2017 జిక్సర్, ఎస్ఎఫ్ మరియు యాక్సెస్ 125 లను విడుదల చేసిన సుజుకి

Written By:

సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్ మరియు యాక్సెస్ 125 లను 2017 మోడళ్లుగా విడుదల చేసింది. బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ మరియు నూతన కలర్ ఆప్షన్‌లను అందించింది.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

సుజుకి టూ వీలర్ల తయారీ సంస్థ తమ మూడు మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌ను అందించింది. ప్రతి ద్విచక్ర వాహనంలో ఈ రెండింటిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

2017 జిక్సర్ ఇంధన ట్యాంకు మీద స్పోర్టివ్ గ్రాఫిక్స్ మరుయు సరికొత్త జిక్స్ లోగోను అందించింది. స్పోర్టివ్ శైలిని ప్రతిబింబించే విధంగా క్లియర్ లెన్స్ ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ అందించింది.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

సరికొత్త 2017 జిక్సర్ మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, పర్ల్ మిరా రెడ్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు మెటాలిక్ ట్రిటన్ బ్లూ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్. ఈ కలర్ ఆప్షన్లు వెనుక వైపున డిస్క్ బ్రేకు ఉన్న జిక్సర్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అనే రంగు డ్రమ్ బ్రేక్ జిక్సర్ వేరియంట్లో కూడా లభించును.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

రియర్ డిస్క్ బ్రేక్ ఉన్న 2017 జిక్సర్ వేరియంట్ ధర రూ. 80,528 లు మరియు డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 77,452 లు. రెండు ధరలు కూడా ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

2017 మోడల్ జిక్సర్ ఎస్ఎఫ్ మోడల్ కూడా స్పోర్టివ్ గ్రాఫిక్స్ ప్రేరిత సుజుకి లోగోను కలిగి ఉంది. అంతే కాకుండా మెటాలిక్ ట్రిటన్ బ్లూ, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ మరియు పర్ల్ మిరా రెడ్ అనే రంగుల్లో లభించును.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

సరికొత్త జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ వేరియంట్ మెటాలిక్ ట్రిటన్ బ్లూ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ రంగుల్లో లభించును. 2017 జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ. 89,659 లు మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ ధర రూ. 93,499 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

సుజుకి సంస్థ తమ యాక్సెస్ 125 స్కూటర్‌లో కూడా అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. మునుపటి కలర్ ఆప్షన్లతో పాటు మెటాలిక్ సోనిక్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్ పరిచయం చేసింది.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

యాక్సెస్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 54,302 లు మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 57,615 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2017 నూతన సుజుకి ఉత్పత్తులు

గాలితో నడిచే ఎయిర్ పోడ్ కారును సృష్టించిన టాటా

 

English summary
Suzuki Launches 2017 Gixxer, Gixxer SF And Access 125 With BS-IV Compliant Engine
Story first published: Saturday, February 18, 2017, 16:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark