సరికొత్త ఫీచర్లతో బజాజ్ ప్లాటినా విడుదల: ధర మరియు ఫీచర్లు

Written By:

బజాజ్ ఆటో తమ ప్లాటినా కంఫర్టెక్ బైకును అదనపు ఫీచర్లతో ప్రవేశపెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. అధునాత ఫీచర్లతో జోడింపుతో వచ్చిన ప్లాటినా కంఫర్టెక్ ఇప్పటికే డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 46,656 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

ఇందులో పగటి పూట వెలిగ్ ఎల్ఇడి లైట్ మరియు రీడిజైన్ చేయబడిన ఇస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అప్‌డేటెడ్ ఫీచర్స్‌గా బజాజ్ పేర్కొంది. 100-110సీసీ సెగ్మెంట్లో టీవీఎస్ విక్టర్ ఎల్ఇడి లైట్లను పొందిన రెండవ బైకు బజాజ్ ప్లాటినా కంఫర్టెక్. మరియు ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన బైకు ఇది.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

గతంలో, ప్రతి టూ వీలర్‌లో కూడా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్‌లో ఉండాలని కేంద్ర సూచించింది. అయితే, రోజంతా హెడ్ ల్యాంప్ ఆన్‌లో ఉండటంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. దీనిని నివారించడానికి ఈ బైకులో ఎల్ఇడి లైటును బజాజ్ అందించింది.

Recommended Video - Watch Now!
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
బజాజ్ ప్లాటినా ఫీచర్లు

ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో పోల్చుకుంటే పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ సుమారుగా 88 శాతం పవర్ ఆదా చేస్తుందని బజాజ్ పేర్కొంది. బజాజ్ టూ వీలర్ లైనప్‌లో ప్రారంభ వేరియంట్ అయినప్పటికీ ప్లాటినా కంఫర్టెక్ బైక్‌కు మంచి డిమాండ్ ఉంది.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన బజాజ్ ప్లాటినా కంఫర్టెక్ గురించి బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ,"ప్రారంభ స్థాయి కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో కస్టమర్లకు అత్యుత్తమ రైడింగ్, హ్యాండ్లింగ్ మరియు సురక్షితమైన, సుఖవంతమైన రైడింగ్ కోసం మరిన్ని ఫీచర్లను జోడించినట్లు చెప్పుకొచ్చాడు."

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

బాడీ గ్రాఫిక్స్ మరియు ఎల్ఇడి లైట్ల జోడింపు మినహాయిస్తే, మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాంకేతికంగా బజాజ్ ప్లాటినా కంఫర్టెక్ బైకులో 102సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇందులోని ఇంజన్ గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ కథనం మేరకు ఇది లీటర్‌కు 104 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

రెగ్యులర్ బైకుతో పోల్చుకుంటే ప్లాటినా కంఫర్టెక్ బైకులో కుదుపులు 20 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. ప్లాటినా కంఫర్టెక్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

బజాజ్ ప్లాటినా ఫీచర్లు

బ్లాక్ మరియు రెడ్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ప్లాటినా విపణిలో ఉన్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్పోర్ట్, హోండా సిడి 110 డ్రీమ్ మరియు యమహా సెల్యూటో ఆర్ఎక్స్ బైకులతో పోటీని ఎదుర్కోనుంది.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Auto has launched the new Platina ComforTec with LED Daylight Running Lights (DRL) at a price of ₹ 46,656 (ex-showroom Delhi).
Story first published: Wednesday, October 11, 2017, 17:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark