నూతన అప్‌డేట్స్‌తో సరికొత్త హీరో మాయెస్ట్రో ఎడ్జ్

హీరో మోటోకార్ప్ సంస్థ తమ మాయెస్ట్రో ఎడ్జ్‌కు అనేక అప్‌డేట్స్ నిర్వహిస్తోంది. అందులో ప్రధానంగా ఇంజన్, కలర్స్ మరియు ఫీచర్ల పరంగా నూతన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.

By Anil

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2017 మాయెస్ట్రో ఎడ్జ్ ను విడుదల చేయనుంది. మునుపటి మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌కు చాలా వరకు అప్‌డేట్స్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా ఇంజన్, స్పెసిఫికేషన్లు మరియు కలర్స్ పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

హీరో మోటోకార్ప్ మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను తమ ఫోర్ట్‌పోలియో నుండి జనవరి 2017 లో తొలగించింది . ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి 2017 మోడల్ మాయెస్ట్రో ఎడ్జ్ ను విడుదల చేయనుంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

భారత ప్రభుత్వం భద్రత పరంగా ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ (AHO) ఫీచర్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిభందనల మేరకు హీరో మోటోకార్ప్ మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌లో అందిస్తోంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అందివ్వడంపై ఎలాంటి సమాచారం లేదు. అయిచే, హీరో బిఎస్-IV ఇంజన్‌ను తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

సాంకేతికంగా 2017 హీరో మాయెస్ట్రో 110.9సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ఎయిర్ కూల్డ్ ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ రానుంది. వేరియోమ్యాటిక్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

నూతన అప్‌డేట్స్ గల ఈ ఇంజన్ తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద ఎక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా అత్యుత్తమ పనితీరు మరియు మైలేజ్ సాధ్యమయ్యే అవకాశం కలదు.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

సరికొత్త హీరో మాయెస్ట్రో ఎడ్జ్ నూతన డ్యూయల్ టోన్ రంగుల్లో లభించును. అవి, స్పోర్టివ్ మట్టీ గ్రే మరియు రెడ్, ఆక్టివ్ మట్టీ గ్రే మరియు బ్లూ.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

ఫీచర్ల పరంగా 2017 హీరో మాయెస్ట్రో ఎడ్జ్ లో డిజిటల్ మరియు అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, బూట్ లైట్, ట్యూబ్ లెస్ టైర్లు మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ కలవు.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

హీరో మోటోకార్ప్ 2017 మాయెస్ట్రో స్కూటర్‌లో బాహ్య వైపున ఇంధనాన్ని నింపే క్యాపును అందివ్వనుంది. మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

గతంలో మాయెస్ట్రో ఎడ్జ్ లోని స్టీల్ వీల్ వేరియంట్ ధర రూ. 50,330 లు మరియు మాయెస్ట్రో ఎడ్జ్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 51,718లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉండేవి. అయితే నూతన అప్‌డేట్స్‌తో రానున్న వేరియంట్ల ధరలు స్వల్పంగా పెరిగ అవకాశం ఉంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్

యమహా ఇండియా కొత్తగా ఎఫ్‌జడ్25 బైకును దేశీయంగా విపణిలోకి విడుదల చేసింది. దీనికి సంభందించిన వివరాల కోసం మరియు ఎఫ్‌జడ్25 ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు....

Most Read Articles

English summary
2017 Hero Maestro Edge Gets Several Updates
Story first published: Monday, January 30, 2017, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X