బజాజ్ డామినర్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్ల మధ్య ముదురుతున్న రచ్చ

Written By:

బజాజ్ ఆటో రాయల్ ఎన్ఫీల్డ్‌ను ట్రోల్ చేస్తూ ఓ వీడియోను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ పాత్ డిజైన్, టెక్నాలజీ మరియు గడబిడ ఇంజన్‌ల గురించి ఫన్ క్రియేట్ చేస్తూ ఆ వీడియోను చిత్రీకరించింది. అయితే, రాయిల్ ఎన్ఫీల్డ్ ప్రేమికుల్లో ఇది తీవ్ర వ్యతిరేకతను సృష్టించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ డామినర్ యాడ్ వీడియో

రాయల్ ఎన్ఫీల్డ్ అధికారికంగా స్పందించలేదు. అయితే బజాజ్ డామినర్ కోసం తీసిన వీడియోలో రాయల్ఎన్ఫీల్డ్‌ను తక్కువ చేయడాన్ని సహించని రాయల్ ఎన్ఫీల్డ్ కమ్యూనిటి, బజాజ్ డామినర్ యాడ్ వీడియోకు వ్యతిరేకంగా రివేంజ్ కోసం ఒక కొత్త వీడియోని క్రియేట్ చేసింది.

బజాజ్ డామినర్ యాడ్ వీడియో

రాయల్ ఎన్ఫీల్డ్ చిత్రీకరించిన వీడియోలో, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అత్యంత కఠినమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నపుడు తీసిన వీడియోకు చివరలో డామినర్ యాడ్‌ వీడియోలో ఉన్న ఏనుగుల గుంపును ఉంచి "ఫీల్ లైక్ ఎ కింగ్" అనే క్యాప్షన్ జత చేశారు.

Recommended Video
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ డామినర్ యాడ్ వీడియో

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల పట్ల కొంత మంది కష్టమర్లలో నాణ్యతపరమైన అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. తీవ్రమైన వైబ్రేషన్స్ మరియు తయారీ లోపాలతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ గడిచిన త్రైమాసికంలో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ వృద్దిని నమోదు చేసుకుంది.

బజాజ్ డామినర్ యాడ్ వీడియో

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం 750సీసీ కెపాసిటి గల ఇంజన్ మీద పనిచేస్తోంది. ఈ మోటార్ సైకిల్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. అంతే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఉన్న హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైకు ఇప్పుడు బిఎస్-4 ఇంజన్‌తో ప్రవేశపెడుతోంది.

బజాజ్ డామినర్ యాడ్ వీడియో

ఇండియన్ మార్కెట్లోని 350సీసీ-500సీసీ సెగ్మెంట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. కేవలం క్లాసిక్ మోటార్ సైకిళ్ల విక్రయాలు బజాజ్ పల్సర్ కన్నా ఎక్కువగా ఉన్నాయి.

బజాజ్ డామినర్ యాడ్ వీడియో

ఏదేమైనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ మరియు బజాజ్ ఫ్యాన్స్ మద్య వివాదం అలాగే ఉంది. ఎన్ఫీల్డ్ మరియు డామినర్ బైకుల్లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. అయితే తయారీ సంస్థలు ఇందులో జోక్యం చేసుకోకుండా మిన్నుకుండిపోయాయి.

బజాజ్ డామినర్ కమర్షియల్ యాడ్: వీడియో...

రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ డామినర్‌కు వ్యతిరేకంగా తీసిన వీడియో....

English summary
Read In Telugu: Royal Enfield fans make a video against Dominar
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark