రూ. 29,988 లతో విడుదలైన బజాజ్ సిటి100 బిఎస్-IV బైక్

Written By:

బజాజ్ ఆటో తమ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సిటి100 లో బిఎస్4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ గెడ్ ల్యాంప్ ఫీచర్‌ను అందిస్తూ రూ. 29,988 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త 2017 బజాజ్ సిటి100 బిఎస్4 మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

సరికొత్త 2017 బజాజ్ సిటి100 మూడు విభిన్న వేరియంట్లలో అందుహబాటులో ఉంది. అందులో ప్రారంభ వేరియంట్ రౌండ్ హెడ్ ల్యాంప్ కలిగి ఉంటే మిగతా రెండు వేరియంట్లు ఆధునిక స్పోర్టివ్ హెడ్ ల్యాంప్ కలిగి ఉన్నాయి. మరియు సిటి100 టాప్ ఎండ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌తో కూడా ఎంచుకోవచ్చు.

సరికొత్త 2017 బజాజ్ సిటి100 ధరలు

సరికొత్త 2017 బజాజ్ సిటి100 ధరలు

  • సిటి100బి ధర రూ. 29,988 లు
  • సిటి100 ధర రూ. 35,389 లు
  • సిటి అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 38,981 లు
గమనిక అన్ని ధరలు ఆన్ రోడ్ ఢిల్లీగా ఉన్నాయి.
బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

సాంకేతికంగా 2017 బజాజ్ సిటి100 బైకులో 99.27సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ బిఎస్-IV ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.1బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న సిటి100 బైకు వేగం గరిష్టంగా గంటకు 99కిలోమీటర్లుగా ఉంది.

బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

సరికొత్త 2017 బజజ్ సిటి100 లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్స్ ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ముందు మరియు వెనుక చక్రాలకు 110ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

అల్లాయ్ వీల్ వేరియంట్ బజాజ్ సిటి100 బైకు బరువు 108 కిలోలుగా ఉంది. అదే సాధారణ స్టీల్ వీల్ బజాజ్ సిటి100 బరువు అల్లాయ్ వీల్ వేరియంట్ కన్న ఒక కిలో ఎక్కువగానే ఉంది.

బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

బజాజ్ సిటి100బి వేరియంట్లో 10.5-లీటర్ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్, పొడవాటి సీటు, మూడు అంగుళాలు వెడల్పు ఉన్న టైర్లు వంటివి ఉన్నాయి.

బిఎస్4 బజాజ్ సిటి 100 విడుదల

బజాజ్ సిటి100 రెండు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, ప్లేమ్ రెడ్ మరియు ఎబోని బ్లాక్. ఎబోనీ బ్లాక్ కలర్ వేరియంట్‌ను బ్లూ మరియు రెడ్ అనే రెండు డీకాల్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

English summary
Read in telugu to know about Bajaj CT100 BS-IV Launched In India. Read more in telugu about bs4 bajaj ct100 prices, engine, features and more.
Story first published: Thursday, April 13, 2017, 15:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark