిల్స్ తమ మొదటి ఉత్పత్తిలో భారీ ఫీచర్లనే పరిచయం చేసింది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైకును టార్క్ మోటార్‌సైకిల్స్ సంస్థ దేశీయంగా ఉన్న మూడు ప్రధాన నగరాలైన ఢిల్లీ, పూనే మరియు బెంగళూరులలో ప్రవేశపెట్టింది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

మొదటగా తమ మొదటి ఉత్పత్తిని ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లలో అందుబాటులో ఉంచింది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

టార్క్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన టి6ఎక్స్ బైకులో బ్రష్లెస్ డిసి 6కిలోవాట్ సామర్థ్యం గల లిథియమ్ అయాన్ బ్యాటరీ కలదు.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 27ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. 80 శాతం చార్జింగ్ చేయడం ద్వారా సుమారుగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు, మరియు దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఈ ఎలక్ట్రిక్ బైకులోని బ్యాటరీని 80 శాతం ఛార్జింగ్ చేయడానికి 60 నిమిషాలు మరియు 100 శాతం చార్జింగ్ చేయడానికి రెండు గంటల సమయాన్ని తీసుకుంటుంది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

టార్క్ టి6ఎక్స్ బైకులో ఇరువైపులా డిస్క్ బ్రేకులను అందించారు. ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ మోనోషాక్ సస్పెన్షన్ కలదు.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఇందులోని బ్యాటరీ యొక్క జీవితం కాలం గురించి ప్రస్తావిస్తే కొత్త బ్యాటరీ 80,000 నుండి 1.00.000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఫీచర్ల పరంగా టి6ఎక్స్ స్పోర్ట్స్ లో ఫుల్లీ డిజిటల్ టిఎఫ్‌టి మానిటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, జిపిఎస్ మరియు న్యావిగేషన్, హెల్మెట్ స్టోరేజ్, మొబైల్ సపోర్ట్ యాప్, యాంటి థెఫ్ట్ అలారమ్, జియో ఫెన్సింగ్ మరియు పగటి పూట వెలిగే లైట్లు కలవు.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

టార్క్ టి6ఎక్స్ లో ట్రియోస్ (TRIOS) ఇంటిలిజెన్స్ సిస్టమ్ కలదు. దీని ద్వారా వివిధ రకాలుగా ఎంచుకునే రైడింగ్ మోడ్‌ల వద్ద కావాల్సిన పవర్‌ను ఎంచుకునే అవకాశం కలదు.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఇందులో స్పోర్ట్ మరియు ఎకో అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు కలవు. ఇందులోని సిస్టమ్ క్లౌడ్ ద్వారా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర రూ. 1,24,999 లు (సంస్థ అమ్మకపు ధర) బెంగళూరుగా ఉంది.

టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

  • అందమైన భామల నడుమ కియా రియో ప్రదర్శన
  • మానవ నిర్మిత అద్బుతాలలో ఒకటైన సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • నానో పెలికాన్ టెస్టింగ్: విడుదల, విశిష్టతలేమి ?

Most Read Articles

English summary
Read In Telugu: Tork Motorcycles Unveils India’s First Electric Motorcycle T6X At Rs 1.25 Lakh
Story first published: Friday, September 30, 2016, 19:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X