రాయల్ ఎన్ఫీల్డ్ థండర్డ్ బర్డ్‌కు పోటీగా బజాజ్ అవెంజర్ 400

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్డ్ బర్డ్ మోటార్ సైకిల్‌కు బజాజ్ ఆటో పోని సృష్టిస్తుందని ఎప్పుడైనా ఊహించారా...? చిన్న బైకులను తయారు చేసుకునే బజాజ్ రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీని తయారు చేయడమేంటని చాలా మంది అనుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడిది నిజమవబోతోంది.

బజాజ్ అవెంజర్ 400

బజాజ్ గత ఏడాది విడుదల చేసిన డామినర్ 400 మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైకులను పోటీనిస్తుండగా, ఇప్పుడు థండర్డ్ బర్డ్ మోటార్ సైకిల్‌కు పోటీగా అవెంజర్ 400 ను బజాజ్ అభివృద్ది చేస్తోంది. దీని విడుదల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

Recommended Video - Watch Now!
[Telugu] Yamaha Launches Dark Night Variants - DriveSpark
బజాజ్ అవెంజర్ 400

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, బజాజ్ ఆటో అవెంజర్ మోటార్ సైకిల్‌ను పెద్ద వెర్షన్‌లో విడుదలకు సిద్దం చేస్తున్నట్లు స్పష్టమయ్యింది. అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్‌కు పోటీనిచ్చే ఈ మోటార్ సైకిల్ అతి త్వరలో విడులవ్వనున్నట్లు తెలిసింది.

బజాజ్ అవెంజర్ 400

సాంకేతికంగా బజాజ్ అవెంజర్ 400 క్రూయిజర్ మోటార్ సైకిల్‌లో 400సీసీ ఇంజన్ రానుంది. ఇది విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 350 మరియు 500 లతో పాటు యుఎమ్ రెనిగేడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

బజాజ్ అవెంజర్ 400

బజాజ్ కొత్తగా డామినర్ 400 కోసం అభివృద్ది చేసిన అదే 373సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రానున్నది. ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న అవెంజర్ లైనప్‌లో అవెంజర్ 150 మరియు 220 మోడళ్లు ఉన్నాయి. వీటికి పల్సర్ 150 మరియు 220 నుండి సేకరించిన అందించింది.

బజాజ్ అవెంజర్ 400

అవెంజర్ 400 బైకులో 373సీసీ కెపాసిటి గల ఇంజన్ అందించేందుకు మోఢిఫైడ్ ఫ్రేమ్ పొందనుంది. డామినర్ 400 లో ఉన్న ఇదే ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే క్రూయిజర్ వెర్షన్‌లోని ఇంజన్ దీని కంటే తక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ అవెంజర్ 400

డామినర్‌లో వినియోగిస్తున్న ఇంజన్‌లో గల ఫోర్ వాల్వ్ హెడ్, లిక్విడ్ కూలింగ్, ట్రిపుల్ స్పార్క్ ప్లగ్గులు మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ పరికరాలను అవెంజర్ 400 లో కూడా అందివ్వనుంది. వీటితో పాటు డామినర్ 400 తరహాలో డ్యూయల్ చానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ రానుంది.

బజాజ్ అవెంజర్ 400

బజాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద టార్గెట్ చేస్తూ డామినర్ 400 మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. అయితే బజాజ్ ఊహించినట్లు డామినర్ ఆశించిన ఫలితాలు కనబరచలేకపోయింది. అయితే, విదేశాల్లో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు డామినర్ ఇండియా సేల్స్ కంటే ఎగుమతులే అధికంగా ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ 400

ధరకు తగ్గ విలువలతో టూ వీలర్లను ఉత్పత్తి చేసే సంస్థగా బజాజ్ పేరుగాంచింది. మరియు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం మరియు స్పెసిఫికేషన్స్‌తో వస్తే థండర్డ్‌బర్డ్‌కు ప్రదాన పోటీగా అవెంజర్ 400 నిలవడం సాధ్యపడుతుంది.

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Avenger 400 Cruiser In The Works; Should Royal Enfield Be Worried?
Story first published: Saturday, October 28, 2017, 16:27 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark