అగ్రస్థానమే లక్ష్యం: బజాజ్ దశ తిరిగే ప్రణాళికలు

Written By:

భారతదేశపు దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇండియన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని మార్చేయడానికి సిద్దం అవుతోంది. బజాజ్ తమ వద్ద ఉన్న మొత్తం ఏడు రకాల ఉత్పత్తుల్లో మరిన్ని కొత్త మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల మార్కెట్ వాటాను పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సర ప్రారంభం ఏప్రిల్ 2018 నాటికి 26 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.

Recommended Video
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

బజాజ్ వార్షిక సమావేశంలో, ఈ ఏడాది చివరి నాటికి బజాజ్ వద్ద ఉన్న ఏడు ప్రొడక్ట్ బ్రాండ్లు: సిటి, ప్లాటినా, డిస్కవర, వి, అవెంజర్, పల్సర్ మరియు డామినర్ మోడళ్ల క్రింద కొత్త మోడళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు బజాజ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 14 నుండి 20 శాతానికి పెరిగింది. మరో 6 శాతం మార్కెట్ వాటాను సాధించి 20 నుండి 26శాతానికి పెంచే ప్రణాళికల్లో ఉంది.

బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

దేశీయ వాహన పరిశ్రమలో వచ్చిన బిఎస్-IV ఇంజన్‌ల అప్‌గ్రేడ్ మరియు నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి అమలు వంటి రెండు కుదుపులతో బజాజ్ ఆటో విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం సేల్స్ పెంచుకునేందుకు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది.

బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ప్రస్తుతం విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవుతున్న పల్సర్ ఎన్ఎస్200 ఎఫ్ఐ వేరియంట్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది. అదే విధంగా 160సీసీ సెగ్మెంట్లోకి ఎన్ఎస్ 160 మోడల్‌ను కూడా విడుదల చేసింది.

బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

కొత్తగా అభివృద్ది చేసి, విడుదల చేయనున్న మోటార్ సైకిళ్ల గురించి బజాజ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గత 18 నెలల కాలంలో బజాజ్ విడుదల చేసిన మోటార్ సైకిళ్లు వాటికి పోటీగా ఉన్న ఉత్పత్తుల కంటే మంచి సేల్స్ సాధిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

బజాజ్ నుండి కొత్త మోటార్ సైకిళ్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో దేశీయ విపణిలో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో పోల్చుకుంటే బజాజ్ వద్ద విసృత శ్రేణి ఉత్పత్తులు ఉన్నాయి. దీనికి తోడు మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెడితే మార్కెట్ వాటా పెరగడం గ్యారంటీ.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Auto To Launch New Motorcycles In India
Story first published: Monday, July 24, 2017, 16:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark