మరింత ప్రియమైన బజాజ్ డామినర్ 400: విడుదల తరువాత రెండవసారి పెరిగిన ధరలు

Written By:

బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకు మీద విడుదల తరువాత రెండవ సారి ధరల పెంపు చేపట్టింది. రూ. 1,000 ల వరకు డామినర్ ధర పెరిగింది. డామినర్ పరిచయమైన ధరతో పోల్చుకుంటే ఇప్పుటి రూ. 3,000 ల వరకు పెరిగింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకును డిసెంబర్ 2016లో రూ. 1.36 లక్షలతో ప్రారంభ వేరియంట్‌ను, రూ. 1.5 లక్షల ధరతో ఏబిఎస్ వేరియంట్‌ను ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ ఆటో ఇండియా లైనప్‌లో అత్యధిక ధరతో, స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్లో రాణిస్తున్న బైక్ డామినర్ 400. ఇందులో కెటిఎమ్ ఆధారంతో నిర్మించిన ఇంజన్‌ను అందివ్వడం జరిగింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

సాంకేతికంగా బజాజ్ డామినర్ 400లో 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ తమ డామినర్ 400 స్పోర్ట్స్ టూరర్ బైకులో ట్రిపుల్ స్పార్ట్ టెక్నాలజీని అందించింది. మరియు ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

అత్యుత్తమ ఫీచర్లతో జోడింపుతో రెండు మోడళ్లకు (ఏబిఎస్ మరియు నాన్-ఏబిఎస్) విభిన్నమైన ధరను నిర్ణయించింది. డామినర్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు; ఎల్ఇడి హెడ్ లైట్లు, డ్యూయల్ ఛానెల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్లో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390 కన్నా డామినర్ 400 అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి. అయితే నిజానికి ఇది మహీంద్రా మోజో కు గట్టి పోటీనిస్తోంది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

ఏదేమైనప్పటికీ బజాజ్ తమ డామినర్ 400 మీద విడుదలప్పటి నుండి రెండు సార్లు ధరలను పెంచింది. జిఎస్‌టి అమల్లోకి వస్తే డామినర్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డామినర్ కొనుగోలు చేసే వారు ఈ జూన్ లోపే ఎంచుకోవడం ఎంతో ఉత్తమం.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu Bajaj Dominar 400 Price Hiked

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark