ఇండియన్ టూ వీలర్ హిస్టరీలో చారిత్రాత్మక డీల్‌: బజాజ్ చేతికి డుకాటి!

Written By:

భారత దేశపు అతి పెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ మరియు ఆస్ట్రియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజ భాగస్వామి కెటిఎమ్ కలిసి సంయుక్తంగా యూరోపియన్ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ డుకాటిని సొంతం చేసుకోనున్నాయి.

తాజాగా జరిగిన బజాజ్ వార్షిక సమావేశంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, ఓ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థను పూర్తిగా సొంతం చేసుకునే పనిలో చివరి దశ చర్చల్లో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో డుకాటి బజాజ్ చేతికి దక్కడం ఖచ్చితం అని మార్కెట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ డుకాటి డీల్

వోక్స్‌వ్యాగన్ విభాగంలో ఉన్న ఆడి డివిజన్ డుకాటి సంస్థను నిర్వహిస్తోంది. డుకాటి సంస్థను అమ్మకానికి పెట్టినపుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలో పోటీపడ్డాయి. ఇండియా నుండి రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్ మరియు అమెరికన్ మోటార్ సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్ కూడా డుకాటిని సొంతం చేసుకోవడానికి ముందుకొచ్చాయి.

బజాజ్ డుకాటి డీల్

రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ," ఒప్పందాన్ని పూర్తి చేసే చర్చలో చివరి దశలో ఉన్నాము. ఏ క్షణంలోనైనా పూర్తిగా కొనుగోలు చేసి, సొంతం చేసుకునే అవకాశం ఉంది. సదరు కంపెనీ మొగ్గు చూపితే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నాడు."

బజాజ్ డుకాటి డీల్

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కెటిఎమ్‌లో బజాజ్ 48 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో సరిగా పది సంవత్సరాల క్రితం ఏడాదికి 65,000 యూనిట్లుగా ఉన్న విక్రయాలు, బజాజ్ సారథ్యంలో ఇప్పుడు ఏడాదికి 2.5 లక్షల యూనిట్ల సేల్స్ నమోదవుతున్నాయి.

బజాజ్ డుకాటి డీల్

బజాజ్‌కు డుకాటి కంపెనీ అవసరం గురించి రాజీవ్ బజాజ్ స్పందిస్తూ, "ఇండియాలో స్పోర్ట్స్ బైకులను ఎంచుకునే వారికి కెటిఎమ్ మరియు బజాజ్ విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. అయితే హ్యార్లీ డేవిడ్సన్, ట్రయంప్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలు ఉత్పత్తి చేసే బైకుల సెగ్మెంట్లోకి బజాజ్ ఇంకా ప్రవేశించలేదని తెలిపాడు."

బజాజ్ డుకాటి డీల్

ప్రస్తుతం యూరోపియన్ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థతో జరుగుతున్న చర్చలు సఫలమైతే మరో వారం లేదా రెండు వారాల్లో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు. కమ్యూటర్ బైకులను ఉత్పత్తి చేస్తూనే, ప్రీమియమ్ మోటార్ సైకిళ్లను ఎంచుకునే కస్టమర్లను చేరుకోవడం కోసం కెటిఎమ్‌ తరహా డీల్ డుకాటితో కుదిరితే అతి పెద్ద బ్రాండ్‌గా అవతరించడం ఖాయం.

బజాజ్ డుకాటి డీల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2016 లో డుకాటి 55,451 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. ఒకవేళ బజాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే, డుకాటి బైకులను దేశీయంగానే ఉత్పత్తి చేయవచ్చు తద్వారా తయారీ ఖర్చులు తగ్గి బైకుల ధరల విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే మిడ్-ఇంజన్ కెపాసిటి ఉన్న మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో డుకాటి భారీ సేల్స్ సాధించడంలో ఎలాంటి సందేహం లేదు!

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Ktm Ducati Partnership Final Stages

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark