అవెంజర్ 400 ను విడుదల చేయనున్న బజాజ్: పూర్తి వివరాలు

Written By:

భారత దేశపు దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో గత నెలలో డామినర్ 400 మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, బజాజ్ లైనప్‌లో ఉన్న అవెంజర్ శ్రేణిలో అత్యంత శక్తవంతమైన మోటార్ సైకిల్‌ను చేర్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

బజాజ్ ఆవెంజర్ 400

మోటార్ ఆక్టేన్ అనే ఆన్‌లైన్ వార్తా వేదిక, పూనే ఆధారిత మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ తమ లైనప్‌లో ఉన్న అవెంజర్ శ్రేణిలో గరిష్ట సామర్థ్యం గల క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను అవెంజర్ 400 పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

బజాజ్ ఆవెంజర్ 400

బజాజ్ ఆటో ఈ అవెంజర్ 400 లో 375సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందిస్తోంది. దీనిని ప్రత్యేకించి హైవే రైడింగ్ కోసం బజాజ్ నిర్మిస్తోంది.

బజాజ్ ఆవెంజర్ 400

2017 మధ్య భాగానికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న ఇది సుమారుగా 35 నుండి 38 బిహెచ్‌పి మధ్య పవర్ మరియు 32 నుండి 34ఎన్ఎమ్ మధ్య టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ ఆవెంజర్ 400

ప్రస్తుతం బజాజ్ లైనప్‌లో అవెంజర్, పల్సర్ మరియు డిస్కవర్ వంటి మూడు ప్రధాన బ్రాండింగ్ పేర్లతో బైకులు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య బజాజ్ విడుదల చేసిన డామినర్ నూతన బ్రాండ్‌గా నిలిచింది.

బజాజ్ ఆవెంజర్ 400

బజాజ్ తమ పల్సర్ లోని 200ఎన్ఎస్ వేరియంట్ ను బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్‌తో మల్లీ విడుదల చేయనుంది. ఇప్పుడు తమ లైనప్‌లోని అన్ని మోడళ్లలో కూడా బిఎస్-IV ఇంజన్‌లను పరిచయం చేస్తోంది బజాజ్.

బజాజ్ ఆవెంజర్ 400

అవెంజర్ శ్రేణిలో టూరింగ్ బైకుల తరహా కాకుండా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఈ అవెంజర్ 400 ను భారీ శరీరాకృతితో నిర్మించనుంది. ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందిస్తుండటం వలన మిగతా వాటితో పోల్చితే పరిమాణంలో పెద్దగా ఉండేలా నిర్మిస్తోంది.

బజాజ్ ఆవెంజర్ 400

బజాజ్ ఈ అవెంజర్ 400 ను సుమారుగా రూ. 1.75 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ మోటార్ సైకిల్‌కు బలమైన పోటీనివ్వనుంది.

బజాజ్ ఆవెంజర్ 400

యమహా ఇండియా తాజాగ ఇండియన్ మార్కెట్లోకి ఎఫ్‌జడ్25 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీనికి చెందిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేయండి...

 

Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj Auto To Launch Avenger 400 In Mid-2017; Will Use Dominar’s Engine
Story first published: Wednesday, January 25, 2017, 11:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos