విసిగిపోయిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చివరికి ఇలా: వైరల్‌గా మారిన ఫోటో

Written By:

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మడకశిర సమీపంలో ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఫ్యామిలీ మొత్తాన్ని బైకు మీద తీసుకెళుతున్న వ్యక్తి ముందు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బైకు మీద ఫ్యామలీతో ప్రయాణిస్తున్న వ్యక్తి విసిగిపోయిన పోలీస్,

ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని మడకశిర సర్కిల్‌లో జరిగింది. ఓ వ్యక్తి బైకు ఫ్యూయల్ ట్యాంక్ మీద తన ఇద్దరు కుమారుల్ని, తనతో పాటు మరో ఇద్దరు మహిళలను వెనుక సీటు మీద కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తుండగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శుభ్ కుమార్ అతడిని నిలబెట్టి మీరు ఎంత చెప్పినా మారరా... అంటూ ఇలా నమస్కరించాడు.

శుభ్ కుమార్ మాట్లాడుతూ, "నేను కేవలం కొద్ది సేపటి క్రితమే రహదారి భద్రత పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించాను. అందులో ఇతడు కూడా పాల్గొన్నాడు. అయితే, కార్యక్రమం అనంతరం కూడా ఇతను తనతో పాటు మరో నలుగురిని బైకు మీద తీసుకెళ్లడాన్ని చూసి నా మతిపోయింది. ఇంత భయంకరంగా ప్రయాణించడం పట్ల నాకే అసంతృప్తి, నిస్సహాయత మరియు నిరాశ కలుగుతోందని చెప్పుకొచ్చాడు."

బైకు మీద ఫ్యామలీతో ప్రయాణిస్తున్న వ్యక్తి విసిగిపోయిన పోలీస్,

భద్రత గురించి జరిపిన మీటింగులో, మీ గురించి మాత్రమే కాదు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించమని చెప్పాను. ఎలాంటి భాద్యత లేకుండా, మూర్ఖంగా ఇద్దరు పిల్లలను చిన్న పెట్రోల్ ట్యాంక్ మీదు కూర్చోబెట్టుకుని, మరో ఇద్దరు మహిళలను వెనుక సీటు మీద అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాడు. నేను చెప్పిందంతా విన్న తర్వాత కూడా ఇలా వెళుతున్నావేంటని ప్రశ్నిస్తే భాద్యతారహితంగా చిన్న నవ్వు నవ్వాడని చెప్పుకొచ్చాడు. మీలాంటి వాళ్లను మార్చడం నా వల్ల కాదని తీవ్ర నిరాశతో ఇలా రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బైకు మీద ఫ్యామలీతో ప్రయాణిస్తున్న వ్యక్తి విసిగిపోయిన పోలీస్,

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రమాదం జరగనంత వరకు ఏమవుతుందిలే అనే భావనలో చాలా మంది ఉంటారు. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహిరించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు మరియు ప్రాణాలు దక్కించుకుని అవయలోపం జరిగిన వారి వేదనఊహించుకుంటే నిర్లక్ష్యం ఎంతో మూర్ఖత్వమో తెలుస్తుంది.

మీ భద్రత గురించి మాత్రమే కాదు మీ ఫ్యామిలీ, మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరు లేని లోటు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. టైమ్ వచ్చినపుడు ఎవరైనా పోవాల్సిందే కాని చిన్న చిన్న భద్రత నియమాలను పాటిస్తే పెద్ద ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

పాఠకులకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు చిన్న విన్నపము, బైకు మీద వెళ్లే వారు హెల్మెట్ మరియు కారులో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోండి.

English summary
Read In Telugu: Police officer frustrated due to careless riding
Story first published: Tuesday, October 10, 2017, 17:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark