జిఎస్‌టి ప్రభావం: అన్ని బజాజ్ బైకుల మీద భారీగా తగ్గిన ధరలు

Written By:

జిఎస్‌టి అమలైతే ప్రస్తుతం మోటార్ వాహనాల మీద పన్ను రద్ద అయ్యి, అన్ని వాహనాల మీద నిర్ధిష్టంగా 28 శాతం పన్ను మాత్రమే అమలుకానుంది. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌తో పోల్చుకుంటే ఈ 28 శాతం తక్కువగానే ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ తగ్గుముఖం పట్టడంతో కార్లు మరియు బైకులు ధరలు భారీ మొత్తంలో తగ్గనున్నాయి.

తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బజాజ్ తమ అన్ని మోటార్ సైకిళ్ల మీద భారీ మొత్తం మీద ధరలు తగ్గించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ అన్ని మోడళ్ల మీద భారీ తగ్గిన ధరలు

జిఎస్‌టి అమలు కానున్న జూలై 1, 2017 వరకు వేచి చూడకుండా, ఇప్పటి నుండి ధరలను తగ్గించి విక్రయాలను పెంచుకునే బాట పడుతున్నాయి. వాహన తయారీ సంస్థలు. వివిధ రాష్ట్రాలు మరియు మోడల్ ఆధారంగా గరిష్టంగా రూ. 4,500 వరకు తగ్గించినట్లు బజాజ్ పేర్కొంది.

బజాజ్ అన్ని మోడళ్ల మీద భారీ తగ్గిన ధరలు

జిఎస్‌టికి అనుగుణంగా ధరలను తగ్గించి, వాటి ప్రతిఫలాలు ఇప్పటి నుండే కస్టమర్లకు అందివ్వడానికి బజాజ్ చొరవ తీసుకుంది. అందులో భాగంగానే జిఎస్‌టి అమలుకు పదిహేను రోజులు ముందుగానే ధరలను తగ్గించినట్లు పేర్కొన్నాడు బజాజ్ ఆటో మోటార్ సైకిల్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్.

బజాజ్ అన్ని మోడళ్ల మీద భారీ తగ్గిన ధరలు

జిఎస్‌టి లోని ట్యాక్స్ ఆధారంగా ధరలను సవరణ చేపట్టిన మొట్టమొదటి కంపెనీ బజాజ్ ఆటో అని ఆయన చెప్పుకొచ్చాడు. మరియు ధరలను తగ్గించి, సవరణల అనంతరం ఖరారు చేసిన కొత్త ధరలు జూన్ 14, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.

బజాజ్ అన్ని మోడళ్ల మీద భారీ తగ్గిన ధరలు

జిఎస్‌టి లోని ట్యాక్స్ కలుపుకుని తయారీ ఖర్చులతో సహా తమ బైకులకు సంభందించిన ఖచ్చితమైన ఎక్స్-షోరూమ్ ధరలను పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. బజాజ్ బైకుల ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరలు ఏ మేరకు ఉంటాయో అని తెలుసుకోవాలంటే జూలై 1, 2017 వరకు వేచి చూడక తప్పదు మరి.

 డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిఎస్‌టి అమల్లోకి వస్తే, తగ్గనున్న ధరలను ముందుగానే తమ బైకుల మీద తగ్గించింది. దేశీయ వాహన పరిశ్రమలో జిఎస్‌టి ప్రతిఫలాలను ముందుగా అందించింది బజాజ్. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు సమీపంలోని బజాజ్ షోరూమ్‌కి వెళ్లి మీకు నచ్చిన బైకును ఎంచుకోండి...

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu Bajaj Cuts Prices Across Entire Product Range
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark