రేసింగ్ బ్లూ ఎడిషన్ పల్సర్ ఆర్ఎస్200 విడుదల చేసిన బజాజ్

Written By:

2016 లో అత్యధిక టూ వీలర్లను విక్రయించిన టాప్ 10 తయారీ సంస్థల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న బజాజ్ ఇప్పుడు కమ్యూటర్ సెగ్మెంట్ నుండి ప్రీమియమ్ సెగ్మెంట్లో తన ప్రభావాన్ని చాటుకోవడానికి సిద్దమైంది. ఇది వరకే తమ లైనప్‌లో ఉన్న పల్సర్ ఆర్ఎస్200 మోడల్‌ను నూతన కలర్ ఆప్షన్‌లతో రేసింగ్ బ్లూ ఎడిషన్ గా మళ్లీ విడుదల చేసింది.
 

డిసెంబర్ 2016 లో బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్ ను 1.50 లక్షల ప్రారంభ ధరతో దేశీయంగా విడుదల చేసింది. సరిగ్గా నెల కూడా తిరక్కనే మరో పర్ఫామెన్స్ మోటార్ సైకిల్‌ను పల్సర్ శ్రేణిలోని ఆర్ఎస్200 ను రేసింగ్ బ్లూ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

బైక్ వాలే వెబ్‌సైట్ తెలిపిన కథనం మేరకు బజాజ్ తమ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ బ్లూ ఎడిషన్ నాన్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.47 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.67 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా ఉన్నట్లు తెలిపింది.

బజాజ్ గత ఏడాది టర్కీలో విడుదల చేసిన ఆర్ఎస్ 200 తెలుపు మరియు నీలం రంగులకు కాస్త విభిన్నంగా నూతన కలర్ స్కీమ్‌లో 2017 పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ బ్లూ పేరుతో ప్రవేశపెట్టింది.

ఈ బైకులో గుర్తించే అప్‌డేట్స్‌లో మొదటి ముందు చక్రం మీద నీలం రంగు మరియు వెనుక చక్రం మీద నలుపు రంగు పెయింట్ కలదు.

ప్రస్తుతం బజాజ్ లైనప్‌లో పసుపు, ఎరుపు మరియు నలుపు అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగ బజాజ్ విడుదల చేసిన రేసింగ్ బ్లూ ఎడిషన్ బుకింగ్స్ ఇప్పటికే బజాజ్ డీలర్ల వద్ద ప్రారంభమయ్యాయి.

2017 పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ బ్లూ ఎడిషన్‌లో బజాజ్ సాంకేతికంగా 199.5సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 24.2బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది గరిష్టంగా గంటకు 150 కిలమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

బజాజ్ ఆటో గత ఏడాది డిసెంబర్‌లో డామినర్ 400 బైకును విడుదల చేసింది. ఫోటోలు కోసం క్రింద గల గ్యాలరీ మీద క్లిక్ చేయండి...
 

Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj Launches 2017 Pulsar RS 200 Racing Blue Edition; Priced At Rs 1.47 Lakh
Story first published: Friday, January 20, 2017, 12:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos