న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

Posted By:

భారత దేశం విభిన్న సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. దేశీయంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు జరుపుకునే పండుగలు వివిధ సాంప్రదాయాలని ప్రతిబింబిపజేస్తాయి. ఒక్కో పండుగ ఒక్కో నగరానికి ప్రత్యేకం. ఇందుకోసం భారత దేశపు పండుగలు, వివిధ ప్రధాన నగరాలలో వాటి సంభరాలు మరియు ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాలను టీవీఎస్ వీగో ద్వారా తెలుసుకునే భాగంలో డ్రైవ్‌స్పార్క్ ఇప్పటికే పలు నగరాలను చుట్టేసింది.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

దేశ వ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో భారత దేశపు సాఫ్ట్‌వేర్ రాజధాని బెంగుళూరు ఇప్పటికే ఈ పాశ్చాత్య పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దమైంది. బెంగళూరు నగర వేదికగా డ్రైవ్‌స్పార్క్ బృందం యొక్క టీవీఎస్ వీగో రైడ్ మరియు బెంగళూరు గురించిన వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

ఇప్పుడు మనందరికీ తెలిసిన బెంగళూరు నగరం సుమారుగా 1500 సంవత్సర కాలంలో మొదటి కెంపే గౌడ చేత నిర్మించబడింది. సరిగ్గా 1537 కాలంలో విజయ నగర సామ్రాజ్యంలోని సామంతులు 1537 ల కాలంలో మట్టి ఇటుకలతో నిర్మించారు.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

కాలం మారడం, నగరం పెద్దదికావడం, ఆధునీకరణ మరియు పాశ్చాత్య సంస్కృతికి ప్రజలు అలవాటు పడటంతో వారు నిర్మించిన ఆ కోట ఏ రోజుకారోజు కుంచించుకుపోయింది. చివరికి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలస్‌గా నిలిచిపోయింది.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం యొక్క రూపు రేఖలు దాదాపుగా మారిపోయాయి. కానీ బెంగళూరు యొక్క చరిత్రను గుర్తుచేయడానికి ఈ ఆధునిక కాంక్రీట్ అడవిలో బెంగళూరు ప్యాలెస్ ఒకటి ప్రత్యేకంగా నిలిచింది. దీని నిర్మాణాన్ని 1944 లో పూర్తి చేశారు.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

దక్షిణ భారత దేశంలో బెంగళూరు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. గ్రీన్ సిటీగా పేరొందిన నగరానికి సాఫ్ట్ సంస్థల, తయారీ సంస్థల తాకిడి భారీగా పెరిగింది. భారత దేశపు ప్రధాన నగరాలలో బెంగళూరు ఒకటి నిలిచింది. దీనితో అనేక మందికి ఉపాధినివ్వగలిగింది.

కుంచించుకుపోయిన రహదారులు, ట్రాఫిక్ తో నగర జీవనం కాస్త అస్తవ్యస్తమనే చెప్పాలి, అయితే మేము టీవీఎస్ వీగో మీద రైడింగ్‌కు వెళ్లినపుడు కాస్త బాగానే అనిపించింది. స్లిమ్ బాడీ డిజైన్ మరియు శక్తివంతమైన ఇంజన్ సహాయంతో రైడింగ్ సునాయసంగా సాగింది.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

నూతన సంవత్సర సంభరాలకు నగరంలోని కొన్ని ప్రదేశాలు ఇప్పటికే సిద్దమయ్యాయి. ఇందుకోసం డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్దమైంది. ఇందుకు బెంగళూరు సెంట్రల్ మాల్ జెపి నగర్ కూడా ప్రసిద్దిగాచింది. మాల్ వద్ద టీవీఎస్ వీగో బాడీ పెయింటింగ్ కాస్త పోటీపడిందనే చెప్పువచ్చు.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

ఆంగ్ల సంవత్సరాది ప్రారంభమైన నేపథ్యంలో షాపింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. టెన్షన్ లైఫ్‌తో బీజీగా గడిపే వారికు వారాంతంలో వచ్చిన నూతన సంవత్సర వేడుకలను మంచి ఉల్లాసాన్నిస్తున్నాయని చెప్పవచ్చు.

వీధుల వెంబడి టీవీఎస్ వీగో రైడింగ్ సమయంలో పాదచారులను తప్పిస్తూ చేస్తున్న రైడింగ్ మమ్మల్ని అబ్బురపరిచింది. వీగోలోని అద్వితీయమైన బ్రేకింగ్ సిస్టమ్‌కు ధన్యవాధాలు చెప్పుకోవాల్సిందే.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

అర్థరాత్రి వరకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఒకే వీగో లో రైడింగ్ చేశాము. దాదాపుగా అలసిపోయామనే చెప్పాలి. కాని టీవీఎస్ వీగో ఏ మాత్రం కాదు. అస్తవ్యస్తమైన రహదారుల వెంబడి స్పీడ్ బ్రేకులను దాటుకుంటూ దాదాపుగా భయంకరమైన రైడింగ్ అని చెప్పవచ్చు. కాకపోతే మా ప్రయాణాన్ని వీగో సఫలం చేసింది. ఇందులో అధునాతనమైన సస్పెన్షన్ సిస్టమ్ మరియు బాడీ బ్యాలెన్సిగ్ టెక్నాలజీ సుఖవంతమైన రైడింహ్ అనుభవాన్ని కల్పించింది.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి మరో రాత్రి మాత్రమే మిగిలి ఉంది, అయితే తెలవారడానికి ముందే మా ప్రయాణానికి టాటా చెప్పాల్సి వచ్చింది. ప్రసిద్ద బ్రిగేడ్ రోడ్డులో మా రైడింగ్‌కు పులిస్టాప్ పెట్టేశాము. ఈ సందర్భాన్ని యువత బాగా ఎంజాయ్ చేస్తోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి ఎటు చూసినా బార్లు, పబ్బలు సిద్దంగా ఉన్నాయి.

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

ఈ ఏడాదికి మరో రోజు మిగిలి ఉంది. దాని తర్వాత నూనత సంవత్సరానికి స్వాగతం. ఇందుకు కావాల్సిన అన్ని రకాల షాపింగ్స్ చేశాము, ప్రసిద్ద ప్రదేశాలను సందర్శించాము. మా రైడింగ్‌లో భాగంగా బెంగళూరు నగరం యొక్క చరిత్రను కూడా తెలుసుకోగలిగాము.

బెంగళూరు నగరంలో నూతన సంవత్సర వేడుకల యొక్క సంభరాలు తీరును గురించి మరిన్ని వివరాలు తరువాత కథనంలో తెలుసుకుందాం...

న్యూ ఇయర్ వేడుకల్లో టీవీఎస్ వీగో

  
English summary
Here #Wego- Night Outs And New Year Celebrations In Bangalore — Part 1

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark