2017 లో విడుదలకు సిద్దమైన బైకుల జాబితా మరియు వాటి పూర్తి వివరాల కోసం....

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కుర్రకారు మతిపోగట్టే అతి నూతన బైకుల వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. వాటి జాబితా పరంగా పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

By Anil

మార్కెట్లోకి ప్రతి ఏడాది కూడా ఎన్నో కొన్ని కొత్త బైకులు విడుదలవుతూనే ఉంటాయి. అయినప్పటికీ ఇంకా మంచి బైకులు కావాలనుకునే వారు లేకపోలేదు. అందుకే కాబోలు అలాంటి ఔత్సాహికుల కోసం 2017 ఏడాది అనేక కొత్త బైకుల విడుదలకు వేదక కానుంది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కుర్రకారు మతిపోగట్టే అతి నూతన బైకుల వచ్చే ఏడాది (2017)లో విడుదల కానున్నాయి. వాటి జాబితా పరంగా ఫోటోలతో కూడిన పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

2017 కెటిఎమ్ 390

2017 కెటిఎమ్ 390

ప్రారంభం నుండి అందుబాటులో ఉన్న కెటిఎమ్ 390 డ్యూక్ ను ఎంతో మంది ఔత్సాహికులు ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ విడుదల కానున్న 2017 కెటిఎమ్ 390 డ్యూక్ యువతలో ఉత్సుకతను పెంపొందిస్తోంది. డిజైన్ పరంగా అత్యంత పదునైన లుక్ తో 13.4-లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ట్యాంక్ మరియు ఎల్ఇడి హెడ్ లైట్స్ తో పాటు రన్నింగ్ లైట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

2017 లో విడుదల కానున్న బైకులు

సరికొత్త కెటిఎమ్ డ్యూక్ లో ఆల్ కలర్ టిఎఫ్‌టి డిస్ల్పే గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కెటిఎమ్ మై రైడ్ సిస్టమ్ కలదు, దీని ద్వారా రైడర్ బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను డిస్ల్పేకు అనుసంధానం చేసుకోవచ్చు. కెటిఎమ్ ఈ 2017 390 డ్యూక్ కోసం లైట్ వెయిట్ తో లావుగా ఉన్న ఫ్రేమ్ ను అభివృద్ది చేసింది.

2017 లో విడుదల కానున్న బైకులు

సాంకేతికంగా కెటిఎమ్ సరికొత్త 2017 390 డ్యూక్ లో అదే 373 సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, అయితే ఇందులో స్లిప్పర్ క్లచ్ మరియు రైడ్ బై వైర్ వంటి సాంకేతికతను జోడించారు. ఎగ్జాస్ట్ వాయువులను వెనుక నుండి కాకుండా క్రింద నుండి ప్రక్కకు వెళ్లే విధంగా డిజైన్ చేసారు. ఇది గరిష్టంగా 43.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

  • విడుదల అంచనా: 2017 ప్రారంభానికి
  • ధర అంచనా: 2 నుండి 2.5 లక్షల మధ్య
  • హస్కవర్నా విట్పిలెన్ 401

    హస్కవర్నా విట్పిలెన్ 401

    హస్కవర్నా కెటిఎమ్ 390 ఆధారిత విట్పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 అనే ప్రడక్షన్ రెడి ఉత్పత్తులను ప్రదర్శించింది. సమాచార వర్గాల కథనం మేరకు రోడ్-స్పెక్ విట్పిలెన్ బైకును బజాజ్ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. దీనిని వచ్చే ఏడాది దేశీయ ద్విచక్ర వాహనాల తీరంలో ప్రవేశపెట్టనున్నట్లు వినికిడి.

    2017 లో విడుదల కానున్న బైకులు

    హస్కవర్నా విట్పిలెన్ బైకు సాంకేతికంగా కెటిఎమ్ 390 లోని విడి భాగాలతో నిర్మితమవతోంది. భవిష్యత్ డిజైన్ భాషలో కేఫ్ రేసర్ స్టైల్లో ఈ విట్పిలెన్ కలదు. ఈ బైకు కెటిఎమ్ వారి 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది. గరిష్టంగా43.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

    2017 లో విడుదల కానున్న బైకులు

    కేఫ్ రేసర్ స్టైల్లో ఉన్న హస్కవర్నా విట్పిలెన్ 401 బైకులో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ కలదు. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పోక్స్ వీల్స్, వంటివి ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

    • విడుదల అంచనా: 2017 ఏడాది మలి సగంలో
    • ధర అంచనా: 2.2 నుండి 2.5 లక్షల మధ్య
    • బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

      బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

      ఇండియాలో విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న స్పోర్ట్స్ బైకు ఈ జి310 ఆర్. ఈ స్పోర్ట్స్ బైకును రివర్స్ సిలిండర్ ఇంజన్ వచ్చేట్లు డిజైన్ చేశారు. తద్వారా గురత్వ కేంద్రాన్ని అభివృద్ది చేసే మొత్తం బరువుని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తద్వారా బైకును సులభంగా మరియు వేగంగా రైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

      2017 లో విడుదల కానున్న బైకులు

      బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ లో ఫీచర్ల పరంగా అప్ సైడ్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనో షాక్ అబ్జార్వర్లు, పూర్తి స్థాయిలో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 17 అంగుళాల అల్లాయ్ చక్రాలు మరియు 12 వోల్ట్‌ల ఛార్జింగ్ సాకెట్ కలదు. భద్రత పరంగా రెండు చక్రాలకుయాంటి లాక్ బ్రేకింగ్ వ్యవస్థ గల డిస్క్ బ్రేకులు, ఎల్‌ఇడి లైట్లు గల టర్న్ సిగ్నల్స్ కలవు.

      2017 లో విడుదల కానున్న బైకులు

      బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ టీవీఎస్ భాగస్వామ్యంతో ఈ జి310 ఆర్ స్పోర్ట్స్ బైకును దేశీయంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో 313సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది, ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

      • విడుదల అంచనా: 2017 మధ్య భాగానికి
      • ధర అంచనా: 2.2 నుండి 2.5 లక్షల మధ్య
      • బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్

        బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్

        బిఎమ్‌డబ్ల్యూ తమ జి310 ఆర్ ఆధారంతో జి310 జిఎస్ బైకును అభివృద్ది చేస్తోంది. అయితే అది పూర్తిగా అడ్వెంచర్ టూరింగ్ స్టైల్లో వస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ కుటుంబంలో అతి చిన్నబైకు సరికొత్త డిజైనింగ్ భాషను పరిచయం చేస్తోంది.

        2017 లో విడుదల కానున్న బైకులు

        జిఎస్ బైకులో ఫ్రంట్ ఫోర్క్స్, హెడ్ ల్యాంప్స్, రేడియేటర్ డిజైన్ మరియు ఇంధన ట్యాంకు డిజైన్ వంటివి ఎన్నో బిఎమ్‌డబ్ల్యూ బైకుల కుంటుంబంలో జిఎస్ పాత్రను ప్రత్యేకం చేశాయని చెప్పవచ్చు. అడ్వెంచర్ లక్షణాలతో ఉన్న ఈ జిఎస్ లో ముందువైపున 49ఎమ్ఎమ్ ట్రావెల్ గల ఫ్రంట్ సస్పెన్షన్ కలదు.

        2017 లో విడుదల కానున్న బైకులు

        బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ బైకులో స్టాండర్డ్ గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 15-వోల్ట్ సామర్థ్యం గల ఛార్జింగ్ సాకెట్, హీటెడ్ గ్రిప్స్, సీటు ఎత్తును రెండు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం, స్మార్ట్ అనుసంధానం మరియు జిపిఎస్ న్యావిగేషన్ వంటి ఫీచర్లున్నాయి.

        • విడుదల అంచనా: 2017 ఏడాదిలో ఆలస్యంగా
        • ధర అంచనా: 2.5 నుండి 3 లక్షల మధ్య
        • టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 300 (అకులా 310)

          టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 300 (అకులా 310)

          టీవీఎస్ మోటార్స్ ఈ అకులా 310 ఫుల్లీ ఫెయిర్ మోటార్ సైకిల్ ను మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. చూడటానికి మోటోస్పోర్ట్ బైకు తరహాలో ఉన్న దీనిని బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ ను అభివృద్ది చేసిన వేదిక మీద అదే సాంకేతికతతో అభివృద్ది చేశారు.

          2017 లో విడుదల కానున్న బైకులు

          ఇదే డిజైన్ తరహాలో ఇప్పటి వరకు అనే సార్లు పరీక్షలకు గురైంది. దీనిని బట్టి చూస్తే కాన్సెప్ట్ రూపంలో ఉన్న ఇదే డిజైన్‌తో ప్రొడక్షన్‌కు సిద్దం అయ్యే అవకాశం ఉంది. ప్రొడక్షన్ దశకు రానున్న ఈ అకులా 310 పేరును అపాచే ఆర్‌టిఆర్ 300 గా మార్పు చేసే అవకాశం ఉంది.

          2017 లో విడుదల కానున్న బైకులు

          సాంకేతికంగా ఈ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 300 లో బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ లో వినియోగించనున్న అదే 313 సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 33బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

          • విడుదల అంచనా: 2017 ఏడాదిలో ఆలస్యంగా
          • ధర అంచనా: 2 నుండి 2.5 లక్షల మధ్య
          • డుకాటి మల్టీస్ట్రాడా 950

            డుకాటి మల్టీస్ట్రాడా 950

            డుకాటి ఇండియన్ మార్కెట్లోకి తమ మల్టీస్ట్రాడా లోని 937సీసీ సామర్థ్యం గల ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను తీసుకురానుంది. ఈ మల్టీస్ట్రాడా 950 మోడల్ దీని శ్రేణిలో ఉన్న 1200ఎస్ వేరియంట్ యొక్క అనేక విడి భాగాలను పంచుకోనుంది. ప్రీమియమ్ ఫీచర్లతో సులభమైన అడ్వెంచర్ రైడింగ్ కోసం ఈ మల్టీస్ట్రాడా 950 అడ్వెంచర్ బైకును విడుదల చేయనుంది.

            2017 లో విడుదల కానున్న బైకులు

            సాంకేతికంగా డుకాటి మల్టీస్ట్రాడా 950 బైకు 937సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 113బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

            2017 లో విడుదల కానున్న బైకులు

            డుకాటి మల్టీస్ట్రాడా 950 లో ఆఫ్ రోడింగ్ కోసం ముందు మరియు వెనుక వైపున 170ఎమ్ఎమ్ వరకు లాంగ్ ట్రావెల్ గల పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

            • విడుదల అంచనా: 2017 లో ఆలస్యంగా
            • ధర అంచనా: 13 నుండి 14 లక్షల మధ్య
            • డిఎస్‌కె బెనెల్లీ టొరాండో 302 ఆర్

              డిఎస్‌కె బెనెల్లీ టొరాండో 302 ఆర్

              ఈ జాబితాలోని మరో ఉత్పత్తి ఇటాలియన్ టూ వీలర్ మేకర్‌ డిఎస్‌కె బెనెల్లీ వారి టొరాండో 302 ఆర్. ఇది టిఎన్‌టి 300 నేక్డ్ వర్షెన్ యొక్క ఫుల్లీ పెయిర్ వర్షన్. టిఎన్‌టి 300 వేదిక ఆధారంగా రూపొందించినప్పటికీ డిజైన్ మరియు లక్షణాలు అన్నీ కూడా టొరాండో 302 ఆర్‌లో నూతనంగా ఉంటాయి.

              2017 లో విడుదల కానున్న బైకులు

              టిఎన్‌టి 300 తో పోల్చుకుంటే చిన్న ట్యాంక్ మాత్రమే కలదు. కానీ, ఇది 14 లీటర్ల ఇంధన స్టోరేజి సామర్థ్యాన్ని కలిగి ఉంది. బాడీ మీద గ్రాఫిక్స్ దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. బెనెల్లీ టొరాండో 302 ఆర్ బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్‌ ఫీచర్‌గా ఉంది.

              2017 లో విడుదల కానున్న బైకులు

              డిఎస్‌కె బెనెల్లీ టొరాండో 302 ఆర్ లో 300సీసీ సామర్థ్యం గల ఇన్ లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 35బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ గరిష్ట టర్క్ ఉత్పత్తి చేయును.

              • విడుదల అంచనా: 2017 ప్రారంభానికి
              • ధర అంచనా: 3 నుండి 3.5 లక్షల మధ్య
              • డిఎస్‌కె బెనెల్లీ టిఆర్‌కె 502

                డిఎస్‌కె బెనెల్లీ టిఆర్‌కె 502

                అడ్వెంచర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ నుండి వచ్చే ఏడాదిలో విడుదల కానున్న మరో బైకు టిఆర్‌కె 502. ఇటాలియన్‌కు చెందిన బెనెల్లీ ఈ టిఆర్‌కె 502 ను మొదటి సారిగా 2015 ఎకిమా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది.

                2017 లో విడుదల కానున్న బైకులు

                అడ్వెంచర్ లక్షణాలను చూడగానే పసగట్టే విధంగా ఉంది దీని డిజైన్. ముందు వైపున పెద్ద ముక్కు వంటి ఆకారంలో ఉన్న ఈ పూర్తి స్థాయి అడ్వెంచర్ బైకును 2017 నాటికి ఇండియన్ రోడ్ల మీదకు విడుదల చేయడానికి బెనెల్లీ సిద్దంగా ఉంది.

                2017 లో విడుదల కానున్న బైకులు

                సాంకేతికంగా ఈ డిఎస్‌కె బెనెల్లీ టిఆర్‌కె 502 బైకులో 499సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 46బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనిని రోడ్-ఓరియెంటెడ్ మరియు ఆఫ్-రోడింగ్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేయనుంది.

                • విడుదల అంచనా: 2017 మధ్య బాగానికి
                • ధర అంచనా: 5 నుండి 6 లక్షల మధ్య
                • డిఎస్‌కె బెనెల్లీ లియాన్సినో

                  డిఎస్‌కె బెనెల్లీ లియాన్సినో

                  ఇండియన్ మార్కెట్లో ఉన్న స్క్రాంబ్లర్ శ్రేణి మీదకు పై పోటీగా లియాన్సినో బైకును విడుదల చేయడానికి బెనెల్లీ సుముఖంగా ఉంది. పాత కాలం నాటి డిజైన్‌లో ఆధునిక ఫీచర్లతో నిండిన లియాన్సినో స్పోర్ట్స్ మినిమల్ బాడీ వర్క్‌తో వచ్చింది. ఫ్రంట్, ట్యాంక్ మరియు టెయిల్ డిజైన్ చాలా సింపుల్‌గా ఆకర్షణీయంగా ఉన్నాయి.

                  2017 లో విడుదల కానున్న బైకులు

                  సాంకేతికంగా ఈ డిఎస్‌కె బెనెల్లీ లియాన్సినో బైకులో 500సీసీ సామర్థ్యం గల ట్విన్ ప్యార్లల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

                  2017 లో విడుదల కానున్న బైకులు

                  బెనెల్లీ ఈ లియాన్సినో బైకులో ముందు వైపున 50ఎమ్ఎమ్ యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో సస్పెన్షన్ సిస్టమ్ అందించింది.

                  • విడుదల అంచనా: 2017 చివరికి
                  • ధర అంచనా: 4 నుండి 5 లక్షల మధ్య
                  • యమహా ఎమ్‌టి 03

                    యమహా ఎమ్‌టి 03

                    జపాన్‌కు చెందిన యమహా తమ వైడ్ఎఫ్ ఆర్ వర్షన్ ను నేక్డ్ వేరియంట్ గా ఎమ్‌టి 03 పేరుతో వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి ఎమ్‌టి 09 బైకు కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా అందుబాటులో ఉంది.

                    2017 లో విడుదల కానున్న బైకులు

                    ఈ యమహా ఎమ్‌టి 03 డిమైండ్ ఫ్రేమ్‌తో ఆర్3 వేరియంట్‌కు కాంపాక్ట్ సైడ్ వర్షన్‌గా విడుదల కానుంది. ఇందులో విశాలమైన రైడర్ హ్యాండిల్, ఆర్ 3 నుండి సేకరించిన బ్రేకులు, టైర్లు మరియు చక్రాలను ఇందులో అందించారు.

                    2017 లో విడుదల కానున్న బైకులు

                    యమహా ఎమ్‌టి 03 లో 321సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. దీనిని ఆ3 వేరియంట్లో గుర్తించవచ్చు. ఇది గరిష్టంగా 41బిహెచ్‌పి పవర్ మరియు 29ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

                    • విడుదల అంచనా: 2017 లో ఆలస్యంగా
                    • ధర అంచనా: 2.5 నుండి 3 లక్షల మధ్య
                    • 2017 లో విడుదల కానున్న బైకులు

                      • స్కూటర్ల రాజ్యం: మార్కెట్లోకి దూసుకొస్తున్న స్కూటర్లు
                      • మార్కెట్ కు షాక్: చేతక్ స్కూటర్ ను రీలాంచ్ చేయనున్న బజాజ్
                      • బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు

Most Read Articles

English summary
Upcoming Bikes In India In 2017 — Make Your Choice
Story first published: Monday, December 5, 2016, 12:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X