2017 మోడల్‌గా ఇండియన్స్ మెచ్చిన డిస్కవర్ 125 బైకు విడుదల

Written By:

అన్ని మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వ నియమాన్ని అనుసరిస్తూ బజాజ్ తమ లైనప్‌లో ఉండే మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఇంజన్‌లను అందివ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే నూతన ఇంజన్‌తో పాటు స్వల్ప ఎక్ట్సీరియర్ మార్పులతో పాటు కొన్ని ఫీచర్లను కూడా జోడించింది.

2017 బజాజ్ డిస్కవర్ 125

  • 2017 బజాజ్ డిస్కవర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 50,559 లు
  • 2017 బజాజ్ డిస్కవర్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 52,559 లు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మునుపటి డ్రమ్ బ్రేక్ వేరియంట్ కన్నా దీని ధర రూ. 1,464 లు పెరిగింది.

2017 బజాజ్ డిస్కవర్ 125

నూతన కలర్ ఆప్షన్‌లతో 2017 బజాజ్ డిస్కవర్ ఫ్రెష్ లుక్‌ కలిగి ఉంది. ప్రస్తుతం ఇది ఎబోనీ బ్లాక్ తో డీప్ రెడ్ గ్రాఫిక్స్, ఎబోనీ బ్లాక్ తో డీప్ బ్లూ గ్రాఫిక్స్, ఎలక్ట్రాన్ బ్లూ మరియు ఫ్లేమ్ రెడ్ వంటి రంగుల్లో లభించును.

2017 బజాజ్ డిస్కవర్ 125

డిజైన్ విషయానికి వస్తే ఇందులో ఎలాంటి మార్పులు సంభవించలేదు. అయితే 2017 బజాజ్ డిస్కవర్ 125లో నూతనంగా 35వాట్ సామర్థ్యం ఉన్న డిసి హెడ్ ల్యాంప్ మరియు వెనుక వైపున విశాలమైన టైరును అందివ్వడం జరిగింది.

2017 బజాజ్ డిస్కవర్ 125

సాంకేతికంగా 2017 బజాజ్ డిస్కవర్ 125లో 124.6సీసీ సామర్థ్యం గల బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలదు, 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 11బిహెచ్‌పి పవర్ మరియు 10.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 బజాజ్ డిస్కవర్ 125

బ్రేకింగ్ వ్యవస్థలో 2017 బజాజ్ డిస్కవర్ 125లో ముందు మరియు వెనుక వైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్లో ముందు వైపున 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు, వెనుక వైపున యథావిదిగా డ్రమ్ బ్రేక్ కలదు.

2017 బజాజ్ డిస్కవర్ 125

సరికొత్త 2017 డిస్కర్ 125 మొత్తం బరువు 120.5కిలోలుగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 100కిలోమీటర్లు మరియు ఇది లీటర్‌కు 82.4కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

2017 బజాజ్ డిస్కవర్ 125

బజాజ్ 2016 డిసెంబర్‌లో విపణిలోకి డామినర్ 400 క్రూయిజ్ బైకును విడుదల చేసింది. మరిన్ని డామినర్ 400 ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 
Read more on: #బజాజ్ #bajaj
English summary
2017 Bajaj Discover 125 Launched In India; Prices Start At Rs 50,559
Story first published: Monday, March 13, 2017, 18:18 [IST]
Please Wait while comments are loading...

Latest Photos