కొత్త కలర్ ఆప్షన్‌లో పట్టుబడిన 2018 బజాజ్ డామినర్

Written By:

భారతదేశపు ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో 2018లో కొత్త లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. అయితే, వాటికంటే ముందుగా పూనే ఆధారిత టూ వీలర్ల కంపెనీ బజాజ్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ డామినర్ 400 బైకును 2018 వెర్షన్‌గా రీలాంచ్ చేయనుంది.

2018 బజాజ్ డామినర్

న్యూ కలర్ పెయిట్ స్కీమ్ మరియు కొన్ని మైనర్ అప్‌డేట్స్‌కు గురైన 2018 డామినర్ 400 బైకును పరీక్షిస్తుండగా ఆటోమొబైల్ మీడియా కంటబడింది. ఇందులో అధికంగా కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

Recommended Video - Watch Now!
Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
2018 బజాజ్ డామినర్

బజాజ్ ఆటో డామినర్ 400 బైకును తొలుత 2016 డిసెంబరులో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. బజాజ్ ఆశించిన మేర ఫలితాలు సాధ్యం కాలేదు. బజాజ్ డామినర్ 400 దేశీయ విక్రయాల కంటే ఎగుమతులే అధికంగా ఉన్నాయి.

2018 బజాజ్ డామినర్

ఎలాగైన డామినర్ 400 బైకును సక్సెస్‌ఫుల్ మోడల్‌గా మలుచుకునేందుకు ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి 2018 వెర్షన్‌లో ప్రవేశపెట్టి తన లక్కును పరీక్షించుకోనుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, 2018 ప్రారంభంలో దీని విడుదల ఉండవచ్చు.

2018 బజాజ్ డామినర్

2018 డామినర్ 400 బైకు బజాజ్ చకన్ ప్లాంటుకు సమీపంలో కెమెరా కంటికి చిక్కింది. ఎక్ట్సీరియర్ డిజైన్, మరియు బాడీ ప్యానల్స్ వంటివి చూడటానికి ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉంటాయి. సింగల్ టోన్ రేసింగ్ రెడ్ కలర్ స్కీమును ప్రధాన మార్పుగా చెప్పుకోవచ్చు.

2018 బజాజ్ డామినర్

అంతే కాకుండా 2018 డామినర్ 400లో సిల్వర్ షేడ్ గల హ్యాడిల్ బార్, పెరిమీటర్ ఫ్రేమ్, ఫుట్ పెగ్స్ అసెంబ్లీ, స్వింగ్ ఆర్మ్ మరియు స్ల్పిట్ గ్రాబ్ రెయిల్స్ వంటివి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న సిల్వర్ సొబగులు మోటార్ సైకిల్‌కు ఫ్రెష్ లుక్ అందించాయి. ఇవి మినహాయిస్తే, స్పోర్ట్స్ క్రూయిజర్‌లో మరే ఇతర మార్పులు జరగలేదు.

Trending On DriveSpark Telugu:

2017లో విడుదలైన బెస్ట్ బైకులు

ఐఫోన్ X కన్నా తక్కువ ధరతో 2017లో విడుదలైన ఐదు బైకులు

9-సీటింగ్ కెపాసిటి గల టియువి300 ప్లస్ 9.46 లక్షలకే

2018 బజాజ్ డామినర్

2018 బజాజ్ డామినర్ 400 బైకులో అదే 373సీసీ కెపాసిటి గల ఫ్యూయల్ ఇంజెక్టడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 34.5బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2018 బజాజ్ డామినర్

బజాజ్ ఆటో సరికొత్త 400సీసీ కెపాసిటి గల డిఓహెచ్‌సి ఇంజన్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఇంజన్‍‌ను నూతన బ్రాండ్ పేరుతో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. అంతే కాకుండా, తమ అవెంజర్ 220 బైకులో డిజైన్ పరంగా మార్పులు చేసి రీలాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

2018 బజాజ్ డామినర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్పోర్టివ్ మోటార్ సైకిళ్ల మీద దృష్టి పెట్టిన బజాజ్ ఇప్పటికే ఎన్నో స్పోర్ట్స్ తరహా బైకులను లాంచ్ చేసింది. అయితే, ఎక్కువ ఇంజన్ కెపాసిటి గల సెగ్మెంట్లోకి డామినర్ 400 ద్వారా ప్రవేశించిన బజాజ్‌కు ఆశించిన ఆదరణ కరువైంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్రూయిజర్ బైకులు, మహీంద్రా మోజో మరియు కెటిఎమ్ డ్యూక్ 390 బైకులకు పోటీగా నిలిచిన డామినర్ 400 ఇప్పుడు 2018లో రీలాంచ్‌కు సిద్దమైంది. అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Bajaj Dominar 400 Spotted — Gets New Colour Option
Story first published: Wednesday, December 27, 2017, 11:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark