కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

Written By:

భారత దేశం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ పర్వదినాలను డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో మీద జరపుకుంటుందని ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్‌లో భాగంగా దుర్గా పూజని కలకత్తాలో, దీపావళిని పూనేలో సెలబ్రేట్ చేసుకుంది. అందులో భాగంగానే క్రిస్మస్ వేడుకలకు ఇండియాలో గాడ్ ఆఫ్ ది సిటి అని పిలవబడే కొచ్చిలో డ్రైవ్‌స్పార్క్ బృందం క్రిస్మస్ వేడుకలను టీవీఎస్ వీగో ద్వారా జరుపుకుంది.

టీవీఎస్ వీగో గురించి మరియు కొచ్చిన నగర విశేషాలతో పాటు క్రిస్మస్ వేడుకల అనుభవాలు....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

ప్రతి ఏడాది డిసెంబర్ మాసం మలిసగంలో క్రిస్మస్ వేడుకల ప్రారంభమవుతాయి. ఈ సందర్భంలో ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరి ఉమ్మడి క్రిస్మస్ వాతావరణాన్ని అనుభవిస్తారు. డ్రైవ్‌స్పార్క్ బృందంలోని సంతా మరియు అతని రెయిన్ డీర్లు విగో స్కూటర్ మీద కొచ్చిన నగరాన్ని క్రిస్మస్ పర్వదినాని చక్కర్లు కొట్టొచ్చారు.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

పోర్చుగీస్ వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ఫోర్ట్ కొచ్చి (కొచ్చిన్) ను టీవీఎస్ వీగో ద్వారా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ బృందం ఎంచుకుంది. ఆధునిక నగరాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన వీధులతో తక్కువ ట్రాఫిక్‌తో కాలం మిమ్మల్ని ముందుకు కదలనీయదంటే నమ్మండి. ముఖ్యంగా పై చిత్రంలో ఉన్న ఓల్డ్ హార్బర్ హోటల్ ను గమనించండి.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

దీనిని క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని కూడా అంటారు. ఒకానొక కాలంలో కోస్టల్ సిటి కొచ్చిన మసాలా దినుసుల ఎగుమతికి బాగా పేరుగాంచింది. 1503 కాలంలో పోర్చ్‌గీస్ వారు దీనిని ఆక్రమించారు. ఆ తరువాత ఈ స్థానం గోవాకు వెళ్లిపోయింది.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

కొచ్చి నగరంలో ఉన్న దాదాపు అన్ని చర్చిలతో పోర్చుగీస్ కు విడదీయరాని సంభందం ఉంది. కొచ్చిలోని అద్బుతమైన చర్చిలను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. అర్ధ రాత్రి వరకు చర్చిల్లో జనాలు ప్రార్థనలు చేశారు.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

క్రిస్మస్ వేడుకల్లో ఇంటిని డెకరేట్ చేయటం కూడా అతి ముఖ్యం. అయితే చాలా మంది ఆరంభడాలకు పోకుంటా క్రిస్మస్ పండుగ అని తెలిపేలా ఇంటి ముందు కాంతిని వెదజల్లే నక్షత్రాన్ని ఉంచుతారు.

ఈ వేడుకల్లో సింపుల్‌గా ఉండే అలంకరణకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అచ్చం టీవీఎస్ విగో తరహాలో - అత్యుత్తమ డిజైన్, అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల ఇంజన్ మరియు సాధారణ జనులకు ఉపయోగపడే ఫీచర్లకు ఇందులో అధిక ప్రాధాన్యతనిచ్చారు. )

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

టీవీఎస్ వీగోలో అదనంగా అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గొప్ప అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం కలదు ఇందులో క్రిస్మస్ చెట్టును కూడా తీసుకెళ్లవచ్చు. మరియు ఆత్రంగా వ్యవహరించే వారి కోసం ఇందులో ఛార్జింగ్ పోర్ట్ కూడా కలదు.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

కొచ్చి నగరానికి వస్తే కేరళ రాష్ట్రానికి ఇది వాణిజ్య రాజధానిగా వ్యవహరిస్తోంది. ఆర్థికంగా మరియు పర్యాటక రంగం పరంగా దీనికి అధిక ప్రాముఖ్యత కలదు. క్రూయిజ్ నౌకలు మరియు పెద్ద పెద్ద షిప్పులు ఎప్పుడు ఇక్కడి నీటిలో పయనిస్తూ దర్శనమిస్తుంటాయి.

రాకాసిలా నోరెళ్లబెట్టే అలలను చీల్చుకుంటూ పెద్ద పెద్ద నౌకలు ఎంత స్మూత్‌గా ప్రయాణిస్తాయి. అచ్చం ఇదే రీతిలో టీవీఎస్ రైడింగ్ ఉంటుంది. రఫ్ రోడ్ల మీద కూడా సౌకర్యవంతమైన రైడింగ్ వీగో ద్వారా పొందవచ్చు.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

కొచ్చి నగరం కాలంతో పాటు వేగంగా రూపాంతరం చెందింది. చుట్టూ నీరు ఉన్నా కూడా అక్కడక్కడ భారీ అపార్ట్‌మెంట్‌లు వెలిశాయి. నగర వాసుల కోసం అనే మాల్స్ కూడా అనతి కాలంలోనే వెలిశాయి.

టీవీఎస్ కాలంతో పాటే ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో ఒకటి టీవీఎస్ వీగో.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

చేపల వ్యాపారం కొచ్చి నగరానికి ప్రధాన ఆదాయ వనరు. కొచ్చి తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చైనా వలన దర్శనమిస్తుంటాయి. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో తీర ప్రాంతాల్లోని ఈ తెరలు ఎంతో అందంగా ఉంటాయి.

అనేక ఫీచర్లు మరియు సాంకేతిక అంశాల జోడింపుతో పాటు విభిన్న రంగుల్లో వీగో స్కూటర్‌ను ఎంచుకునే అవకాశాన్ని టీవీఎస్ కల్పించింది. ఎప్పుడూ అవే సాదా సీదా రంగుల్లో లభించే స్కూటర్ల స్థానంలో వీటిని ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

బీచ్ సమీపానికి వీగో మీద వెళ్లినపుడు అక్కడి సూర్యోదయం వేళ సూర్యుడు మంచును చీల్చుకుంటూ వస్తున్న దృశ్యాన్ని గమనించవచ్చు. క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో ద్వారా డ్రైవ్‌స్పార్క్ బృందం మంచి రైడింగ్ అనుభవాన్ని పొందింది.

కొచ్చి లోని క్రిస్మస్ వేడుకల గురించి మరిన్ని ప్రత్యేకతలను డ్రైవ్‌స్పార్క్ తెలుగు మరో కథనంతో మీ ముందుకు వస్తుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగునే చూస్తూ ఉండండి...

కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

భారత దేశం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ పర్వదినాలను డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో మీద జరపుకుంటుందని ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్‌లో భాగంగా దుర్గా పూజని కలకత్తాలో, దీపావళిని పూనేలో సెలబ్రేట్ చేసుకుంది. వీటి గురించి పూర్తి వివరాలు.....

English summary
Here #Wego: Feliz Navidad In Cochin - Part 1
Story first published: Wednesday, December 28, 2016, 11:25 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark