అప్రిలియా లోని ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్ స్కూటర్ల ఫోటోలు

Written By:

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అప్రిలియా గత ఏడాది ఆగష్టులో పియాజియో సమక్షంలో విపణిలోకి తమ మొట్టమొదటి స్కూటర్ ఎస్ఆర్150 ను విడుదల చేసింది. అనతి కాలంలో మంచి విజయాన్ని అందుకుని భారత దేశపు అత్యుత్తమ ప్రీమియమ్ 150సీసీ స్కూటర్‌గా మొదటి స్థానంలో నిలిచింది.

అప్రిలియా ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్

స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన్ ఇంజన్ మరియు నాణ్యమైన శరీర భాగాలను అందివ్వడం ఈ విజయానికి ప్రధానం కారణం అని స్పష్టమయ్యింది. ఇంకే ముంది, ఎక్ట్సీరియర్ బాడీ మీద రేస్ ఎడిషన్ తరహాలో మోటోజిపి బాడీ డీకాల్స్ జోడించి రేస్ ఎడిషన్ స్కూటర్‌గా ఎస్‌ఆర్ 150 ను తమ రెండవ ఉత్పత్తిగా విడుదల చేసింది.

అప్రిలియా ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులో శక్తివంతమైన 154.4సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 11.3బిహెచ్‌పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ధరలు

ధరలు

  • ఎస్ఆర్ 150 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 68,806 లు
  • ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 70,888 లు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
అప్రిలియా ఎస్ఆర్150 మరియు రేస్ ఎడిషన్

అప్రిలియా స్కూటర్లకు చెందిన మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్రిలియా ఎస్ఆర్150 ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి

 

English summary
Aprilia Sr150 And Sr150 Race Edition Gallery
Please Wait while comments are loading...

Latest Photos